mAadhaar: ఎంఆధార్ యాప్‌లో అద్భుతమైన ఫీచర్, దీంతో చాలా పనులు చేయొచ్చు
మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పడు కొత్త ఫీచర్లను ఆ యాప్‌నకు ఉడాయ్ జోడిస్తోంది.
![mAadhaar: ఎంఆధార్ యాప్‌లో అద్భుతమైన ఫీచర్, దీంతో చాలా పనులు చేయొచ్చు Aadhaar UIDAI Enhances User Convenience with Paperless Offline e KYC Feature in mAadhaar App know details mAadhaar: ఎంఆధార్ యాప్‌లో అద్భుతమైన ఫీచర్, దీంతో చాలా పనులు చేయొచ్చు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/f16ee7b35f21890db71b581eedd671161704778791817545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Paperless Offline e-KYC In mAadhaar App: టెక్నాలజీ చాలా వేగంగా ఛేంజ్ అవుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం 2G నుంచి 5Gకి అప్‌గ్రేడ్ అయ్యాం. ఫీచర్ ఫోన్లను పక్కకునెట్టి స్మార్ట్ ఫోన్లను వాడుతున్నాం. ఇంట్లో చూసే టీవీ నుంచి బయట తిరిగే బండి వరకు ప్రతీదీ లేటెస్ట్ వెర్షన్ తెచ్చుకున్నాం. కీలకమైన ఆధార్ విషయంలోనూ ఇలాగే అప్‌గ్రేడ్ కావాల్సిన అవసరం ఉంది. దీనికోసం, ఆధార్ యాప్ ఎంఆధార్ (mAadhaar) ఉంది. చాలా కాలం క్రితమే ఎంఆధార్‌ను లాంచ్ చేసిన భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ (UIDAI), మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పడు కొత్త ఫీచర్లను ఆ యాప్‌నకు జోడిస్తోంది.
ఇప్పుడు, గ్యాస్ కంపెనీ నుంచి బ్యాంక్ వరకు ప్రతీ సంస్థ e-KYC (Know Your Customer) అడుగుతున్నాయి. ఇ-కేవైసీ ప్రక్రియను మరింత సులభంగా మార్చడానికి, mAadhaar యాప్‌లో “పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఇ-కేవైసీ” (Paperless Offline e-KYC) ఫీచర్‌ను ఉడాయ్ జోడించింది. KYC అనేది చాలా కీలకమైన విషయం. దీనివల్ల కస్టమర్ గుర్తింపు సాధ్యమవుతుంది, సదరు బ్యాంక్ లేదా సంస్థ నుంచి ప్రయోజనాలు కస్టమర్‌కు అందుతాయి. సాధారణంగా, కస్టమర్‌ను గుర్తించడానికి ఆయా సంస్థలు చాలా డాక్యుమెంట్స్ అడుగుతాయి, KYC అంటే ఇదే. mAadhaar యాప్‌లో కొత్త పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఇ-కేవైసీ ఫీచర్‌తో, కస్టమర్లు ఆ డాక్యుమెంట్లన్నింటినీ జెనరేట్ చేయొచ్చు, ఆఫ్‌లైన్ అథెంటికేషన్ కోసం వాటిని ఉపయోగించొచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే ఆధార్‌హోల్డర్ గుర్తింపు సమాచారాన్ని షేర్ చేయడానికి ఇదొక చక్కటి మార్గం.
అంతేకాదు, ఈ సూపర్ ఫీచర్‌తో ఎలాంటి ఇబ్బంది లేకుండా వినియోగదార్ల ఆధార్‌ను ప్రామాణీకరించడం (Authentication), EID/UID సేవలు పొందడం, మీ సమీపంలోని ఆధార్ సెంటర్లను గుర్తించడం, మొబైల్ & ఇ-మెయిల్ ధృవీకరణలు వంటివి ఈజీగా చేయొచ్చు.
ఎంఆధార్ యాప్ పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఇ-ఫీచర్‌ను ఎలా ఉపయోగించవచ్చు? (how to use mAadhaar app’s Paperless Offline e-KYC feature)
1. ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి mAadhaar యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2. మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్, OTPని ద్వారా లాగిన్ అవ్వండి.
3. హోమ్ పేజీలో కింద కనిపించే Services ట్యాబ్‌ను క్లిక్ చేయండి, అక్కడ పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఇ-కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది.
4. పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఇ-కేవైసీ ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ ఆధార్ నంబర్, షేర్ కోడ్, క్యాప్చాను పూరించండి.
5. ఇప్పుడు, Request OTP బటన్‌పై నొక్కండి.
6. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని సంబంధిత గడిలో ఎంటర్ చేసి, Verify బటన్ మీద క్లిక్ చేయండి.
7. వెరిఫికేషన్ తర్వాత, “Share eKYC” బటన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.
8. ఇప్పుడు, eKYC డాక్యుమెంట్లను షేర్ చేయాలనుకుంటున్న యాప్‌ను ఎంచుకోండి.
9. ఆఫ్‌లైన్ ధృవీకరణ కోసం, “షేర్ కోడ్”తో పాటు eKYC డాక్యుమెంట్స్‌ను కలిపి ఒక zip ఫైల్‌ను mAadhaar యాప్ రూపొందిస్తుంది.
10. వినియోగదారు తన వాట్సాప్ లేదా ఇ-మెయిల్ వంటి వాటి ద్వారా ఆ zip ఫైల్‌ను షేర్ చేయవచ్చు.
mAadhaar యాప్‌లో “పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఇ-కేవైసీ” ఫీచర్, కేవైసీ పనిని సులభం చేయడమేగాక, జెనరేట్ అయిన డాక్యుమెంట్లకు భద్రతను కూడా కల్పిస్తుంది. దీనివల్ల, మీ అనుమతి లేకుండా ఆ డాక్యుమెంట్లు ఇతరుల చేతుల్లోకి వెళ్లవు. ఈ ఫీచర్‌తో, ఇటు యూజర్లు & అటు సర్వీస్ ప్రొవైడర్లకు ఆఫ్‌లైన్ ధృవీకరణ ఈజీగా మారుతుంది.
మరో ఆసక్తికర కథనం: గోల్డ్ కొనేవారికి గొప్ప అవకాశం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)