Cryptocurrency Prices Today: ఇంకా క్షీణిస్తున్న బిట్‌కాయిన్.. రూ.45 లక్షల వద్ద ట్రేడింగ్.. మేజర్ క్రిప్టోలు నష్టాల్లోనే!
క్రిప్టో ధరలు క్షీణిస్తున్నాయి. భారీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బిట్‌కాయిన్ రెండున్నర శాతం తగ్గిపోయింది.
క్రిప్టో కరెన్సీ విపణి స్తబ్దుగా మారింది. బిట్‌కాయిన్, ఎథిరెమ్, బైనాన్స్, సొలానా కాయిన్ల ధరలు పడిపోతున్నాయి. ఫలితంగా 24 గంటల్లో క్రిప్టో మార్కెట్ విలువ 4.15 శాతం క్షీణించి 2.47 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు. 24 గంటల్లో బిట్‌కాయిన్ విలువ 2.71 శాతం తగ్గి రూ.45,50,711 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ఎథిరెమ్ 2.42 శాతం తగ్గి 3,33,908 వద్ద ట్రేడ్ అవుతోంది.
లూప్‌రింగ్ రూ.249, ఎల్‌రాండ్ రూ.43,720, రిపిల్ (ఎక్స్‌ఆర్‌పీ) 72 లాభాల్లో కొనసాగుతున్నాయి. టెథర్ రూ.81.49, యూఎస్‌డీ కాయిన్ రూ.81 fdhd నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరికొన్ని రోజుల వరకు క్రిప్టో మార్కెట్లో హెచ్చుతగ్గులు గణనీయంగా ఉంటాయని తెలుస్తోంది. పెట్టుబడులు పెట్టేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
Also Read: Airtel Revised Plans: ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్.. అన్ని ప్లాన్ల ధరలూ పెంపు.. ఇప్పుడు ఎంతంటే?
Also Read: EPFO New Update: జాబ్ మారారా? పీఎఫ్ బదిలీ చేయాల్సిన అవసరం లేదు.. మరో మార్పు చేశారు!
Also Read: Cryptocurrency Update: 2 గంటల్లో రూ.1000ని రూ.60 లక్షలుగా మార్చిన కొత్త క్రిప్టో కరెన్సీ
Also Read: Market update: ఒక్కరోజులో రూ.8లక్షల కోట్లు ఆవిరి..! మార్కెట్ పతనానికి కారణాలివే..!
Also Read: Gold-Silver Price: నిలకడగా బంగారం, వెండి ధరలు.. మీ ప్రాంతంలో నేటి ధరలు ఇవీ..