అన్వేషించండి

Air India Deal: నాలుగు దేశాలను ముడేస్తూ టాటా గ్రూప్‌ డీల్‌ - భారీ టేకాఫ్‌కు ఎయిరిండియా రె'ఢీ'

ఎయిర్‌ ఇండియా ఒప్పందం జరిగిన తర్వాత, నాలుగు దేశాల ప్రభుత్వానేతలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

Air India Deal: ఎయిర్ ఇండియాను భారీగా విస్తరించి, పౌర విమానయాన రంగంలో ఆధిపత్య స్థానాన్ని మరింత పటిష్ట పరుచుకునేందుకు టాటా గ్రూప్‌ ఒక స్ట్రాంగ్‌ టేకాఫ్‌ ప్లాన్‌ వేసింది. టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిర్‌ ఇండియా, ఈ విస్తరణ ప్లాన్‌లో భాగంగా, విమానయాన రంగంలోనే అతి పెద్ద డీల్‌ కుదుర్చుకుంది. 

ఎయిర్‌బస్, బోయింగ్ నుంచి మొత్తం 470 విమానాలను ఎయిర్ ఇండియా ఆర్డర్ చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ నుంచి 250 విమానాలు, అమెరికాకు చెందిన బోయింగ్‌ నుంచి 220 విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆర్డరు మొత్తం విలువ 80 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 6.40 లక్షల కోట్లు) ఉంటుందని మార్కెట్‌ అంచనా వేసింది.

ఈ డీల్‌కు ఎందుకు ఇంత ప్రాధాన్యత?
ఎయిర్‌ ఇండియా ఒప్పందం జరిగిన తర్వాత, నాలుగు దేశాల ప్రభుత్వానేతలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రో, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దీన్ని బట్టి ఈ డీల్ ఎంత పెద్దది, ఎంత ప్రాధాన్యం ఉందన్న విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు. 

అమెరికా అధ్యక్షుడి కార్యాలయం 'వైట్ హౌస్' నుంచి కూడా దీనిపై ఒక ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే.. బోయింగ్ & ఎయిర్ ఇండియా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం బోయింగ్ నుంచి 220 విమానాలను 34 బిలియన్ డాలర్లకు ఎయిర్ ఇండియా కొనుగోలు చేస్తుంది. వీటిలో 190 B737 Max, 20 B787, 10 B777X మోడళ్లు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం మరో 70 విమానాలను కొనుగోలు చేసేందుకు కూడా ఎయిర్‌ ఇండియాకు అనుమతి ఉంది. అవకాశం ఉంటుంది.

ఈ ఒప్పందం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేస్తూ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రోకు అభినందనలు తెలిపారు. ఈ ఒప్పందం వల్ల ఇరు దేశాలు లాభపడతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఏ కంపెనీ నుంచి ఏ రకం విమానాలు వస్తాయి?
బోయింగ్ నుంచి 737 MAX మోడల్‌ విమానాలను ఎయిర్ ఇండియా కొనుగోలు చేస్తుంది. ఈ మోడల్‌లో 737-8 & 737-10 ఉంటాయి. 787-9కి చెందిన 20 ఎయిర్‌క్రాఫ్ట్‌లను, 777-9 రకానికి చెందిన 10 విమానాలను కొంటుంది. ఇది కాకుండా, మరో 70 బోయింగ్ జెట్ విమానాల ద్వారా ఎయిర్ ఇండియా తన విమానాలను మరింత ఆకర్షణీయంగా మార్చబోతోంది. ఈ ఒప్పంద విలువ 34 బిలియన్‌ డాలర్లు లేదా సుమారు రూ. 2.80 లక్షల కోట్లు. అనుమతి ఉన్న మరో 70 విమానాలను కూడా ఈ సంస్థ నుంచి కొనుగోలు చేస్తే, ఒప్పందం విలువ 5.9 బిలియన్‌ డాలర్లు లేదా సుమారు రూ.3.76 లక్షల కోట్లకు చేరుతుంది.

777-9 మోడల్‌కు చెందిన 10 విమానాలను కొనుగోలు చేయడం ద్వారా, ప్రపంచంలోని దాదాపు ప్రతి గమ్యస్థానానికి భారతదేశం కనెక్టివిటీని ఎయిర్ ఇండియా పెంచుతుంది.

ఎయిర్‌బస్‌ A350 విమానాలకు రోల్స్‌రాయిస్‌ ఇంజిన్లు, బోయింగ్‌ 777, బోయింగ్‌ 787Sస్‌ విమానాలకు GE ఏరోస్పేస్‌ ఇంజిన్లు, సింగిల్‌ యాసిల్‌ విమానాలన్నింటికీ GFM ఇంటర్నేషనల్‌ ఇంజిన్లు వినియోగిస్తామని ఎయిరిండియా తెలిపింది.

220 విమానాల కోసం బోయింగ్‌తో కుదిరిన డీల్‌లో భాగంగా... మాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన 190 విమానాలను, 787 డ్రీమ్‌లైనర్‌ మోడల్‌కు చెందిన 20 విమానాలను ఆ కంపెనీ ఎయిర్ ఇండియాకు అప్పగించనుంది. ఇది కాకుండా, ఇతర కేటగిరీల విమానాల కోసం ఆర్డర్లు ఉన్నాయి.

బోయింగ్ ఎయిర్‌ప్లేన్స్ కూడా ఈ ఒప్పందంపై ట్వీట్ చేసి ఎయిర్ ఇండియాకు స్వాగతం పలికింది.

ఈ భారీ ఆర్డర్ ద్వారా, ఎయిర్‌బస్ A350-1000లో ఉపయోగించే ట్రెంట్ XWB-97 ఇంజిన్లను (68+20 ఆప్షన్స్‌) కొనుగోలు చేస్తారని రోల్స్ రాయిస్ కూడా ప్రకటించింది. A350-900లో ఉపయోగించే 2 ట్రెంట్ XWB-84 ఇంజన్‌లను కూడా కొనుగోలు చేస్తారు.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ ఈ ఒప్పందాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణించారు. 'ఎయిరిండియా - బోయింగ్ మధ్య ఒప్పందం, కొనుగోలును ప్రకటించడం గర్వంగా ఉంది' అని బిడెన్ అన్నారు. ప్రధాని మోదీతో కలిసి భారత్‌-అమెరికా మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు బిడెన్ చెప్పారు. 

ఈ ఏడాది చివరి నాటికి ఎయిర్ ఇండియాకు తొలి A350 విమానాన్ని సరఫరా చేస్తామని ఎయిర్‌బస్ తెలిపింది. ఎయిర్‌బస్‌ నుంచి ఎయిర్‌ ఇండియా కొనుగోలు చేయనున్న 250 విమానాల్లో... 40 భారీ విమానాలు ఉన్నాయి. ఎయిరిండియా కోసం A350, A320 విమానాలను టాటా గ్రూప్ ఎంపిక చేయడం గర్వకారణమని ఎయిర్‌బస్ ఇండియా అండ్ సౌత్ ఏషియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రెమీ మైలార్డ్ అన్నారు. ఇంత భారీ ఆర్డర్‌తో భారత విమానయాన రంగం ముందుకు దూసుకుపోతుందని ఆయన అన్నారు.

చివరి షాపింగ్ జరిగింది?
విమానాల కొనుగోలుకు ఎయిర్ ఇండియా ఆర్డర్లు ఇవ్వడం గత 17 ఏళ్లలో ఇదే తొలిసారి. టాటా గ్రూప్ యాజమాన్యం కిందకు వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియాకు ఇది మొదటి ఆర్డర్. టాటా గ్రూప్‌, 2022 జనవరి 27న ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందానికి 17 సంవత్సరాల ముందు, అంటే 2005లో 111 విమానాల కొనుగోలుకు ఎయిర్‌ ఇండియా ఆర్డర్ ఇచ్చింది. అందులో 68 విమానాల ఆర్డర్‌ బోయింగ్‌కు, 43 విమానాల ఆర్డర్‌ ఎయిర్‌బస్‌కు అందింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget