Renault Duster రీఎంట్రీ కన్ఫర్మ్ - కొత్త ప్లాట్‌ఫామ్, మరింత పవర్, స్టైల్‌తో లాంచ్‌కు సిద్ధం
New Renault Duster భారత్‌లోకి రాబోతోంది. పూర్తిగా కొత్త డిజైన్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లతో జనవరి 26, 2026న లాంచ్ అవనుంది. SUV అభిమానులకు ఇది బంపర్ న్యూస్.

2026 Renault Duster Comeback Launch Date: మన దేశంలో, SUV మార్కెట్‌లో కొత్త ఊపు తీసుకొచ్చిన రెనాల్ట్ డస్టర్ మళ్లీ రాబోతోంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ లెజెండరీ SUV కొత్త రూపంలో తిరిగి లాంచ్ కాబోతోంది. కంపెనీ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, 2026 జనవరి 26 (భారతదేశ గణతంత్ర దినోత్సవం) న కొత్త తరం డస్టర్ (new-generation Renault Duster SUV) ను రెనాల్ట్ ఆవిష్కరించనుంది.
కొత్త లుక్, మరింత కంఫర్ట్
ఇప్పుడు వచ్చేది పాత డస్టర్ కాదు, పూర్తిగా కొత్త మోడల్. కొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ వెర్షన్.. మోడ్రన్ డిజైన్, మస్‌క్యులర్ బాడీ స్టైల్, పెద్ద వీల్ ఆర్చ్‌లు, LED హెడ్‌ల్యాంప్స్, శక్తిమంతమైన రోడ్ ప్రెజెన్స్‌తో కలిపి డైనమిక్ లుక్ ఇస్తుంది. ఇంటీరియర్ కూడా కొత్తగా డిజైన్ చేస్తున్నారు. పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ చార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ లాంటి ఫీచర్లు అందించే అవకాశం ఉంది.
ఇంజిన్ & పనితీరు
కొత్త డస్టర్‌లో రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మైల్డ్-హైబ్రిడ్ వెర్షన్ కూడా తరువాత లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఫోకస్ కేవలం సిటీ SUV కాకుండా, ఆఫ్‌రోడ్ సామర్థ్యాలపైనా ఉంది. అందుకే 4x4 వెర్షన్ కూడా రావొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆఫ్‌రోడ్ DNA తో తిరిగి రాబోతున్న SUV
డస్టర్ అంటేనే రగ్గ్‌డ్ లుక్, సాలిడ్ స్టాన్స్ గుర్తుకొస్తాయి. ఆ DNAని రెనాల్ట్ ఈసారి కూడా కాపాడుకుంటోంది & కొనసాగిస్తుంది. స్క్వేర్ డిజైన్, పెద్ద గ్రౌండ్ క్లియరెన్స్, బ్రాడ్ బాడీ - ఇవన్నీ డస్టర్ స్పూర్తిని మళ్లీ తెస్తాయి. కొత్త వెర్షన్ ఆఫ్‌రోడ్ అడ్వెంచర్లకు ఈ SUV సరిగ్గా సరిపోతుందని కంపెనీ చెబుతోంది.
లోకల్ ప్రొడక్షన్‌తో అట్రాక్టివ్ ప్రైస్
కొత్త డస్టర్‌ను భారత్‌లోనే తయారు చేయనుంది రెనాల్ట్. దీనివల్ల ఎక్స్-షోరూమ్ ధరలు మరింత ఆకర్షణీయంగా ఉండే అవకాశం ఉంది. ఇది టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి ప్రముఖ SUVలతో గట్టి పోటీ ఇవ్వనుంది.
భారత్ మార్కెట్ కోసం స్పెషల్ రీఎంట్రీ
రెనాల్ట్ డస్టర్ గతంలో దేశవ్యాప్తంగా పాపులర్ SUVగా నిలిచింది. యువత, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఈ బోల్డ్ వెహికల్‌ను ఎగబడి కొన్నారు. ఈసారి మరింత ప్రీమియం లుక్, ఆధునిక ఫీచర్లతో యువతను లక్ష్యంగా చేసుకుంది. రిపబ్లిక్ డే (2026 జనవరి 26) లాంచ్‌తో ఈ SUV 2026లో గేమ్‌చేంజర్‌గా మారే అవకాశం ఉంది.
రెనాల్ట్ అధికారికంగా “డస్టర్” పేరుని కన్ఫర్మ్ చేయడంతో SUV అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మరోమారు SUV సింహాసనంపై కూర్చునే అవకాశం ఉన్న రెనాల్ట్ డస్టర్, ఇప్పుడు చరిత్రను తిరగరాయడానికి సిద్ధం అవుతోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















