By: ABP Desam | Updated at : 01 Feb 2022 06:30 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు తగ్గింది. గ్రాముకు రూ.10 తగ్గి తులానికి రూ.100 మార్పు కనిపించింది. వెండి ధర కిలోకు రూ.100 మాత్రమే తగ్గుదల కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,900 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.48,990 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.100 తగ్గి రూ.65,400గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,990గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,400 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,900 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,990గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,400గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,270గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,390గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,990 గా ఉంది.
ప్లాటినం ధర నేడు ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర నేడు రూ.7 తగ్గి.. రూ.24,280 గా అయింది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Gold Rate Today 2nd July 2022: పసిడి ప్రియులకు బిగ్ షాక్, భారీగా పెరిగిన బంగారం ధర, దిగొచ్చిన వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ
Free Range Rover: రేంజ్ రోవర్ బంపర్ ఆఫర్ - ఉచితంగా స్పోర్ట్ కారు - క్లిక్ చేశారంటే?
Tax on Petrol, Diesel: పెట్రోల్, డీజిల్పై మరో పన్ను పెంచిన కేంద్రం! సామాన్యుడి పరిస్థితి ఏంటి?
Gold Rate Hike: బంగారం భగ భగ! దిగుమతి పన్ను రెట్టింపు చేసిన కేంద్రం!
Stock Market News: అల్లాడిస్తున్న మార్కెట్లు! ఉదయం 1000 డౌన్.. సాయంత్రానికి 111కు నష్టం!
Pavithra Lokesh: కావాలనే నన్ను బ్యాడ్ చేస్తున్నారు - పవిత్రా లోకేష్ ఎమోషనల్ కామెంట్స్
Defence Ministry: ఆర్మీ, నేవీలో అగ్నిపథ్ నియామకాలు ప్రారంభం, ఎయిర్ పోర్స్ లో 2.72 లక్షల దరఖాస్తులు
Horoscope 2nd July 2022: ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉండదు, జులై 2 మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
The warriorr Trailer: రామ్ 'ది వారియర్' ట్రైలర్ వచ్చేసిందోచ్ - యాక్షన్ పీక్స్