అన్వేషించండి

Best Diesel Car: ఐదుగురు కూర్చోగల కారు కొనాలా? - ₹12 లక్షల్లో బిల్డ్‌ క్వాలిటీ, మైలేజ్‌ & ఫీచర్స్‌తో ఉన్న బెస్ట్‌ 3 డీజిల్‌ కార్లు ఇవే!

₹12 లక్షల బడ్జెట్‌లో బిల్డ్‌ క్వాలిటీ, ఫీచర్స్‌, మైలేజ్‌ అన్నీ కావాలా?. మొదటి కారు కోసం టాప్‌ 3 డీజిల్‌ ఆప్షన్లు - Tata Altroz, Mahindra XUV 3XO, Kia Syros - అందుబాటులో ఉన్నాయి.

Best Diesel Cars Under 12 Lakhs: మీ మొదటి కారు కొనబోతున్నారా?, మీ బడ్జెట్‌ ₹12 లక్షల లోపేనా?. అయితే మీరు తీసుకునే నిర్ణయం చాలా స్మార్ట్‌గా ఉండాలి. ఎందుకంటే ఇది “మొదటి కారు” కాబట్టి... బిల్డ్‌ క్వాలిటీ, కంఫర్ట్‌, ఫీచర్స్‌ & మైలేజ్‌ అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. వీటన్నింటికీ సరిపోయేలా మీరు డీజిల్‌ ఇంజిన్‌ కోరుకుంటే, ₹12 లక్షల రేంజ్‌లో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్‌ ఆప్షన్ల గురించి అర్ధం చేసుకుందాం.

1. Tata Altroz Diesel - స్ట్రాంగ్‌ బిల్డ్‌ & సాలిడ్‌ మైలేజ్‌

టాటా ఆల్ట్రోజ్‌ అంటే బిల్డ్‌ క్వాలిటీకి పేరుంది. గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ (GNCAP) క్రాష్‌ టెస్టుల్లో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ రావడం దీని బలం. ఈ కారులోని 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ సుమారు 90 bhp పవర్‌ ఇస్తుంది, మైలేజ్‌ దాదాపు 23 కి.మీ./లీటర్‌ వరకు వస్తుంది.

ఫీచర్స్‌ విషయానికి వస్తే - టచ్‌స్క్రీన్‌, ఆటో హెడ్‌ల్యాంప్స్‌, రియర్‌ కెమెరా, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

దీని టాప్‌ వేరియంట్‌ కూడా ₹12 లక్షల లోపే (ఆన్‌-రోడ్‌ ధర) లభిస్తుంది. ఐదుగురు ప్రయాణీకులు సౌకర్యంగా కూర్చోవచ్చు, లాంగ్‌ డ్రైవ్స్‌కి కూడా కంఫర్ట్‌గా ఉంటుంది.

2. Mahindra XUV 3XO Diesel - పంచ్‌ ఉన్న పెర్ఫార్మెన్స్‌

మహీంద్రా XUV 3XO డీజిల్‌ వెర్షన్‌ మరో మంచి ఆప్షన్‌. 1.5 లీటర్‌ ఇంజిన్‌ 115 bhp పవర్‌, 300 Nm టార్క్‌ ఇస్తుంది. అంటే, హైవే మీద లేదా ఎత్తుగా ఉన్న రోడ్లలో డ్రైవ్‌ చేసేటప్పుడు అస్సలు స్ట్రగుల్‌ కాదు.

ఎంట్రీ లేదా మిడ్‌ వేరియంట్లు ₹12 లక్షల్లో (ఆన్‌-రోడ్‌ ధర) వస్తాయి. సేఫ్టీ పరంగా బలంగా ఉండి, సస్పెన్షన్‌ సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి రోడ్‌ కంఫర్ట్‌ బాగుంటుంది.

ఒక్క లోపం ఏమిటంటే - హయ్యర్‌ వేరియంట్లలో లభించే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఈ రేంజ్‌లో దొరకవు. కానీ ఇంజిన్‌ & డ్రైవ్‌ అనుభవం మాత్రం పర్ఫెక్ట్‌.

3. Kia Syros Diesel - ఫీచర్స్‌తో ఫ్రెష్‌ SUV స్టైల్‌

కొత్తగా వచ్చిన కియా సైరోస్‌ డీజిల్‌ కూడా బలమైన కాంపిటేటర్‌. బేస్‌ వేరియంట్‌ ₹12 లక్షల (ఆన్‌-రోడ్‌ ధర) లోపే దొరుకుతుంది.

SUV లుక్‌, బాడీ స్ట్రెంగ్త్‌ బాగుంటాయి. ఇంజిన్‌ స్మూత్‌గా స్పందిస్తుంది, ఫీచర్స్‌లో టచ్‌స్క్రీన్‌, రియర్‌ కెమెరా, స్టీరింగ్‌ మౌంటెడ్‌ కంట్రోల్స్‌, కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

మైలేజ్‌ సుమారు 20–21 కి.మీ./లీటర్‌. సిటీ యూజ్‌, వీకెండ్‌ డ్రైవ్స్‌, లాంగ్‌ ట్రిప్స్‌.. ఇలా అన్ని మిక్స్‌ యూజ్‌లకు బాగా సరిపోతుంది.

ఏ కారు కొనాలి?

మీరు బిల్డ్‌ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తే - Tata Altroz Diesel స్మార్ట్‌ ఆప్షన్‌.

పెర్ఫార్మెన్స్‌ & టార్క్‌ కావాలంటే - Mahindra XUV 3XO Diesel బెటర్‌.

మోడర్న్‌ SUV లుక్‌ & ఫీచర్స్‌ కావాలంటే - Kia Syros Diesel ని ఎంచుకోండి.

₹12 లక్షలలో ఈ మూడు కార్లలో ఏది తీసుకున్నా “ఫీచర్స్‌, కంఫర్ట్‌, మైలేజ్‌” అన్నీ దొరుకుతాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Ampere Magnus Grand vs Honda Activa eయాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌ vs హోండా యాక్టివా ఇ! ఏది కొంటే మీకు లాభం?
యాంపియర్‌ మాగ్నస్‌ గ్రాండ్‌ vs హోండా యాక్టివా ఇ! ఏది కొంటే మీకు లాభం?
Mahindra Thar On Road Price Hyderabad: హైదరాబాద్‌లో మహీంద్రా థార్ ఆన్‌రోడ్‌ ధర ఎంత? నెల వారీ EMI వివరాలు ఏంటీ?  
హైదరాబాద్‌లో మహీంద్రా థార్ ఆన్‌రోడ్‌ ధర ఎంత? నెల వారీ EMI వివరాలు ఏంటీ?  
టయోటా టైసర్ ప్లస్‌లు & మైనస్‌లు ఇవే - కొనే ముందు మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
టయోటా టైసర్‌ కొనాలా? తొందరపడొద్దు, ముందు ప్లస్‌లు, మైనస్‌లు తెలుసుకోండి
అథర్ రిజ్టా & చేతక్‌కు కొత్త పోటీ - సెప్టెంబర్ 2న రాబోతున్న సింపుల్ అరైవ్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఫ్యామిలీమ్యాన్‌ కోసం సింపుల్ ఎనర్జీ కొత్త ఇ-స్కూటర్ - రిజ్టాకు పోటీ, రేటు ఎంత ఉండొచ్చంటే?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
Embed widget