Cryptocurrency Prices Today: 5 రోజుల్లో 20% తగ్గిన బిట్‌కాయిన్ విలువ.. మిగతా ధరలు ఎలా ఉన్నాయంటే?
బిట్‌కాయిన్ ధర రానురాను తగ్గుతోంది. ఇన్వెస్టర్లు సరైన నిబంధనలు వచ్చేంత వరకు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు. ఐదు రోజుల్లోనే బిట్‌కాయిన్ విలువ 20 శాతం తగ్గింది.
![Cryptocurrency Prices Today: 5 రోజుల్లో 20% తగ్గిన బిట్‌కాయిన్ విలువ.. మిగతా ధరలు ఎలా ఉన్నాయంటే? cryptocurrency prices november 21 2021 rates of bitcoin ethereum litecoin ripple dogecoin today Cryptocurrency Prices Today: 5 రోజుల్లో 20% తగ్గిన బిట్‌కాయిన్ విలువ.. మిగతా ధరలు ఎలా ఉన్నాయంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/f7493e13306f341262412781ee98778e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
క్రిప్టో కరెన్సీ మార్కెట్ విలువ ఆదివారం 0.55 శాతం పెరిగి 2.63 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. బిట్‌కాయిన్, ఎథిరెమ్ ధరలు కాస్త పెరిగాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు. 24 గంటల్లో బిట్‌కాయిన్ విలువ 0.59 శాతం పెరిగి రూ.47,33,856 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం బిట్‌కాయిన్ మార్కెట్ విలువ ఏకంగా 20 శాతం తగ్గింది.
ఎథిరెమ్ 1.5 శాతం పెరిగి రూ.3,50,224 వద్ద ఉంది. టెథెర్ (యూఎస్‌డీటీ) 0.05 శాతం పెరిగి రూ.80.46, రిపిల్ (ఎక్స్‌ఆర్‌పీ) 1.24 శాతం పెరిగి రూ.90.96 వద్ద కొనసాగుతున్నాయి. కర్డానో (ఏడీఏ) 0.33 శాతం పెరిగి రూ.151.5, పొల్కాడాట్ (డీఓటీ) 1.80 శాతం పెరిగి రూ.3377, డోజీకాయిన్ (డీవోజీఈ) 1.79 శాతం తగ్గి రూ.19.25 వద్ద ఉన్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
Also Read: EPFO update: ఇంటి వద్ద నుంచే ఈపీఎఫ్‌వో నామినీ పేరు మార్చొచ్చు.. వివరాలు ఇవే..!
Also Read: EPFO Update: ఈపీఎఫ్‌వో మరో సంచలన నిర్ణయం.. స్టాక్‌మార్కెట్‌తో పాటు..!
Also Read: Safe Driving Tips: ఓవర్‌టేక్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)