అన్వేషించండి

బిహార్ ఎన్నికలు 2025

(Source:  ECI | ABP NEWS)

300cc అడ్వెంచర్‌ బైక్‌ TVS Apache RTX 300 - కీ స్పెక్స్‌, కలర్స్‌ వేరియంట్లు & మరిన్ని వివరాలు

TVS Apache RTX 300 కొత్త అడ్వెంచర్ బైక్ 299cc ఇంజన్‌తో 36PS పవర్, 4 రైడింగ్ మోడ్స్‌, క్రూజ్ కంట్రోల్, TFT స్క్రీన్‌తో యువతను మంత్రముగ్ధులను చేస్తోంది.

TVS Apache RTX 300 Key Specs, Colours, Price: భారతీయ యువత కోసం టీవీఎస్ మోటార్ కంపెనీ తీసుకొచ్చిన తాజా హీరో - TVS Apache RTX 300. ఈ బండి ఇప్పుడు ఆటోమొబైల్ వరల్డ్‌లో కొత్త ఉత్సాహం రేపుతోంది. ₹1.99 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన ఈ బైక్‌, TVS‌ మొట్టమొదటి అడ్వంచర్‌ బైక్‌. అంతేకాదు, టీవీఎస్‌కు మిడ్‌రేంజ్ అడ్వెంచర్ టూరింగ్ సెగ్మెంట్‌లో అరంగేట్రంలా నిలిచింది. స్పోర్టీ లుక్‌, స్టైలిష్ డిజైన్‌, స్మార్ట్ టెక్నాలజీ కలయికలో ఇది కొత్త యుగానికి తలుపులు తెరిచింది.

ఇంజిన్‌ &పెర్ఫార్మెన్స్‌
TVS Apache RTX 300 లో ఉన్న 299cc లిక్విడ్ కూల్డ్ DOHC సింగిల్ సిలిండర్ ఇంజిన్ 9,000rpm వద్ద 36PS పవర్‌ & 7,000rpm వద్ద 28.5Nm టార్క్‌ను అందిస్తుంది. 6-స్పీడ్ గియర్‌ బాక్స్‌, స్లిప్పర్ క్లచ్‌, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌ తో ఇది స్పోర్టీ రైడింగ్ అనుభవానికి గ్యారెంటీ ఇస్తుంది. గేర్ మార్చే ప్రతిసారి స్పీడ్‌కు సరిగ్గా స్పందించే ఇంజిన్‌తో రోడ్డు పైన ఈ బైక్ గ్రిప్ అద్భుతంగా ఉంటుంది.

Ride-by-Wire థ్రాటిల్ సిస్టమ్, నాలుగు రైడింగ్ మోడ్స్‌ (Urban, Rain, Tour, Rally), ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్‌ వంటి ఫీచర్లు RTX 300ని మోర్‌ ప్రీమియంగా నిలబెడతాయి. 5 ఇంచుల TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, GoPro కంట్రోల్‌ వరకు అందుబాటులో ఉండడం ఈ సెగ్మెంట్‌లో దాదాపు అరుదు, అవన్నీ ఈ మోటార్‌ సైకిల్‌లో ఉన్నాయి.

టీవీఎస్ ఇంజినీర్లు దీనిని హై-స్ట్రెంగ్త్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్‌పై తయారు చేశారు. 180mm సస్పెన్షన్ ట్రావెల్‌ ఉన్న USD ఫోర్క్ & మోనో షాక్ లాంగ్ టూర్‌లో కూడా కంఫర్ట్ ఇవ్వగలవు. 19 అంగుళాల ఫ్రంట్‌ వీల్‌, 17 అంగుళాల రియర్ వీల్‌ సెట్‌తో అడ్వెంచర్ లుక్ అద్భుతంగా కనిపిస్తుంది. సుమారుగా 200mm గ్రౌండ్ క్లియరెన్స్, 835mm సీట్ హైట్‌తో ఇది సిటీ రైడింగ్‌కీ, అడ్వెంచర్ ట్రిప్స్‌కీ సరిపోతుంది.

బ్రేకింగ్ వ్యవస్థ
బ్రేకింగ్ పనితీరులో కూడా RTX 300 బ్రహ్మాండంగా ఉంది. 320mm డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్ ఛానల్ ABS, టెర్రైన్ అడాప్టివ్ మోడ్స్‌ దీనిలో అందించారు. ఇది ఏ రోడ్డు పరిస్థితుల్లోనైనా రైడర్‌కు ఫుల్‌ కంట్రోల్ ఇవ్వగలదు. బైక్‌ బరువు సుమారు 180 కిలోలు మాత్రమే ఉండడం వల్ల కూడా ఇది చురుగ్గా కదలుతుంది.

డిజైన్ & లుక్స్‌
డిజైన్ పరంగా చూస్తే, TVS Apache RTX 300 టాల్ స్టాన్స్‌, మస్క్యులర్ ట్యాంక్, LED హెడ్‌ల్యాంప్స్‌ & స్లీక్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. క్రాష్ ప్రొటెక్షన్‌, లగేజీ మౌంట్స్ వంటి ఆప్షనల్ యాక్సెసరీస్ అందుబాటులో ఉన్నాయి. BTO వెర్షన్‌లో TPMS, అడ్జస్టబుల్ సస్పెన్షన్, బ్రాస్ కోటెడ్ చైన్ రింగ్ వంటి అదనపు ఫీచర్లు ఉంటాయి.

కలర్స్‌ 
కలర్స్‌ విషయంలో కూడా TVS క్లాస్ చూపించింది, Viper Green ప్రత్యేకంగా టాప్ మోడల్ అందుబాటులో ఉంది. అలాగే.. Pearl White, Lightning Black, Metallic Blue, Tarn Bronze లాంటి ఐదు ఆకర్షణీయ కలర్స్ ఉన్నాయి. 12.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ లాంగ్ ట్రిప్స్‌కీ సరిపోతుంది.

టీవీఎస్ కొత్త R-TXD4 ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌పై తయారైన ఈ Apache RTX 300 యూత్ మైండ్‌సెట్‌కి సరిపోయేలా డిజైన్ చేశారు. టెక్, స్టైల్‌ & పెర్ఫార్మెన్స్‌ అన్నీ సమతుల్యంగా ఉండడం వలన, ఇది 300-400cc కేటగిరీలో అత్యంత విలువైన ఆఫర్‌గా నిలుస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Election Result 2025:బిహార్‌లో మనసులు గెలిచిందెవరు? మట్టికరిచిందెవరు? పూర్తి విజేతల జాబితా ఇదే!
బిహార్‌లో మనసులు గెలిచిందెవరు? మట్టికరిచిందెవరు? పూర్తి విజేతల జాబితా ఇదే!
Railways News: వచ్చే ఏడు రోజుల పాటు ఈ రైళ్లు రద్దు, ఎక్కడికైనా వెళ్లే ముందు జాబితా తనిఖీ చేయండి
వచ్చే ఏడు రోజుల పాటు ఈ రైళ్లు రద్దు, ఎక్కడికైనా వెళ్లే ముందు జాబితా తనిఖీ చేయండి
Visakhapatnam CII Partnership Summit: 75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
EV Tyres India: ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్‌ వాడాలా? నార్మల్‌ టైర్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్స్‌ వాడాలా? నార్మల్‌ టైర్స్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
Advertisement

వీడియోలు

Jubilee Hills By Election Result | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వేలకు సైతం అందని భారీ మెజారిటీ
Naveen Yadav Wins in Jubilee Hills By Election | పని చేయని సానుభూతి...జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్ కైవసం
Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్
Jubilee hills Election Result 2025 | పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే ఆధిక్యం...జూబ్లీహిల్స్ పీఠం ఎవరిదో.? | ABP Desam
Ruturaj Gaikwad Century vs South Africa A | ఛాన్స్ దొరికితే సెంచరీ కొట్టి గంభీర్ నే క్వశ్చన్ చేస్తున్న రుతురాజ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Election Result 2025:బిహార్‌లో మనసులు గెలిచిందెవరు? మట్టికరిచిందెవరు? పూర్తి విజేతల జాబితా ఇదే!
బిహార్‌లో మనసులు గెలిచిందెవరు? మట్టికరిచిందెవరు? పూర్తి విజేతల జాబితా ఇదే!
Railways News: వచ్చే ఏడు రోజుల పాటు ఈ రైళ్లు రద్దు, ఎక్కడికైనా వెళ్లే ముందు జాబితా తనిఖీ చేయండి
వచ్చే ఏడు రోజుల పాటు ఈ రైళ్లు రద్దు, ఎక్కడికైనా వెళ్లే ముందు జాబితా తనిఖీ చేయండి
Visakhapatnam CII Partnership Summit: 75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు - సీఐఐ సమ్మిట్‌లో ఏపీకి పారిశ్రామికవేత్తల క్యూ
EV Tyres India: ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్‌ వాడాలా? నార్మల్‌ టైర్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
ఎలక్ట్రిక్ వాహనానికి ఈవీ టైర్స్‌ వాడాలా? నార్మల్‌ టైర్స్‌ వాడాలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఏది వాడితే ఎక్కువ మైలేజ్ వస్తుంది!
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి  కంగారు పడి వచ్చేయకండి
Globetrotter కి పాస్ లు ఉంటేనే రండి కంగారు పడి వచ్చేయకండి
Vizag CII Summit:  సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
సీఐఐ సదస్సు వేదికగా డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలకు శ్రీకారం - వర్చువల్‌గా చంద్రబాబు, పీయూష్ గోయల్ శంకుస్థాపన
Love OTP Review - 'లవ్ ఓటీపీ' రివ్యూ: 'గర్ల్ ఫ్రెండ్'కు రివర్స్ కాన్సెప్ట్... అబ్బాయి భయపడి బ్రేకప్ చెప్పలేకపోతే?
'లవ్ ఓటీపీ' రివ్యూ: 'గర్ల్ ఫ్రెండ్'కు రివర్స్ కాన్సెప్ట్... అబ్బాయి భయపడి బ్రేకప్ చెప్పలేకపోతే?
Pithapuram Pawan Kalyan:  ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం -  రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం - రూ.20 కోట్లతో 19 ఆలయాల అభివృద్ధి పనులు - పవన్ సమీక్ష
Embed widget