అన్వేషించండి

Aadhar: మీ ఆధార్‌తో ఏ మొబైల్ నంబర్, ఈ-మెయిల్‌ ఐడీ లింక్‌ అయిందో గుర్తు లేదా?, కనుక్కోవడం చాలా ఈజీ

ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త సదుపాయం తీసుకొచ్చింది ఉడాయ్‌.

Aadhaar Mobile Number Email ID Verification: మీ ఆధార్‌ నంబర్‌తో ఏ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ అనుసంధానం అయివుందో మీకు తెలిస్తే, అవసరమైన సందర్భంలో ఆధార్‌ ధృవీకరణ (aadhaar authentication) చాలా సులభం అవుతుంది. ఏ మొబైల్ నంబర్‌, ఈ-మెయిల్ ఐడీతో మీ ఆధార్‌ లింక్ అయిందో మీకు తెలియకపోయినా, లేదా మరిచిపోయినా ఆధార్‌ ధృవీకరణ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ ఇబ్బందిని తొలగించడానికి, ఆధార్‌ జారీ సంస్థ UIDAI (Unique Identification Authority of India) ఒక కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. 

చాలామంది ఆధార్ కార్డ్‌హోల్డర్లు తమ ఆధార్‌ నంబర్‌తో ఏ మొబైల్ నంబర్, ఈ-మెయిల్‌ ఐడీ అనుసంధానమై ఉందో తమకు తెలియదని ఉడాయ్‌కి (UIDAI) ఫిర్యాదులు, విజ్ఞప్తులు చేస్తున్నారు. ఆధార్‌ను ధృవీకరించే OTP అసలు ఏ నంబర్‌కు, ఏ ఈ-మెయిల్‌ ఐడీకి వెళ్తుందో అర్ధం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త సదుపాయం తీసుకొచ్చింది ఉడాయ్‌. ఈ సదుపాయంతో, ఆధార్ కార్డ్‌హోల్డర్లు తమ ఆధార్‌ ఏ మొబైల్ నంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీతో లింక్ అయిందో సులభంగా తెలుసుకోవచ్చు.

మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ ధృవీకరించడానికి, UIDAI అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in లేదా mAadhaar యాప్‌ని సందర్శించాలి. దానిలో, 'Verify Email/Mobile' మీద క్లిక్ చేయాలి. ఇక్కడ, మీ ఆధార్‌ నంబర్‌ ఏ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్‌ ఐడీతో లింక్ అయివుందో తెలుసుకోగలుగుతారు. మీకు సంబంధం లేని ఇతర నంబర్‌తో ఆధార్‌ అనుసంధానమై ఉంటే దానిని సులభంగా గుర్తించవచ్చు. ఆ నంబర్‌ తీసేసి, మీ నంబర్‌ను అప్‌డేట్‌ చేయవచ్చు.

మొబైల్ నంబర్‌ను ఇప్పటికే ధృవీకరించి ఉంటే, నమోదు చేసిన మొబైల్ నంబర్ ఇప్పటికే మా రికార్డ్‌ల్లో ధృవీకరించాం అన్న సందేశం కనిపిస్తుంది. ఆధార్ కోసం ఎన్‌రోల్‌మెంట్ సమయంలో అతను/ఆమె ఏ మొబైల్ నంబర్ ఇచ్చారో తెలియకపోతే, అతను/ఆమె https://myaadhaar.uidai.gov.in పోర్టల్‌ లేదా mAadhaar యాప్‌ని సందర్శించాలి. 'Verify Aadhaar' ఆప్షన్‌లోకి వెళ్లి, ఆధార్‌ నంబర్‌ను నమోదు చేయాలి. ఇప్పుడు, మీరు ఏ మొబైల్‌ నంబర్‌ ఇచ్చారో, ఆ నంబర్‌లోని చివరి మూడు అంకెలు కనిపిస్తాయి.

కేవలం రూ. 50 కే PVC ఆధార్ కార్డు పొందండి
ఒకవేళ మీ కార్డ్‌ కనిపించకుండా పోతే PVC ఆధార్‌ కార్డ్‌ను తెప్పించుకోవచ్చు. PVC ఆధార్‌ కార్డ్‌ను ప్రజలు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడానికి (PVC Aadhaar Card Online Order) ఉడాయ్‌ అనుమతిస్తుంది. ఉడాయ్‌ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ కార్డ్‌ను ఆర్డర్ చేయవచ్చు. PVC ఆధార్ కార్డును (PVC Aadhaar Card Order Online Fees) కేవలం రూ. 50 చెల్లించి పొందవచ్చు. ఈ కార్డ్‌లో సురక్షితమైన QR కోడ్, హోలోగ్రామ్, పేరు, ఫోటో, పుట్టిన తేదీ మొదలైన సమాచారం నమోదై ఉంటాయి. 

PVC ఆధార్ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

ముందుగా https://uidai.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఆ తర్వాత, హోమ్‌ పేజీలో కనిపించే My Aadhaar ఆప్షన్‌ను ఎంచుకోండి.
ఇందులో Order Aadhaar PVC Card మీద క్లిక్ చేయండి.
ఇక్కడ మీరు 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.
మీరు 16 అంకెల వర్చువల్ ఐడీని కూడా ఇవ్వవచ్చు. దీని తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చా ఎంటర్ చేయండి.
ఇప్పుడు, ఆధార్‌తో లింక్‌ అయి ఉన్న మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
OTPని సంబంధిత గడిలో పూరించి సబ్మిట్‌ చేయండి
ఆ తర్వాత, PVC ఆధార్ కార్డ్ ప్రివ్యూ మీకు కనిపిస్తుంది.
దీని తర్వాత మీరు రూ. 50 రుసుము చెల్లించాలి.
నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఈ చెల్లింపు చేయవచ్చు.
డబ్బులు చెల్లించిన తర్వాత, మీ PVC కార్డ్ స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటి చిరునామాకు వస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Advertisement

వీడియోలు

ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Andhra King Taluka Collections : 'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
Marriages in 2026: డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
SUVs to launch in December 2025: మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
Embed widget