Life Insurance : ఉద్యోగులకు గుడ్ న్యూస్, PF ఉంటే చాలట.. 7 లక్షల ఉచిత బీమా, పూర్తి వివరాలివే
Insurance Scheme : ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ.. పీఎఫ్ కట్టేవారికి ఫ్రీ లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉందని తెలుసా? ఏడు లక్షల కవరేజినిచ్చే ఈ ఇన్సూరెన్స్ గురించిన పూర్తి వివరాలివే.

Employees Deposit Linked Insurance Scheme : ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ.. ఇన్సూరెన్స్ కట్టేందుకు పైసలు లేవని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఈ ఫ్రీ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలియదు అనమాట. మీరు కనుక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ.. ప్రతినెలా పీఎఫ్ కట్టేవారు అయితే మీకు 7 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. మరి దీనికి ఎవరు అర్హులు? ఎలా దీనికి అప్లై చేసుకోవాలి? ప్రీమియం ఎంత కట్టాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పథకం పేరు ఇదే..
ప్రైవేట్ జాబ్ చేస్తోన్న ఉద్యోగులకు జీవిత బీమా ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం 1976లో ఓ స్కీమ్‌ని ప్రవేశ పెట్టింది. అదే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరన్స్ (EDLI).
ఎలా అప్లై చేయాలంటే..
ఈ స్కీమ్‌కి అప్లై చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే PF అమౌంట్ కట్ అయి.. EPFOలోకి వెళ్తుంది. ఇలా వెళ్లిన ప్రతి ఒక్కరూ EDLI స్కీమ్‌కి అర్హులే. కాబట్టి EDLI కోసం ఎలాంటి ప్రీమియం జమ చేయాల్సిన అవసరం లేదు. కేవలం EPF అవసరం.
కవరేజ్..
ఈ స్కీమ్‌లో భాగమైన ఉద్యోగి చివరి 12 నెలల యావరేజ్ శాలరీని x 35 చేసి ఇస్తారు. అయితే ఈ కవరేజ్ కేవలం 7 లక్షలు మాత్రమే ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ఇవ్వరు. ఒకవేళ మీ జీతం ఎక్కువైనా సరే.. 7 లక్షలు మాత్రమే కవరేజ్ ఉంటుంది. దీనిమీద ఎలాంటి ట్యాక్స్ కట్ అవ్వదు.
అర్హులు ఎవరంటే..
నెలకు 15 వేలు కంటే తక్కువ ఉన్న ప్రాథమిక ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. అలాగే 15,000 కంటే ఎక్కువ జీతం ఉన్నవారికి 7 పరిమిత కవరేజ్ ఉంటుంది. అంటే EDLI కింద క్లెయిమ్ కింద గత 12 నెలల సగటు నెలవారీ జీతాన్ని 35 రెట్లు వేస్తే 7 లక్షల కవరేజ్ ఇస్తారు. ఈ పథకం కింద ఎలాంటి మినహాయింపులు లేవు. కాబట్టి ప్రతి ఉద్యోగికి ఇది వర్తిస్తుంది.
క్లైమింగ్ ప్రాసెస్..
బీమా ఉన్న వ్యక్తి మరణిస్తే.. ఆ వ్యక్తి నామినీగా పీఎఫ్‌లో ఎవరి పేరు పెడితే.. వారికే ఈ డబ్బు అందుతుంది. క్లైయిమ్ను ప్రాసెస్ చేయడానికి ఫారం 5 తీసుకుని దానిని పూర్తి చేయాలి. అలాగే బీమా వ్యక్తి డెత్ సర్టిఫికెట్ తీసుకుని క్లైయిమ్కి అప్లై చేయాలి. నామినీ పేరు లేకుంటే.. చనిపోయిన ఉద్యోగి వాసరుడు.. వారసత్వ ధృవీకరణ పత్రం చెల్లించి.. క్లెయిమ్ అందుకోవచ్చు.






















