By: ABP Desam | Updated at : 06 Oct 2021 03:50 PM (IST)
Edited By: Ramakrishna Paladi
Amazon Festival Sale
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. ఫెస్టివ్ సేల్‌లో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బడ్జెట్లో, రూ.10వేల లోపు మంచి స్మార్ట్‌ఫోన్లు లభిస్తున్నాయి. తక్కువ ధరకే మంచి ఫీచర్లున్న ఫోన్లు సొంతం చేసుకొనేందుకు ఇదే మంచి అవకాశం. అందుకే మీ కోసం అందిస్తున్నాం బడ్జెట్ శ్రేణిలో టాప్-5 స్మార్ట్‌ఫోన్లు!
1.రెడ్‌మీ 9ఏ
అమెజాన్ సేల్‌లో రెడ్‌మీ 9ఏ స్మార్ట్‌ఫోన్ రూ.6,799కే లభిస్తోంది. సాధారణంగా ఈ ఫోన్‌ను మిగతా రోజుల్లో రూ.8,499కి విక్రయిస్తున్నారు. 13 మెగాపిక్సల్ కెమెరా, ఏఐ పోర్ట్రైట్, ఏఐ సీన్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీల కోసం 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 6.53 అంగుళాల హెచ్‌డీ డిస్ప్లే, 2జీబీ ర్యామ్, 32 ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఫోన్ ఇస్తున్నారు. స్టోరేజ్‌ను 512 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. మీడియాటెక్ హీలియో జీ25 ఆక్టా కోర్ ప్రాసెసర్ వస్తున్న రెడ్‌మీ 9ఏ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో పనిచేస్తుంది. 5000ఎంఏహెచ్ లీథియం ఐయాన్ బ్యాటరీ ఇచ్చారు.
ఈ ఫోన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2. రెడ్‌మీ 9 స్పార్టీ ఆరెంజ్
అమెజాన్‌లో లభిస్తున్న రెడ్‌మీ రెండో ఫోన్ ఇది. స్పోర్టీ ఆరెంజ్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌తో అందిస్తున్నారు. ఎమ్మార్పీ రూ.10,999 కాగా డిస్కౌంట్‌తో రూ.8,499కే వస్తోంది. హెచ్‌డీఆర్, ప్రొ రికార్డు మోడ్స్‌ను యువత ఇష్టపడతారు. 6.53 అంగుళాల హెచ్‌డీ డిప్లేతో పాటు 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ఆక్టా ప్రాసెసర్, 5000mAH లిథియం పాలిమర్ బ్యాటరీ దీని సొంతం.
ఈ ఫోన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
3. టెక్నో స్పార్క్ 7టీ
సాధారణ రోజుల్లో రూ.10,999కి విక్రయించే టెక్నో స్పార్క్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.8,499కి ఇస్తున్నారు. ఏఐ ప్రైమరీ సెన్సర్‌తో 48ఎంపీ కెమెరా, సెల్ఫీల కోసం 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకోనేవారి కోసం 6000ఎంఏహెచ్ బ్యాటరీ అందిస్తున్నారు. డిస్ప్లే కూడా 6.52 అంగుళాలు ఉంటుంది. మీడియాటెక్ హీలియో జీ35 గేమింగ్ ప్రాసెసర్ ఇచ్చారు. ఆండ్రాయిడ్ 11ఓఎస్‌తో నడుస్తుంది.
ఈ ఫోన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. టెక్నో స్పార్క్ 7టీ(Jewel Blue)
టెక్నో స్పార్క్ 7టీ మొబైల్ ఎమ్మార్పీ రూ.11,999 కాగా అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో దీనిని రూ.10,599కే విక్రయిస్తున్నారు. 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో ఇది లభిస్తోంది. 6000mAh బ్యాటరీ ఇచ్చారు. 48ఎంపీ ఏఐ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 6.52 హెచ్‌డీ డిస్ప్లేతో పాటు మీడియాటెక్ హీలియో జీ35 గేమింగ్ ప్రాసెసర్ ఇచ్చారు. ఆండ్రాయిడ్ 11ఓఎస్‌తో నడుస్తుంది. సెక్యూరిటీ కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉంది.
ఈ ఫోన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. సామ్‌సంగ్ గెలాక్సీ M12 Blue
సామ్‌సంగ్ గెలాక్సీ ఎం12బ్లూ స్మార్ట్‌పోన్ అమెజాన్ 'డీల్ ఆఫ్ ది డే' సెక్షన్‌లో అందుబాటులో ఉంది. ఎమ్మార్పీ రూ.12,999 కాగా ఇప్పుడు రూ.9,499కే విక్రయిస్తున్నారు. ఇందులోని క్వాడ్ కెమెరా సెటప్‌ను (48MP+5MP+2MP+2MP) యూజర్లు ఇష్టపడతారు. 48ఎంపీ ప్రైమరీ సెన్సర్, అల్ట్రావైడ్ సెన్సర్ కెమెరా ఆకట్టుకుంటోంది. 6000mAH లిథియం అయాన్ బ్యాటరీ, 6.5 అంగుళాల తెర ఇచ్చారు. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంది.
Honda Shine 100: రూ.65 వేలలోపే 100 సీసీ బైక్ - హోండా షైన్ కొత్త వేరియంట్ గురించి ఐదు ఇంట్రస్టింగ్ విషయాలు!
Stock Market News: ఫెడ్ రేట్ల పెంపుతో బ్యాంక్స్ స్టాక్స్ ఢమాల్ - సెన్సెక్స్, నిఫ్టీ డౌన్
Best Mileage Cars: రూ. 10 లక్షల లోపు బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే - ఏకంగా 34 కిలోమీటర్ల వరకు!
Bank Holidays list in April: ఏప్రిల్‌లో 15 రోజులు బ్యాంక్‌లకు సెలవులు - లిస్ట్ ఇదిగో
E-Commerce: ఈ-కామర్స్ మోసాలకు, కంపెనీలకు లంకె - కొత్త రూల్స్ తెస్తున్న కేంద్రం
Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి
KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం
Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!
Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?