అన్వేషించండి

Forbes Top 100 Richest Indian: అంబానీ, అదానీ పోటాపోటీ! ఫోర్బ్స్‌ భారత టాప్‌-10 కుబేరులు వీరే

సంపద సృష్టిలో ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ పోటీపడుతున్నారు. ఫోర్బ్స్‌ జాబితాలోని భారతీయ కోటీశ్వరుల సంపద చివరి 12 నెలల్లో 257 బిలియన్‌ డాలర్లు పెరిగి 775 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.

సంపద సృష్టిలో రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, గుజరాత్‌ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ పోటీపడుతున్నారు. ఫోర్బ్స్‌ 2021 భారత కుబేరుల జాబితాలో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. గతేడాదితో పోలిస్తే వీరి ఆదాయం, సంపద గణనీయంగా పెరిగింది. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ గతేడాది భారత బిలియనీర్ల సంపద 50 శాతం పెరగడం ప్రత్యేకం.

Also Read: దిగొచ్చిన పుత్తడి, స్వల్పంగా పెరిగిన వెండి..ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలివే...

ఫోర్బ్స్‌ జాబితాలోని భారతీయ కోటీశ్వరుల సంపద చివరి 12 నెలల్లో 257 బిలియన్‌ డాలర్లు పెరిగి 775 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. కొన్ని నెలలుగా స్టాక్‌మార్కెట్లు పరుగులు పెట్టడం, మదుపర్లు భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతుండటమే ఇందుకు కారణం. జాబితాలోని 80 శాతం మంది సంపద భారీగా పెరగ్గా... 61 మంది కనీసం ఒక బిలియన్‌ డాలర్‌కు పైగా సంపద పెంచుకున్నారు.

Also Read: జియో సేవల్లో అంతరాయం.. #jiodown అంటూ యూజర్ల ఫిర్యాదులు

ముకేశ్‌ అంబానీ సంపద 92.7 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఆయన 2008 నుంచి ఫోర్బ్స్‌ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 74.8 బిలియన్‌ డాలర్లతో గౌతమ్‌ అదానీ రెండో స్థానానికి ఎగబాకారు. ఒక్క ఏడాదిలోనే ఆయన తన సంపదను అనూహ్యంగా పెంచుకున్నారు. సాఫ్ట్‌వేర్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, స్టీల్‌ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు టాప్‌-10లో నిలిచారు.

'కొవిడ్‌ 19 మహమ్మారి ఉన్నప్పటికీ భారత సామర్థ్యం, ఏదైనా సాధించగలమన్న పట్టుదలను ఈసారి జాబితా ప్రతిబింబించింది. స్టాక్‌ మార్కెట్లు పుంజుకోవడంతో భారతీయ కుబేరుల అదృష్టాలు మారాయి. వారు మరింత సంపదను ఆర్జించారు. కోటీశ్వరులు పెరుగుతున్నారు' అని ఫోర్బ్స్‌ ఆసియా, ఇండియా వెల్త్‌ ఎడిటర్‌ నాజ్‌నీన్‌ కర్మాణి తెలిపారు.

Also Read: రూ.10వేల లోపు మంచి కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్ల కోసం చూస్తున్నారా! అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో టాప్‌-5 ఇవే!

టాప్‌-10 కుబేరులు వీరే
* ముకేశ్‌ అంబానీ (92.7 బిలియన్‌ డాలర్లు)
* గౌతమ్‌ అదానీ (74.8 బిలియన్‌ డాలర్లు)
* శివ నాడార్‌ (31 బిలియన్‌ డాలర్లు)
* రాధాకిషన్‌ దమాని (29.4 బిలియన్‌ డాలర్లు)
* సైరస్‌ పూనావాలా (19 బిలియన్‌ డాలర్లు)
* లక్ష్మీ మిత్తల్‌ (18.8 బిలియన్‌ డాలర్లు)
* సావిత్రీ జిందాల్‌ (18 బిలియన్‌ డాలర్లు)
* ఉదయ్‌ కొటక్‌ (16.5 బిలియన్‌ డాలర్లు)
* పల్లోంజి మిస్త్రీ (16.4 బిలియన్‌ డాలర్లు)
* కుమార్‌ మంగళం బిర్లా (15.8 బిలియన్‌ డాలర్లు)

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election JPC:  జమిలీకి  జేపీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీకి జేపీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Nandamuri Mokshagna: మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election JPC:  జమిలీకి  జేపీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీకి జేపీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Nandamuri Mokshagna: మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
Embed widget