Hindenburg on Adani: జాతీయవాదం పేరు చెప్పి మోసాల్ని కప్పి పుచ్చలేరు, అదానీకి హిండన్ బర్గ్ స్ట్రాంగ్ కౌంటర్
Hindenburg on Adani: అదానీ ఆరోపణలపై హిండన్‌బర్గ్ ఘాటుగా స్పందించింది.
![Hindenburg on Adani: జాతీయవాదం పేరు చెప్పి మోసాల్ని కప్పి పుచ్చలేరు, అదానీకి హిండన్ బర్గ్ స్ట్రాంగ్ కౌంటర్ Hindenburg on Adani's 413-page rebuttal Cannot obfuscate by nationalism, check details Hindenburg on Adani: జాతీయవాదం పేరు చెప్పి మోసాల్ని కప్పి పుచ్చలేరు, అదానీకి హిండన్ బర్గ్ స్ట్రాంగ్ కౌంటర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/30/7739148f626845e77aca5a692c91a76d1675057991306517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hindenburg on Adani:
దేశాభివృద్ధికి అదానీ ఆటంకం: హిండన్‌బర్గ్
ఇప్పుడు దేశవ్యాప్తంగా హిండన్‌బర్గ్ రీసెర్చ్ గురించే చర్చ. ఆ సంస్థ చేసిన ఆరోపణలతో ఉన్నట్టుండి అదానీ కంపెనీల షేర్లన్నీ నేల చూపులు చూశాయి. మొత్తం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. అయితే...ఇప్పటికే హిండన్ బర్గ్ కంపెనీ చేసిన ఆరోపణలపై గౌతమ్ అదానీ స్పందించారు. ఇది కేవలం తనపై ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర అని విమర్శించారు. దీనికి ఆ కంపెనీ కూడా అంతే ఘాటుగా
బదులి చ్చింది. జనవరి 30 వ తేదీన తాము వెలువరించిన రిపోర్ట్‌పై అదానీ చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది. కేవలం "జాతీయవాదం" అనే ముసుగు తగిలించుకుని మోసాల్ని కప్పి పుచ్చలేరంటూ తేల్చి చెప్పింది. అదానీ గ్రూప్ షేర్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఇప్పటికే ఆరోపణలు చేసిన ఆ కంపెనీ...కేవలం ఈ విషయాన్ని దృష్టి మరల్చడానికే అదానీ జాతీయవాదం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని స్పష్టం చేసింది. భారత్‌పై దాడి చేసేందుకే తాము ఈ రిపోర్ట్‌ను వెలువరించినట్టు చేసిన వ్యాఖ్యల్నీ కొట్టి పారేసింది. భవిష్యత్‌లో భారత్ అగ్రరాజ్యంగా ఎదుగుతుందన్న పూర్తి విశ్వాసం ఉందని వెల్లడించింది. అదే సమయంలో నేషనలిజం అనే ముసుగు కప్పుకుని ఇలా దేశ సంపదను దోచుకోడం వల్ల దేశాభివృద్ధికి అడ్డంకులు ఎదురవుతున్నాయని తెలిపింది. ధనికులైనా, ఎవరికీ తెలియన వారైనా సరే మోసం అనేది ఎప్పటికీ మోసమేనని స్పష్టం చేసింది. అంతే కాదు. తమ సంస్థ అదానీ గ్రూప్‌నకు మొత్తం 82 ప్రశ్నలు వేస్తే...అందులో 62 ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం చెప్పలేదని మండి పడింది. ఈ రిపోర్ట్ వచ్చిన తరవాత జనవరి 23 నుంచి 27 మధ్యలో అదానీ షేర్‌లు దాదాపు 20% మేర పతనం అయ్యాయి. అయితే...ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్ ఖండించిన తరవాత కాస్తో కూస్తో మళ్లీ పరిస్థితి మెరుగు పడింది.
అదానీ గ్రూప్ ఏం చెప్పిందంటే..
తమ షేర్ హోల్డర్లు, పబ్లిక్ ఇన్వెస్టర్లను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో హిండెన్ బర్గ్ నివేదిక రూపొందించినట్లు తెలిపారు. ఇది ఒక మానిప్యులేటివ్ డాక్యుమెంట్ అని ఆరోపించారు. మార్కెట్‌లో తప్పుడు ఆరోపణలు ప్రచారం చేసి మార్కెట్‌లో లాభాలు పొందాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పని చేసిందని భారతీయ చట్టాల ప్రకారం మోసంగా అభిప్రాయపడింది. ఇన్వెస్టర్ల లాభాల కోసం తను షార్ట్ ట్రేడ్స్ ను నిర్వహిస్తూనే తన టార్గెట్ ఆడియన్స్ దృష్టిని మరల్చడానికి హిండెన్ బర్గ్ ఈ ప్రశ్నలను సృష్టించిందని వేరే చెప్పనవసరం లేదని చెప్పింది. ఈ నివేదిక రెండు సంవత్సరాల దర్యాప్తు, సాక్ష్యాలను వెలికితీసినట్లు పేర్కొంది, కానీ ఇది సంవత్సరాలుగా పబ్లిక్ డొమైన్లో ఉన్న బహిర్గతమైన సమాచారమని తెలిపింది. వాటిలో ఎంపిక చేసిన అంశాలను అసంపూర్ణమైన సారాంశాలే ఇందులో ఉన్నాటి తప్ప మరేదీ లేదన్నారు. జనవరి 24న 'మాడోఫ్స్ ఆఫ్ మాన్హాటన్' హిండెన్బర్గ్ రీసెర్చ్ ప్రచురించిన నివేదికను చదివి దిగ్భ్రాంతికి గురయ్యామని, ఇది అబద్ధం తప్ప మరేమీ కాదని అదానీ గ్రూప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డాక్యుమెంట్ ఎంపిక చేసిన తప్పుడు సమాచారమని అదానీ గ్రూప్ తెలిపింది. నిరాధారమైన, పరువునష్టం కలిగించే ఆరోపణలే అని ఖండించింది.
Also Read: Stock Market News: ఫ్లాట్‌గా మొదలైన నిఫ్టీ, సెన్సెక్స్ - అదానీ ఎంటర్‌ప్రైజెస్ టాప్ గెయినర్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)