(Source: ECI | ABP NEWS)
ప్రైవేట్ జెట్ ఫీల్ ఇచ్చే లగ్జరీ MPV Lexus LM350h - ఇదంటే సెలబ్రెటీలకు పిచ్చ క్రేజ్, ధర కేవలం...
₹2.7 కోట్లు ఎక్స్-షోరూమ్ ధర గల లెక్సస్ LM350h ఇప్పుడు బాలీవుడ్ సెలబ్రిటీలకు, బిజినెస్ టైకూన్లకు ఫేవరెట్ కార్. ప్రైవేట్ జెట్ కంఫర్ట్‌తో ఈ లగ్జరీ MPV అందరికీ ఆకర్షణగా మారింది.

Lexus LM350h Features Price: బాలీవుడ్ స్టార్‌లు, బిజినెస్ టైకూన్లు ఈ మధ్య లగ్జరీ SUVల కంటే ఒక వాహనం మీదే బాగా మోజు చూపిస్తున్నారు - అదే Lexus LM350h. ₹2.7 కోట్లు ఎక్స్-షోరూమ్ ధర ఉన్న ఈ లగ్జరీ MPVని "రోడ్డు మీద నడిచే ప్రైవేట్ జెట్" (Private jet on wheels) అని పిలుస్తున్నారు. లెక్సస్ చెప్పినట్లు ఇది కేవలం వాహనం మాత్రమే కాదు, ఒక అనుభవం.
బయటకు చూస్తే వ్యాన్, లోపల ప్రైవేట్ జెట్
Lexus LM350h ను బయట నుంచి చూస్తే పెద్ద లగ్జరీ వ్యాన్‌లా కనిపిస్తుంది. కానీ లోపల అడుగుపెట్టగానే ఆ భావన పూర్తిగా మారిపోతుంది. ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్ ఓపెన్ అవగానే, మీరు ఒక ప్రైవేట్ సూట్‌లోకి వెళ్లిన ఫీలింగ్ వస్తుంది. పెద్ద గ్లాస్ పార్టిషన్, నాయిస్ ఇన్సులేషన్, డిమ్మబుల్ లైటింగ్ - ఇవన్నీ కలిపి ఒక హాలీవుడ్ సినిమా సీన్‌లా ఉంటుంది.
సూపర్ కంఫర్ట్ సీటింగ్ & జపనీస్ హాస్పిటాలిటీ
‘ఓమోటెనాషి’ అంటే జపాన్ హాస్పిటాలిటీ. అదే లెక్సస్ LMలో ప్రతీ చోటా కనిపిస్తుంది. రియర్ సీట్స్‌లో కూర్చునే వారికి మసాజ్, హీటింగ్, వెంటిలేషన్, పవర్ అడ్జస్ట్‌మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సీటింగ్ పొజిషన్ ఎలివేటెడ్‌గా ఉండటంతో బయటి దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. ఫోల్డ్ అయ్యే టేబుల్, ప్రైవేట్ ట్రే, ఇంకా చాలా ఎలిమెంట్స్ ప్రీమియం క్వాలిటీతో తయారయ్యాయి.
48-అంగుళాల మానిటర్ & 23 స్పీకర్ల సౌండ్ సిస్టమ్
రియర్ పార్టిషన్‌పై ఉన్న 48-అంగుళాల మానిటర్ ఈ కారు హైలైట్. దానిని రెండు స్క్రీన్‌లుగా విభజించి ఇద్దరూ వేర్వేరు కంటెంట్ చూడొచ్చు. దీన్ని 23 స్పీకర్ల Mark Levinson సౌండ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. అంటే, థియేటర్ అనుభవం రోడ్డుపైనే!.
శాంతంగా, స్మూత్‌గా, హైబ్రిడ్ పవర్‌తో
ఇది కేవలం లగ్జరీ కాదు, టెక్నాలజీ గోల్డ్ స్టాండర్డ్. హైబ్రిడ్ ఇంజిన్ (E20 కంప్లైంట్) కారణంగా ఇది చాలా సైలెంట్‌గా, ఎకానమికల్‌గా ఉంటుంది. నాయిస్ ప్రూఫింగ్ అధికంగా ఉండటంతో కేబిన్ పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది.
క్లైమేట్ కాన్సీయర్జ్ - మీ మూడ్‌కి తగిన కంఫర్ట్
ఈ ఫీచర్, ప్యాసింజర్ బాడీ టెంపరేచర్‌ను చదివి "Dream, Relax, Focus, Energise, My Original" మోడ్‌లలో కంఫర్ట్‌ని ఆటోమేటిక్‌గా సెట్ చేస్తుంది. అంటే మీ మూడ్‌కి తగినట్లుగా కారులోని వాతావరణం మారిపోతుంది.
ఎవరి కోసం ఈ లగ్జరీ MPV?
ఈ వాహనం డ్రైవర్ కోసం కాదు, డ్రైవ్ చేయించుకునే వాళ్ల కోసం. బిజినెస్ టైకూన్లు మీటింగ్‌కి వెళ్తూ రియర్ సీట్‌లో రిలాక్స్ అవుతారు. స్టార్‌లు షూట్ తర్వాత ఇక్కడే ఆన్‌వైండ్ అవుతారు. ఇది లగ్జరీ, ప్రైవసీ, కంఫర్ట్ - ఈ మూడింటి మిశ్రమం.
ఎందుకంత పాపులర్ అయింది?
సాధారణ SUVల కంటే ఇది చాలా ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పెద్ద స్పిండిల్ గ్రిల్, షార్ప్ డిజైన్, 5125 mm లెంగ్త్ వంటివన్నీ ఈ వాహనాన్ని రోడ్డుపై స్టార్‌గా నిలబెడతాయి. ఇదే కారణంగా సెలబ్రిటీలు ఈ MPVని తమ ప్రిఫర్డ్ డ్రైవ్‌గా మార్చుకున్నారు.
₹2.7 కోట్లు ధర ఉన్నప్పటికీ, ఈ వాహనాన్ని కొనేవారికి డబ్బు కన్నా ప్రైవసీ, ప్రెస్టీజ్, పర్సనల్ కంఫర్ట్ ఎక్కువ. అందుకే బాలీవుడ్ నుంచి బిజినెస్ వరల్డ్ వరకు అందరూ ఈ Lexus LM350h కి ఫిదా అవుతున్నారు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















