Gold-Silver Price: నిలకడగా బంగారం, వెండి ధరలు.. మీ ప్రాంతంలో నేటి ధరలు ఇవీ..
విజయవాడలోనూ పసిడి ధర స్థిరంగా కొనసాగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,740 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,900గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు నిలకడగా ఉంది. దేశమంతా ఇదే స్థిరత్వం కనిపించింది. పసిడి ధరతో పాటు వెండి ధర కూడా స్థిరంగానే కొనసాగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,740 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.49,900 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.70,400గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విజయవాడలోనూ పసిడి ధర స్థిరంగా కొనసాగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,740 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,900గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.70,400గా ఉంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,740 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,900గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.70,400 గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో మాత్రం బంగారం ధర పెరిగింది. దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,210గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,410గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,280 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,280గా ఉంది.
ప్లాటినం ధరలో పెరుగుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు గ్రాముకు రూ.31 తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,550 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Market update: ఒక్కరోజులో రూ.8లక్షల కోట్లు ఆవిరి..! మార్కెట్ పతనానికి కారణాలివే..!
Also Read: Go Fashion IPO: గ్రే మార్కెట్ ప్రీమియం ఏం చెబుతోంది? గో ఫ్యాషన్ సూపర్ హిట్టవుతుందా?
Also Read: GST Hike: బట్టలు, పాదరక్షలు కొనాలా? వెంటనే చేసేయండి.. లేదంటే జనవరిలో ధరల మోత తప్పదు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి