(Source: ECI/ABP News/ABP Majha)
Bike Care Tips: మీ బైక్ ఇంజిన్‌లో ఈ సమస్యలు వస్తున్నాయా - అయితే లైట్ తీసుకోకండి!
బైక్ ఇంజిన్ విషయంలో ఈ టిప్స్ ఫాలో అవ్వకపోతే మీ జేబు ఖాళీ అవుతుంది.
Bike Care: సాధారణంగా బైక్ సర్వీస్ చేసినప్పుడు, దాని ఇంజిన్ ఆయిల్ మారుస్తారు. అయితే మీ బైక్ ఇంజన్ ఆయిల్ పదే పదే నల్లగా మారుతున్నట్లయితే, మీరు దానిని గమనించి వెంటనే మెకానిక్‌కి చూపించాలి. తద్వారా నష్టాలు, ఎక్కువ ఖర్చులను నివారించవచ్చు. దీనికి కారణం ఏంటి, కలిగే నష్టాలు ఏంటి అని తెలుసుకుందాం.
ఇదే కారణం కావచ్చు
మీ బైక్ ఇంజిన్ ఆయిల్ చాలా త్వరగా నల్లగా మారితే బైక్ నడుపుతున్నప్పుడు తరచుగా క్లచ్ ఉపయోగించడం దీనికి ఒక కారణం. అంతే కాకుండా ఆయిల్ ఇంజన్‌లో ఉండే ధూళి, కార్బన్ కూడా దీనికి కారణం కావచ్చు. అదే సమయంలో ఇంజిన్ చాలా పాతది అయినప్పుడు కూడా ఇది జరుగుతుంది. అయితే ఇంజిన్ నల్లగా మారిన వెంటనే దాన్ని మెకానిక్‌కు చూపబడాలి.
మెరుగైన లూబ్రికేషన్ అందించడానికి ఇంజిన్‌లో ఆయిల్ ఉపయోగిస్తారు. అయితే ఇంజిన్ ఆయిల్ త్వరగా నల్లగా మారితే ఇందులో ఏదో లోపం ఉండాలి. దీని కారణంగా ఇంజిన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను ఇవ్వదు. ఇది ఇంజిన్‌లో ఉన్న భాగాలకు అస్సలు మంచిది కాదు.
సమయానికి ఇంజిన్ ఆయిల్‌ను మార్చాలి
ఇంజిన్ ఆయిల్ నల్లగా మారడానికి మరొక కారణం ఏమిటంటే దీన్ని టైమ్‌కి మారుస్తూ ఉండాలి. దీని కారణంగా ఇంజిన్ పూర్తి సామర్థ్యంతో పనిచేయదు. అలాగే దెబ్బతినే అవకాశం ఎక్కువ అవుతుంది.
చాలా మంది వాహన యజమానులు వెహికిల్ సర్వీసింగ్‌ను వాయిదా వేస్తూ ఉంటారు. అయితే ఇది నేరుగా ఇంజిన్‌ను ప్రభావితం చేస్తుంది. దీనికి కారణం కొంత డబ్బు ఆదా అవుతుందనే అత్యాశ. సర్వీసును చాలా కాలం పాటు ఆలస్యం చేయడం ద్వారా మీ జేబుకు మరింత చమురు వదలాల్సి రావచ్చు.
భారతదేశంలో ద్విచక్ర వాహనాల విక్రయాలు ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. అయితే 2023 మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో మోటార్‌సైకిల్ విక్రయాలు 14.06 శాతం పెరిగి 84,26,714 యూనిట్లకు చేరుకున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో 73,87,645 యూనిట్లు అమ్ముడుపోయాయి.
హీరో మోటోకార్ప్ 2023 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక స్ప్లెండర్ అమ్మకాలతో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. స్ప్లెండర్ అమ్మకాలు 2023లో 32,55,744 యూనిట్లకు పెరిగాయి. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో అమ్ముడుపోయిన 26,65,386 యూనిట్ల కంటే 22.15 శాతం ఎక్కువ. ఈ బైక్ మొత్తం మార్కెట్ వాటా 38.64 శాతంగా ఉంది.
అదే సమయంలో గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 మోటార్‌సైకిళ్లలో హోండా సీబీ షైన్ 12,09,025 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో అమ్ముడు పోయిన 11,01,684 యూనిట్ల కంటే 9.74 శాతం ఎక్కువ.
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ విక్రయాలు 9.71 శాతం తగ్గి 10,52,043 యూనిట్లకు చేరాయి. ఇది అంతకుముందు సంవత్సరంలో 11,65,163 యూనిట్లు అమ్ముడు పోయింది. HF డీలక్స్ మార్కెట్ వాటా 12.48 శాతంగా ఉంది. బజాజ్ పల్సర్ సిరీస్ విక్రయాలు 32.43 శాతం పెరిగి 10,29,057 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది గత సంవత్సరం కంటే 2,52,013 యూనిట్లు ఎక్కువ.
బజాజ్ ప్లాటినా, గత ఆర్థిక సంవత్సరంలో 5,34,017 యూనిట్ల విక్రయాలతో ఐదో స్థానంలో నిలిచింది. 2022 ఆర్థిక సంవత్సరంలో 5,75,847 యూనిట్లతో పోలిస్తే ఇది 7.26 శాతం తక్కువ. TVS అపాచీ ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. ఈ సమయంలో ఇది 3,49,878 యూనిట్లను విక్రయించింది.