EPFO Balance Check: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్, ఇకపై DigiLockerలో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు
EPF Passbook Online | ఈపీఎఫ్ ఖాతాదారులు ఇకనుంచి డిజిలాకర్ ద్వారా PF బ్యాలెన్స్, పాస్‌బుక్ చెక్ చేసుకోవచ్చు అని EPFO తెలిపింది. ఇకపై ఖాతాదారులకు UMANG అవసరం లేదని స్పష్టం చేసింది.

EPFO Balance Check In DigiLocker: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఇప్పుడు తమ సేవలను మరింత విస్తృతం చేసింది. ఇకనుంచి DigiLocker యాప్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. Android స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించే ఈపీఎఫ్ ఖాతాదారులు ఎక్కడి నుంచైనా PF బ్యాలెన్స్, తమ పాస్‌బుక్‌ను చెక్ చేయవచ్చు. డిజీలాకర్ ద్వారా UAN కార్డ్, పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (PPO), స్కీమ్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్‌లను ఇప్పుడు డిజిటల్‌గా మీరు యాక్సెస్ చేయవచ్చు.
ఇకపై UMANG యాప్ అవసరం లేదు
ఇప్పటివరకు, PF పాస్‌బుక్ వివరాల కోసం మీరు UMANG యాప్ వినియోగించారు. అయితే ఇప్పుడు డిజిలాకర్ ద్వారా పీఎఫ్ ఖాతాదారులు పూర్తి వివరాలు పొందవచ్చు అని EPFO ఇటీవల Xలో ఒక పోస్ట్ చేసింది. అయితే, iOS వినియోగదారులు UMANG యాప్‌ని ఉపయోగించాలి. EPFO జూలై 16న మరొక అప్‌డేట్‌ను ఇచ్చింది. ఇప్పుడు UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) ధృవీకరణను కూడా ఉమాంగ్ యాప్‌లో ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా చేయవచ్చు అని తెలిపింది. ఈ ప్రక్రియ సురక్షితం, పూర్తిగా డిజిటల్ ప్రాసెస్.
✅ EPFO సేవలు ఇప్పుడు DigiLockerలో అందుబాటులో ఉన్నాయి!
— EPFO (@socialepfo) July 17, 2025
ఎప్పుడైనా, ఎక్కడైనా మీ ముఖ్యమైన EPFO డాక్యుమెంట్‌లను యాక్సెస్ చేయండి:
1️⃣ UAN కార్డ్
2️⃣ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (PPO)
3️⃣ స్కీమ్ సర్టిఫికెట్
📲 అతుకులు లేనిది. సురక్షితమైనది. తెలివైనది.
💼 డిజిటల్ సౌలభ్యంతో పౌరులను శక్తివంతం చేయడం!
🔗 సందర్శించండి: https://t.co/rGirYEUo0d… pic.twitter.com/NcNtG0jmPh
UAN యాక్టివేషన్ ఎందుకు అవసరం?
UAN యాక్టివేషన్ EPFO సేవల కోసం మాత్రమే కాదు, ఎంప్లాయిస్ లింక్డ్ ప్రోత్సాహక పథకం (ELI) ప్రయోజనాన్ని పొందడానికి ఆ పని చేయాలి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ పథకం కింద, ప్రభుత్వం 4 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా చేసుకుంది. దీని కోసం రూ. 2 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేంద్రం కేటాయించింది.
EPFO తన సభ్యులను వారి UANని యాక్టివేట్ చేయాలని, అదే విధంగా డిజిటల్‌గా ఏ ఇబ్బంది లేకుండా అన్ని సేవలు, పథకాల ప్రయోజనాన్ని పొందడానికి ఆధార్‌ని బ్యాంక్ ఖాతాతో లింక్ చేయాలని కోరింది. UANని యాక్టివేట్ చేయకపోతే, మీరు EPFO నుంచి పలు ముఖ్యమైన సేవల ప్రయోజనాన్ని పొందలేరు.
UMANG యాప్ ద్వారా UAN యాక్టివేషన్
- మీ మొబైల్‌లో UMANG యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, దాన్ని ఓపెన్ చేయండి.
- అందులో 'EPFO' సర్వీస్ సెక్షన్‌కి వెళ్లండి.
- 'UAN యాక్టివేషన్' అనే ఆప్షన్ క్లిక్ చేయండి.
- మీ UAN నంబర్, పేరు, పుట్టిన తేదీతో పాటు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
- 'Get OTP'పై క్లిక్ చేస్తే మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఆ OTPని నమోదు చేయండి.
- ఇప్పుడు ఫేస్ ఐడెంటిఫికేషన్ ఆప్షన్ ఎంచుకోండి.
- యాప్‌లో కెమెరా ఆన్ అవుతుంది. మీ ముఖం స్క్రీన్ మీద స్కాన్ అవుతుంది.
- ధృవీకరణ తర్వాత, ఈపీఎఫ్ ఖాతాదారుడి UAN యాక్టివేట్ అవుతుంది





















