అన్వేషించండి

డ్యూయల్‌ ABS తో Hero Xtreme 125R, TFT డిస్‌ప్లేతో TVS Raider - యూత్‌ బైక్స్‌ మధ్య హాట్‌ కాంపిటీషన్‌

Hero Xtreme 125R & TVS Raider మధ్య గట్టి పోటీ నెలకొంది. ఒకటి డ్యూయల్‌ చానల్‌ ABSతో, మరొకదానిలో TFT డిస్‌ప్లేతో ఆకర్షిస్తున్నాయి. బైక్‌ లవర్స్‌కు వీటిలో ఏది బెస్ట్‌?.

Hero Xtreme 125R vs TVS Raider Price Specifications Comparison: స్పోర్టీ లుక్‌, స్మార్ట్‌ ఫీచర్లు ఉన్న 125సీసీ బైక్‌లకు యువతరంలో క్రేజ్‌ పెరుగుతోంది. ఈ కేటగిరీని మొదట సుడిగాలిలా చుట్టేసింది TVS Raider. దాని సక్సెస్‌ చూసి హీరో కంపెనీ కూడా Xtreme 125R తో మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఇప్పుడు ఈ రెండు బైక్‌ల టాప్‌ వేరియంట్‌లు డ్యూయల్‌ డిస్క్‌ బ్రేక్‌లతో వచ్చాయి. కానీ హీరో మాత్రం మరో అడుగు ముందుకేసి, డ్యూయల్‌ చానల్‌ ABS కూడా అందించింది, ఇది ఈ సెగ్మెంట్‌లో మొదటిసారి.

పెర్ఫార్మెన్స్‌:

TVS Raider ఇంజిన్‌ 124.8సీసీ శక్తివంతమైన మోటార్‌తో వస్తుంది. ఇది 11.4PS పవర్‌, 11.2Nm టార్క్‌ ఇస్తుంది. ‘బూస్ట్‌ మోడ్‌’ అనే ప్రత్యేక ఫీచర్‌ ద్వారా అదనంగా 0.5Nm టార్క్‌ కూడా లభిస్తుంది. 

హీరో Xtreme 125R కూడా టీవీఎస్‌ రైడర్‌కు సమానమైన పవర్‌ ఇస్తున్నా, దాని టార్క్‌ Raider కంటే కొద్దిగా తక్కువే. అయితే Xtreme 125R లో రైడ్‌-బై-వైర్‌ టెక్నాలజీ ఉండటంతో... క్రూయిజ్‌ కంట్రోల్‌, పవర్‌, రోడ్‌, ఈకో మోడ్స్‌ మధ్య రైడర్‌కి సులభంగా మారే అవకాశం ఉంటుంది.

డిజైన్‌ & కంఫర్ట్‌:

హీరో Xtreme 125R సీటు Raider కంటే 10mm ఎత్తుగా ఉంటుంది. కానీ రైడింగ్‌ పొజిషన్‌ చాలా సౌకర్యంగా ఉంటుంది. 

Raider సీటు ఎత్తు తక్కువగా ఉండటంతో తక్కువ పొడవు ఉన్న రైడర్లకూ సౌకర్యంగా ఉంటుంది. 

ఈ రెండు బైకుల్లో మోనోషాక్‌ సస్పెన్షన్‌ ఉంది, కానీ Xtreme రియర్‌ టైర్‌ మరింత వెడల్పుగా ఉంటుంది, ఇది రోడ్‌ గ్రిప్‌ పెంచుతుంది.

సేఫ్టీ & టెక్నాలజీ:

ఇది హీరో బైక్‌కి పెద్ద ప్లస్‌ పాయింట్‌. Xtreme 125R డ్యూయల్‌ చానల్‌ ABS తో వస్తుంది, Raider మాత్రం సింగిల్‌ చానల్‌ ABS మీదే ఆధారపడుతుంది. 

హీరో బైక్‌లో కొత్త కలర్‌ LCD డిస్‌ప్లే, రైడింగ్‌ మోడ్స్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. Raider మాత్రం TFT డిస్‌ప్లేతో ఆకట్టుకుంటోంది, ఇది వాయిస్‌ అసిస్టెంట్‌, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ సపోర్ట్‌ ఇస్తుంది.

ధరల పోలిక:

Hero Xtreme 125R టాప్‌ వేరియంట్‌ ధర TVS Raider కంటే సుమారు ₹8,000 ఎక్కువ. కానీ అందించే ఫీచర్లు దాన్ని జస్టిఫై చేస్తాయి. 

Raider తక్కువ ధరలో మంచి టెక్నాలజీ అందిస్తుంది. ఎకానమి, యూత్‌ స్టైల్‌ రెండింటినీ కోరుకునే వారికి Raider సరైన ఎంపిక. కానీ సేఫ్టీ & రైడింగ్‌ మోడ్‌లు కోరుకునే వారికి Xtreme 125R కచ్చితంగా బెస్ట్‌ ఆప్షన్‌.

సేఫ్టీ, రైడింగ్‌ ఫన్‌, లుక్‌  - ఈ మూడు విషయాల్లో Hero Xtreme 125R కొంచెం ముందుంది. కానీ విలువకు తగ్గ బైక్‌ TVS Raider అవుతుంది. 

ఓవరాల్‌గా చూస్తే, “అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు కావాలంటే Hero Xtreme 125R, ఫన్‌ కావాలంటే TVS Raider” ను పరిశీలించమని చెప్పొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
Toyota Glanza కొనేవాళ్లకు బోలెడన్ని EMI ఆఫర్లు.. రూ.1.60 లక్షలు డౌన్‌పేమెంట్‌ చేస్తే చాలు!
Toyota Glanza కొనడం ఇప్పుడు చాలా సులభం, నెలకు రూ.10,000 కూడా అవసరం లేదు!
Triumph నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్! అక్టోబర్‌ 6న ఏం జరగబోతోంది?
అక్టోబర్‌ 6.. కుర్రాళ్ల కోసం దసరా ముందే వస్తోంది, వెయిట్‌ అండ్‌ వాచ్‌!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget