Centre on Cryptocurrency: క్రిప్టో కరెన్సీ నిషేధం రద్దు! బిల్లు పేరును మారుస్తున్న కేంద్రం.. వివరాలు ఇవే!
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించడం లేదని తెలిసింది. బిల్లు పేరును మారుస్తున్నారట.
క్రిప్టో కరెన్సీ బిల్లు గురించి మరో అప్‌డేట్ వచ్చింది! వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రిప్టో కరెన్సీని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించడం లేదని సమాచారం. క్రిప్టో ఎక్స్‌ఛేంజ్‌లను సెబీ పరిధిలోకి తీసుకురానుందని తెలిసింది. అంతేకాకుండా సంబంధిత బిల్లు పేరును మార్చేస్తోందని వార్తలు వస్తున్నాయి.
'ప్రతిపాదిత క్రిప్టో కరెన్సీ చట్టం పేరును మార్చబోతున్నారు! క్రిప్టో అసెట్, సెబీ పరిధిలోకి క్రిప్టోగా మారుస్తున్నారు' అని తెలిసింది. క్రిప్టో అసెట్, రిజర్వు బ్యాంకు తీసుకురాబోతున్న ప్రతిపాదిత డిజిటల్ కరెన్సీ మధ్య తేడాను స్పష్టంగా చెప్పనున్నారని సమాచారం. 'అన్ని క్రిప్టో ఎక్స్‌ఛేంజ్‌లు సెబీ పరిధిలోకి వస్తాయి. నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.5-20 కోట్ల వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తారు' అని తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న ఎక్స్‌ఛేంజ్‌లు త్వరగా సెబీ వద్ద నమోదు చేసుకొనేందుకు గడువు విధించనున్నారు.
మంత్రివర్గం ఆమోదం లభించగానే క్రిప్టో కరెన్సీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మధ్యే చెప్పారు. విషయంపై ఇప్పుడు మాట్లాడితే బిల్లు గురించి ముందే చర్చించినట్టు అవుతుందని పేర్కొన్నారు.
'క్రిప్టో కరెన్సీ నిషేధం, అధికారిక డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్లు - 2019'గా పేరు పెట్టడంతో దేశవ్యాప్తంగా అయోమయం నెలకొంది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని అందరూ భయపడుతున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టినవారు ఏం చేయాలో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. చాలామంది క్రిప్టోను నిషేధించొద్దని కోరుతున్నారు. అయితే ఇప్పుడా బిల్లు పేరును 'క్రిప్టో కరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్లు - 2021'గా మార్చబోతున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ బిల్లును సభలో ప్రవేశపెడుతున్నారు.
Also Read: చరిత్రలో రెండోసారి అత్యధికంగా జీఎస్‌టీ రాబడి.. ఎంత వచ్చాయంటే..!
Also Read: ఉద్యోగి వేతనంపై జీఎస్‌టీ..! నోటీస్ పిరియడ్ సర్వ్ చేయకుంటే పన్ను పడతాది!
Also Read: ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేస్తుంటే సమస్యా? ఈ కొత్త రూల్ తెలుసా?
Also Read: ఆ రూ. 26వేల కోట్లు ఎవరివో ? బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసి మర్చిపోయిన జనం..!
Also Read: త్వరపడండి..! ఈ గవర్నమెంట్ కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.77% వడ్డీ ఇస్తోంది
Also Read: కస్టమర్లకు బ్యాంకుల షాక్..! ఏటీఎం లావాదేవీల ఫీజు పెంపు
Also Read: మోదీ ప్రభుత్వం ఓకే అనేస్తే..! కోహ్లీ వన్డే కెప్టెన్సీకి గుడ్‌బై!