By: ABP Desam | Updated at : 02 Jan 2022 06:48 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు భారీగా పెరిగింది. నేడు గ్రాముకు రూ.35 మేర పెరిగింది. తాజాగా 10 గ్రాములకు రూ.350 పెరిగింది. వెండి ధర కిలోకు రూ.1,200 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,450 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,590 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.66,600గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,450 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,590గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,600 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,450 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,590గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,600గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో మాత్రం బంగారం ధరలు నేడు పెరిగాయి. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,590గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,730గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,150 గా ఉంది.
ప్లాటినం ధర నేడు ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు రూ.32 తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం రూ.22,670 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
Also Read: Kannauj IT Raid: పుష్ప.. పుష్పరాజ్.. ఫ్లవర్ అనుకుంటివా? అత్తరు.. ఈ కథే వేరు!
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: "హ్యాపీ న్యూ ఇయర్" చెప్పుకున్నంత ఈజీ కాదు.. చాలా భారమే ! మీపై ఎంత భారం పడబోతోందో చూడండి.. !
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
Gautam Adani: అదానీ రిటర్న్స్ - టాప్-20 బిలియనీర్స్ లిస్ట్‌లోకి రీఎంట్రీ, ఒక్కరోజులో రూ.లక్ష కోట్ల ర్యాలీ
Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంక్‌లకు 18 రోజులు సెలవులు, 6 రోజులు సమ్మె - ఇక మీ బ్యాంక్ పని అయినట్టే!
Deadlines in December: డెడ్‌లైన్స్ ఇన్ డిసెంబర్, వీటిని సకాలంలో పూర్తి చేయకపోతే మీకే నష్టం!
Downgraded Stocks: రిలయన్స్, ఎస్‌బీఐ కార్డ్ సహా 7 పాపులర్ స్టాక్స్ - ఇవి మీ దగ్గర ఉంటే జాగ్రత్త!
Latest Gold-Silver Prices Today 29 November 2023: రూ.63 వేలు దాటిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి
Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!
/body>