News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Gold-Silver Price 24 July 2023: కొండెక్కి కూర్చున్న గోల్డ్‌ - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

FOLLOW US: 
Share:

Gold-Silver Price Today 24 July 2023: యూఎస్‌ డాలర్‌ బలహీనపడడం, యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు 2 నెలల గరిష్టంలో కొనసాగుతోంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,963.90 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో ఆర్నమెంట్‌ బంగారం, స్వచ్ఛమైన పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కిలో కూడా స్థిరంగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు:

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,150 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,160 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 55,150 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర ₹ 60,160 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 80,500 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 55,550 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,600 కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 55,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,160 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 55,300 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,320 గా నమోదైంది. జైపుర్‌, లఖ్‌నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కోల్‌కతా (Gold Rate in Kolkata) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 55,150 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,160 గా ఉంది. నాగ్‌పుర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 55,150 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,160 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కేరళలో (Gold Rate in Kerala) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 55,150 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 60,160 గా ఉంది. భవనేశ్వర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.

ప్లాటినం ధర (Today's Platinum Rate)
10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 110 పెరిగి ₹ 25,350 వద్ద ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర ప్రభావం అనేక రంగాలపై పడింది. ఫలితంగా ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

Published at : 24 Jul 2023 05:19 AM (IST) Tags: Hyderabad Gold Price Silver Price Vijayawada Today's rate

ఇవి కూడా చూడండి

Richest  South Indian Actor: దక్షిణాదిలో సంపన్న నటుడు ఎవరో తెలుసా? రూ.3 వేల కోట్ల ఆస్తి, సొంత విమానం మామూలుగా లేదు మరీ!

Richest South Indian Actor: దక్షిణాదిలో సంపన్న నటుడు ఎవరో తెలుసా? రూ.3 వేల కోట్ల ఆస్తి, సొంత విమానం మామూలుగా లేదు మరీ!

Penalty on TCS: వారం రోజుల్లో టీసీఎస్‌కు రెండో భారీ షాక్‌, Q3 లాభాలు అమెరికాపాలు!?

Penalty on TCS: వారం రోజుల్లో టీసీఎస్‌కు రెండో భారీ షాక్‌, Q3 లాభాలు అమెరికాపాలు!?

Latest Gold-Silver Prices Today 28 November 2023: పట్టుకోలేనంత ఎత్తులో పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today 28 November 2023: పట్టుకోలేనంత ఎత్తులో పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Car Prices To Hike: కొత్త కారు కొనాలనుకుంటే వెంటనే తీసుకోండి, అతి త్వరలో రేట్లు పెరుగుతాయ్‌

Car Prices To Hike: కొత్త కారు కొనాలనుకుంటే వెంటనే తీసుకోండి, అతి త్వరలో రేట్లు పెరుగుతాయ్‌

Share Market Opening Today 28 November 2023: ఆరంభ శూరత్వం, ఆ వెంటనే నీరసం - ఈ రోజు మార్కెట్ల తీరిది

Share Market Opening Today 28 November 2023: ఆరంభ శూరత్వం, ఆ వెంటనే నీరసం - ఈ రోజు మార్కెట్ల తీరిది

టాప్ స్టోరీస్

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి