సోషల్ మీడియాలో Yamaha WR155R వైబ్రేషన్స్ - లాంచ్ కూడా కాలేదు, బెంగళూరు రోడ్లపై దర్శనం!
బెంగళూరులో కనిపించిన Yamaha WR155R మోటార్ సైకిల్ సోషల్ మీడియాలో హీట్ పెంచింది. వాస్తవానికి ఈ బండి ఇండియాలో ఇంకా లాంచ్ కాలేదు.

Yamaha WR155R Launch Date India: బెంగళూరులో రోడ్డుపై ఒక ఆసక్తికర దృశ్యం ఇంటర్నెట్‌ను, ముఖ్యంగా యువతరాన్ని తెగ ఊపేస్తోంది. Yamaha WR155R డ్యూయల్ స్పోర్ట్ బైక్‌ను అక్కడ ఓ వ్యక్తి నడుపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి, ఇండియాలో ఈ బైక్ ఇంకా లాంచ్ కానేలేదు. కానీ, ఈ బైక్‌తో ఓ వ్యక్తి ఎంచక్కా బెంగళూరు సిటీలో చక్కర్లు కొడుతున్నాడు.
అధికారిక టెస్ట్ మ్యూల్?
సోషల్ మీడియాలో కనిపించిన ఫోటోల ప్రకారం, ఇది యమహా అధికారిక టెస్ట్ మ్యూల్ (టెస్ట్ బైక్) కాదనే చాలా మంది చెబుతున్నారు. ఫొటోల్లో కనిపించిన ప్రకారం, Yamaha WR155R ముందు భాగంలో నంబర్ ప్లేట్ లేదు, శారీ గార్డ్ కూడా లేదు. ఇవి, ఇండియాలో టెస్ట్ రన్స్‌లో తప్పనిసరిగా ఉండే ఫీచర్లు. అంతేకాక, ఈ బైక్ నడిపిన వ్యక్తి హెల్మెట్ లేకుండా, కాజువల్ డ్రెస్సింగ్‌లో ఉన్నాడు. అధికారికంగా టెస్ట్ రైడ్ చేసేవాళ్లు హెల్మెట్ పెట్టుకోవడం సహా అన్ని రకాల భద్రతలు పాటిస్తారు. ఇవన్నీ చూస్తే, ఇది విదేశాల నుంచి వ్యక్తిగతంగా ఇంపోర్ట్ చేసుకున్న బైక్‌గా కనిపిస్తోంది, అధికారిక టెస్ట్ మోడల్ కాదు.
ఏయే మార్కెట్లలో అందుబాటులో ఉంది?
ఈ Yamaha WR155R ఇప్పటికే నేపాల్, ఇండోనేషియా వంటి మార్కెట్లలో అమ్మకంలో ఉంది. ఇందులో 155cc లిక్విడ్ కూల్‌డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ VVA టెక్నాలజీతో వస్తుంది - ఇది మనం ఇప్పటికే R15 & MT-15 ల్లో చూసినదే. ఈ ఇంజిన్ 16.7hp పవర్ & 14.3Nm టార్క్ ఇస్తుంది. దీని 21-అంగుళాల ఫ్రంట్ & 18-అంగుళాల రియర్ వీల్స్‌తో పాటు, 245mm గ్రౌండ్ క్లియరెన్స్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ దానిని ఒక పర్ఫెక్ట్ డ్యూయల్-స్పోర్ట్‌గా నిలబెడుతుంది.
ఇది భారత్‌లో లాంచ్ అయినట్లయితే, Kawasaki KLX230 కి డైరెక్ట్ కంపిటీషన్‌గా నిలుస్తుంది. కవాసకి KLX230.. GST తగ్గింపులు & స్థానిక తయారీ కారణంగా ఇప్పుడు భారత మార్కెట్లో సుమారు రూ.1.84 లక్షల (ఎక్స్‌షోరూమ్) ధరకు దొరుకుతోంది. WR155R కూడా అదే రేంజ్‌లో వస్తే, యువ రైడర్లకు ఇది ఒక పెద్ద అట్రాక్షన్‌గా మారుతుంది.
భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుంది?
అయితే, WR155R లాంచ్‌పై Yamaha India నుంచి అధికారిక సమాచారం లేదు. నవంబర్ 11న యమహా ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేసింది, అందులో కొత్త మోడల్స్‌ను ప్రకటించే అవకాశం ఉంది. అందులో Yamaha XSR155 లాంచ్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. అయితే, ఆ రోజున WR155R కూడా వస్తుందా, రాదా అన్నది మాత్రం క్లారిటీ లేదు.
యమహా అభిమానులు మాత్రం ఈ రూమర్ నిజం కావాలని కోరుకుంటున్నారు, మోటివేషనల్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. "ఈ బైక్ ఇండియాలో లాంచ్ అయితే, యువతకు ఆఫ్‌రోడ్ స్టైల్ డ్రైవింగ్‌కి కొత్త ఎనర్జీ వస్తుంది" అని బైక్ లవర్స్ చెబుతున్నారు.
బెంగళూరు వీధుల్లో కనిపించిన ఈ Yamaha WR155R ఫోటోలు ఇప్పుడు యమహా కమ్యూనిటీలో మళ్లీ ఆశలు రేపుతున్నాయి. కానీ అది అధికారిక మోడల్ కాదని, కేవలం ప్రైవేట్ ఇంపోర్ట్ కావచ్చని మనం ఈజీగా ఊహించవచ్చు. ఇప్పుడు అందరి దృష్టి నవంబర్ 11న యమహా జరపబోయే ఈవెంట్‌పైనే ఉంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - ABP దేశం ఆటో సెక్షన్‌ని ఫాలో అవ్వండి.




















