అన్వేషించండి

Yamaha XSR 155 లాంచ్‌ - క్లాసిక్‌ లుక్‌తో స్పోర్టీ పెర్ఫార్మెన్స్‌, మోడ్రన్‌ ఫీచర్లు; ధర ఎంతంటే?

Yamaha, తన న్యూ ఏజ్‌ రెట్రో బైక్‌ XSR 155ను ఇండియాలో లాంచ్‌ చేసింది. ₹1.50 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధరతో వచ్చిన ఈ బైక్‌ క్లాసిక్‌ లుక్‌తో పాటు మోడ్రన్‌ టెక్‌ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.

Yamaha XSR 155 Launch - Know Price Features: యమహా అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బైక్‌ ఎట్టకేలకు మార్కెట్‌లోకి వచ్చింది. Yamaha XSR 155 ఇప్పుడు అధికారికంగా భారత్‌లో లాంచ్‌ అయింది. ₹1.50 లక్షల ఎక్స్‌-షోరూమ్‌ ధరతో వచ్చిన ఈ బైక్‌... క్లాసిక్‌ లుక్‌తో పాటు యమహా స్పోర్టీ DNA ని కలిపి డిజైన్‌ చేసినట్లుగా ఉంటుంది.

పవర్‌ఫుల్‌ 155cc ఇంజిన్‌
ఈ బైక్‌లో R15 V4, MT-15 V2లలో వాడిన అదే 155cc లిక్విడ్‌-కూల్డ్‌, 4-స్ట్రోక్‌, SOHC, సింగిల్‌-సిలిండర్‌ ఇంజిన్‌ ఉంది. ఇందులో ఉన్న Variable Valve Actuation (VVA) టెక్నాలజీ వల్ల పెట్రోల్‌ వినియోగం తగ్గి పెర్ఫార్మెన్స్‌ మెరుగవుతుంది. ఈ ఇంజిన్‌ 18.1 bhp పవర్‌, 14.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌, అసిస్ట్‌ & స్లిప్పర్‌ క్లచ్‌ కూడా స్టాండర్డ్‌గా లభిస్తాయి.

డిజైన్‌లో రెట్రో + మోడరన్‌ మేళవింపు
రౌండ్‌ LED హెడ్‌ల్యాంప్స్‌, టీయర్‌ డ్రాప్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌, ఫ్లాట్‌ సింగిల్‌ సీటు - ఇవన్నీ కలిపి ఈ బైక్‌కి అద్భుతమైన రెట్రో లుక్‌ ఇస్తాయి. అయితే లుక్‌ రెట్రో అయినా ఫీచర్లు మాత్రం ప్యూర్‌గా మోడ్రన్‌. ఫుల్‌-డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, LED లైటింగ్‌, ప్రీమియం ఫినిషింగ్‌తో XSR 155 స్మార్ట్‌గా కనిపిస్తుంది.

Yamaha XSR 155 వీల్‌ బేస్‌ 1,330 mm, సీట్‌ ఎత్తు 810 mm, గ్రౌండ్‌ క్లియరెన్స్‌ 170 mm, కెర్బ్‌ వెయిట్‌ 134 kg, ఫ్యూయల్‌ ట్యాంక్‌ కెపాసిటీ 10 లీటర్లు.

రైడింగ్‌ కంఫర్ట్‌ & సేఫ్టీ
రైడింగ్‌ పొజిషన్‌ అప్‌రైట్‌గా ఉండటంతో సిటీ, హైవే రెండింటిలోనూ రైడింగ్‌ కంఫర్ట్‌గా ఉంటుంది. ముందు అప్‌సైడ్‌ డౌన్‌ ఫోర్క్స్‌, వెనుక మోనోషాక్‌ సస్పెన్షన్‌ ఉంటాయి. బ్రేకింగ్‌ విషయంలో... 282mm ఫ్రంట్‌, 220mm రియర్‌ డిస్క్‌లు ఉన్నాయి. డ్యూయల్‌ ఛానల్‌ ABS‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌ స్టాండర్డ్‌గా వస్తాయి. 

నాలుగు కలర్‌ ఆప్షన్లు
మెటాలిక్‌ గ్రే, వివిడ్‌ రెడ్‌, గ్రేయిష్‌ గ్రీన్‌ మెటాలిక్‌, మెటాలిక్‌ బ్లూ (Metallic Grey, Vivid Red, Greyish Green Metallic, Metallic Blue) వంటి నాలుగు రంగుల్లో ఈ బైక్‌ అందుబాటులో ఉంది. అదనంగా ‘Scrambler’ & ‘Cafe Racer’ పేర్లతో రెండు యాక్సెసరీ కిట్స్‌ కూడా లభిస్తున్నాయి. అల్యూమినియం స్వింగ్‌ ఆర్మ్‌ ఈ బైక్‌కి ప్రీమియం టచ్‌ ఇస్తుంది.

మార్కెట్లో టార్గెట్‌
యమహా XSR 155 ని Royal Enfield Hunter 350, TVS Ronin, Honda CB350RS వంటి రెట్రో స్టైల్‌ బైక్‌లతో పోల్చవచ్చు. అయితే... తక్కువ బరువు, తక్కువ ఇంజిన్‌ సైజ్‌తో ఉన్నప్పటికీ, ఈ బైక్‌ రైడింగ్‌ ఫన్‌, స్టైల్‌ రెండింటినీ కలిపి అందిస్తుంది.

యమహా XSR 155 యువతకు పర్ఫెక్ట్‌ ఆప్షన్‌. రోజువారీ ఆఫీస్‌/కాలేజ్‌ రైడ్‌కైనా, వీకెండ్‌ లాంగ్‌ రైడ్‌కైనా ఇది సరిపోతుంది. రెట్రో లుక్‌తో స్పోర్టీ పెర్ఫార్మెన్స్‌ కలిపిన ఈ బైక్‌ యమహా అభిమానుల్లో కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.                     

టాప్ హెడ్ లైన్స్

ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Embed widget