అన్వేషించండి

Union Budget 2025:ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగం హోదా పెరుగుతుందా.. అందుకు ఈ బడ్జెట్ సహకరిస్తుందా ?

Union Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం ఈ బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకుంది.

Union Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం ఈ బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. పెరిగిపోతున్న భవన నిర్మాణ ఖర్చులు, అధిక వడ్డీరేట్లు, స్టాంప్ డ్యూటీ వంటి సమస్యల నుంచి బయటపడేందుకు ఈ రంగానికి కొన్ని కీలక సాయాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచే ఈ డిమాండ్‌లు ఉన్నప్పటికి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శ ఉంది. ఈసారి బడ్జెట్‌ కచ్చితంగా దీన్ని అడ్రెస్ చేస్తారనే ఆశతో ఆ రంగం ఎదురు చూస్తోంది. 

రియల్ ఎస్టేట్ రంగం ఆశలు
రియల్ ఎస్టేట్ రంగానికి ‘ప్రముఖ పరిశ్రమ’ (Industry Status) హోదా ఇవ్వాలని, అలాగే హోం లోన్‌పై పన్ను మినహాయింపు పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా గృహ కొనుగోలుదారులపై పెరుగుతున్న భారం దృష్ట్యా, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను మరింత మంది ప్రజలకు అందించేందుకు ‘తక్కువ ధరకు ఇళ్లు’ (Affordable Housing) పరిమితిని పెంచాలని కూడా సూచిస్తున్నారు.

Also Read : Budget 2025 : బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. మరి మంత్రిగారు కరుణించేనా ?

బలంగా ఎదుగుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్  
సీబీఆర్ఈ సంస్థ భారతదేశం, దక్షిణాసియా, పశ్చిమాసియా & ఆఫ్రికా ప్రాంతాల ఛైర్మన్ అను షుమన్ మ్యాగజిన్ మాట్లాడుతూ.. "రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత బలంగా ఎదుగుతోంది. ప్రధానంగా బెంగళూరు, నోయిడా, పుణే, చెన్నై వంటి నగరాల్లో లగ్జరీ & ప్రీమియం సెగ్మెంట్‌కి భారీ డిమాండ్ ఉంది" అని తెలిపారు.

2024లోనూ లగ్జరీ, ప్రీమియం ప్రాపర్టీల డిమాండ్ అత్యధికంగా ఉండగా, ప్రధాన నగరాల్లో రూ. 10 కోట్లు నుండి రూ. 80 కోట్ల మధ్య ఖరీదైన ఇళ్ల కొనుగోలు బాగా పెరిగినట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యేకంగా, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో అమ్ముడైన గృహాల్లో 80శాతం పైనవి రూ. కోటి (10 మిలియన్) కన్నా ఎక్కువ విలువైనవే కావడం గమనార్హం.

రియల్ ఎస్టేట్ రంగానికి అవసరమైన మార్పులు
* హోం లోన్ పన్ను మినహాయింపు: ప్రస్తుత రూ. 2 లక్షల పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలి.
* స్టాంప్ డ్యూటీ తగ్గింపు: గృహ కొనుగోలుదారులపై భారం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి.
* తక్కువ ధర గృహాల పరిమితి పెంపు: దేశీయ రియల్ ఎస్టేట్ వ్యాపార వృద్ధిని ప్రోత్సహించేందుకు తక్కువ ధర గృహాల పరిమితిని పెంచాలి.   
* ఇండస్ట్రీ స్టేటస్: రియల్ ఎస్టేట్ రంగానికి పరిశ్రమ హోదా ఇస్తే దీని వృద్ధికి మరింత సహాయపడుతుంది.

మొత్తానికి, రియల్ ఎస్టేట్ రంగం బడ్జెట్ 2025 నుంచి పలు కీలక విధాన మార్పులను ఆశిస్తోంది. గృహ కొనుగోలుదారులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచిచూడాలి.

Also Read :Union Budget 2025: 2025 బడ్జెట్‌లో రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు ఉంటాయా? నిధులు పెంచాల్సిన అవసరం ఏముంది?

Also Read :SEBI New Chief: మాధబి పురి బచ్‌కు టాటా - సెబీ కొత్త ఛైర్మన్ పదవికి దరఖాస్తులు ఆహ్వానం

టాప్ హెడ్ లైన్స్

Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget