By: ABP Desam | Updated at : 27 Dec 2021 06:56 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు అతి స్వల్పంగా పెరిగింది. రెండు రోజులుగా పసిడి ధర నిలకడగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా 10 గ్రాములకు రూ.10 పెరిగింది. వెండి ధర కిలోకు రూ.100 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,360 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,490 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.66,200గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,360 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,490గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,200 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,360 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,490గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,200గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో మాత్రం బంగారం ధరలు నేడు పెరిగాయి. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,520గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,660గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,310 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,310 గా ఉంది.
Also Read: GST changes: జనవరి 1 నుంచి జీఎస్‌టీలో మార్పులు.. ఉబెర్, ఓలాలో బుక్ చేస్తే పన్ను!
ప్లాటినం ధర నేడు ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం రూ.23,420 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Stock Market Today: 19,700 మీదే నిఫ్టీ ముగింపు - 173 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
Renovation Loan: మీ పాత ఇంటిని కొత్తగా మార్చేయండి - రెనోవేషన్ లోన్ రేట్లు, టాక్స్ బెనిఫిట్స్ ఇవిగో!
Cryptocurrency Prices: రెండు వేలు తగ్గిన బిట్‌కాయిన్! మిక్స్‌డ్ జోన్లో క్రిప్టోలు
Sugar Stocks: పెట్టుబడిని పరుగులు పెట్టించిన షుగర్ స్టాక్స్, ఇదంతా ఇథనాల్ ఎఫెక్టా?
Rs 2 Lakh Pension: మీరు 40ల్లోకి వచ్చారా, రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.2 లక్షల పెన్షన్ పొందాలంటే ఇప్పుడెంత పెట్టుబడి పెట్టాలి?
ACB Court Case : అక్టోబర్ నాలుగో తేదీకి ఏసీబీ కోర్టులో విచారణలు వాయిదా - కస్టడీ, బెయిల్ పిటిషన్లూ అప్పుడే !
IND vs AUS 3rd ODI: చితక్కొట్టిన కంగారూలు! టీమ్‌ఇండియా టార్గెట్ 353
Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'
Telangana Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు ఖాయం - ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు !
/body>