News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Basmati Rice Exports: బాస్మతీ బియ్యం ఎగుమతులపై నిషేధం! ఈ కండీషన్‌ మినహా...!

Basmati Rice Exports: బియ్యం ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అక్రమ ఎగుమతులను అడ్డుకొనేందుకు అనూహ్య నిర్ణయం తీసుకుంది.

FOLLOW US: 
Share:

Basmati Rice Exports: 

బియ్యం ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అక్రమ ఎగుమతులను అడ్డుకొనేందుకు అనూహ్య నిర్ణయం తీసుకుంది. బాస్మతీ ముసుగులో సాధారణ తెల్ల బియ్యం ఎగుమతులు చేస్తున్న వ్యాపారులకు పెద్ద షాకిచ్చింది. టన్ను ధర 1200 డాలర్ల కన్నా తక్కువ విలువైన బాస్మతీ బియ్యం ఎగుమతుల్ని నిషేధించింది. ప్రీమియం క్వాలిటీకి మాత్రమే అనుమతి ఇచ్చింది.

టన్ను బాస్మతీ బియ్యం ధర 1200 డాలర్లకు తక్కువన్న కాంట్రాక్టులను నమోదు చేయొద్దని APEDAను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ ఆదేశించింది. ఆ విలువ లోపు ఇప్పటికే కుదుర్చుకున్న కాంట్రాక్టులపై ఏం చేయాలన్న దానిపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తోంది. స్థానికంగా బియ్యం సరఫరాను పెంచేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. గతేడాది సెప్టెంబర్లో నూకల ఎగుతులను నిషేధించింది. గత నెల్లో సాధారణ తెల్ల బియ్యం ఎగుమతుల్నీ నిషేధించింది. చివరి వారంలో పారా బాయిల్డ్‌ బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఇక ప్రస్తుత ఆదేశాలతో అన్ని రకాల వెరైటీస్‌పై ఆంక్షలు విధించినట్టు అయింది.

'ఇకపై టన్ను ధర 1200 డాలర్లు మించిన బాస్మతీ బియ్యం ఎగుమతులకే అనుమతి ఇస్తారు. ఆ కాంట్రాక్టులకే రిజిస్ట్రేషన్‌ కమ్‌ అలొకేషన్‌ సర్టిఫికెట్‌ (RCAC) ఇస్తారు' అని కేంద్రం తెలిపింది. విదేశీ వాణిజ్య విధానం ప్రకారం బాస్మతీ ఎగుమతులకు RCAC కింద నమోదు చేసుకోవడం APEDA బాధ్యత. ఇక 1200 డాలర్లకు తక్కువ కాంట్రాక్టులను ఏపీఈడీఏ ఛైర్మన్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సమీక్షిస్తుంది.

'సాధారణంగా టన్ను బాస్మతీ బియ్యం ఎగుమతి ధర సగటున 1214 డాలర్లు ఉంటుంది. ఈ నెలలో మాత్రం కాంట్రాక్టు ధర 359 డాలర్లుగా నమోదైంది. ఈ రెంటింటి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్టు గమనించాం' అని కేంద్రం తెలిపింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత తక్కువ ధర కాంట్రాక్టులను ఏం చేయాలో నిర్ణయిస్తారు.

భారత బాస్మతీ బియ్యం ఎగుమతుల విలువ 2022-23లో 4.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. పరిమాణం 45.6 లక్షల టన్నులుగా నమోదైంది. ఇక బాస్మతీ యేతర బియ్యం విలువ 6.36 బిలియన్‌ డాలర్లు కాగా 177.9 లక్షల టన్నులు. అంతకు ముందు ఏడాది నాటి 129.47 మిలియన్‌ టన్నులతో పోలిస్తే 2022-23లో 135.54 మిలియన్‌ టన్నులకు బియ్యం ఉత్పత్తి పెరుగుతుందని అగ్రికల్చర్‌ మినిస్ట్రీ అంచనా వేసింది. తక్కువ వర్షపాతం వల్ల ఈ ఏడాది బియ్యం ఉత్పత్తి తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సహా అనేక రాష్ట్రాల్లో సగటు కన్నా తక్కువ వర్షాలే కురుస్తున్నాయి. ఎల్‌నినో ప్రతికూల ప్రభావం చూపిస్తోంది.

Also Read: ఆధార్‌తో బ్యాంక్‌ అకౌంట్‌ హ్యాక్‌ చేయొచ్చా!

Published at : 27 Aug 2023 06:18 PM (IST) Tags: Basmati rice Central Government Rice exports

ఇవి కూడా చూడండి

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

Rs 2000 Notes: సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

Petrol-Diesel Price 29 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol-Diesel Price 29 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Stocks To Watch 29 September 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Adani Group, ICICI Lombard, Emami

Stocks To Watch 29 September 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Adani Group, ICICI Lombard, Emami

Gold-Silver Price 29 September 2023: ఆరు నెలల కనిష్టంలో పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price 29 September 2023: ఆరు నెలల కనిష్టంలో పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం