Jio Network Down: జియో సేవల్లో అంతరాయం.. #jiodown అంటూ యూజర్ల ఫిర్యాదులు
జియో నెట్‌వర్క్ సేవల్లో బుధవారం అంతరాయం కలిగినట్టు డౌన్‌డిటెక్టర్ తెలిపింది. వేల మంది వినియోగదారులు నెట్‌వర్క్ పనిచేయడం లేదని ఫిర్యాదులు చేశారు. జియో అధికారిక ట్విటర్‌కు ట్వీట్లు పోటెత్తాయి.
జియో నెట్‌వర్క్ సేవల్లో అంతరాయం కలిగిందా? అంటే అవుననే అంటున్నారు చాలా మంది వినియోగదారులు. ఉదయం నుంచి జియో నెట్‌వర్క్ డౌన్ అయినట్టు ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. నెట్ వర్క్ ఇబ్బందులపై ఫిర్యాదులు పెరిగినట్టు 'డౌన్ డిటెక్టర్' సైతం చూపించడం గమనార్హం.
జియో నెట్‌వర్క్ సేవల్లో బుధవారం అంతరాయం కలిగినట్టు డౌన్‌డిటెక్టర్ చూపించింది. వేల మంది వినియోగదారులు నెట్‌వర్క్ పనిచేయడం లేదని ఫిర్యాదులు చేశారు. జియో అధికారిక ట్విటర్‌కు ట్వీట్లు పోటెత్తాయి. ఎక్కువగా మధ్య ప్రదేశ్ నుంచి ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తోంది. సమస్య ఒక ప్రాంతానికే పరిమితమైందా? లేదా దేశవ్యాప్తంగా ఉందా అనే విషయంలో స్పష్టత లేదు. కొన్ని గంటల పాటు #jiodown హ్యాష్‌టాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది.
Also Read: క్రిప్టో కరెన్సీ క్రేజ్.. బిట్ కాయిన్ ఉంటే బేఫికర్.. ఈ రెస్టారెంట్లో అదిరే ఆఫర్
వినియోగదారుల ఫిర్యాదులకు జియో స్పందించింది. 'మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీ ప్రాంతంలో అనుసంధాన సమస్యలు ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. సమస్య పరిష్కారం కోసం మా బృందం పనిచేస్తోంది. అతి త్వరలో సేవలు తిరిగి ఆరంభమవుతాయి' అని ట్విటర్లో పోస్ట్ చేసింది.
Also Read: దీపావళి రోజున ముహూరత్ ట్రేడింగ్.. ఆ టైమ్ లో షేర్లు కొనుగోలు చేస్తే..
రెండు రోజు ముందే ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఇతర యాప్‌ల సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోయాయి. బుధవారం జియో సేవల్లో అంతరాయం ఏర్పడటంతో యూజర్లు ఇబ్బంది పడ్డారు. దాదాపుగా నాలుగువేల మంది ఇబ్బందుల గురించి ఫిర్యాదు చేశారు. అంతరాయం ప్రభావాన్ని జియో తెలుసుకుంటోంది. ఇక నెట్‌వర్క్ డౌన్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
It's 11.44 NO NETWORK #Jiodown @reliancejio
— Akshay sharma (@Akshays54628819) October 6, 2021
RAIPUR, CHHATTISGARH pic.twitter.com/ChuOvethwr
Is @reliancejio sim working ?#jio #jionetwork #jiodown pic.twitter.com/xOuos1MuXs
— Brajesh Sharma (@itsbrajeshh) October 6, 2021
v
No it's not the internet, stop refreshing your chats 😅#WhatsAppDown
— Reliance Jio (@reliancejio) October 4, 2021
Jio network is reportedly down. Users complain that they’re unable to make calls and browse internet. Is your Jio SIM working?#JioDown #Reliancejio #jio #Reliance pic.twitter.com/e6GnsjjjK4
— Varun (@Akansharunesh) October 6, 2021