అన్వేషించండి

Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 

ICMR NIN Food Guidelines: నేటి చిన్నారులే రేపటి పౌరులు అన్న నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR కీలక సూచనలు చేసింది. స్కూల్స్‌ పరిధిలో జంక్‌ఫుడ్స్‌ను నిషేదించాలని సూచించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ పిల్లల ఆరోగ్యంపై నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.
  • పాఠశాలల వద్ద జంక్ ఫుడ్, ప్రకటనలపై నిషేధం సూచించింది.
  • ప్యాకెట్లపై హెచ్చరిక లేబుళ్లు, జంక్ ఫుడ్‌పై పన్ను విధించాలని.
  • పిల్లల్లో ఊబకాయం, వ్యాధులను అరికట్టడమే ఈ నివేదిక లక్ష్యం.

ICMR NIN Food Guidelines: మీ పిల్లలు రోజూ తినే చిప్స్, ప్యాకేజీ స్నాక్స్‌ కూల్‌ డ్రింక్స్‌ వారి శరీరంలోకి ఎంతటి ప్రమాదకరమైన విషాన్ని పంపుతున్నాయో మీకు తెలుసా? మన కళ్ల ముందే మన పిల్లలు బరువు పెరిగిపోతూ, చిన్న వయసులోనే బీపీ, షుగర్ వంటి భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. భారతీయ పిల్లల భవిష్యత్‌ను కాపాడేందుకు ఇండియన్ కౌన్సిల్‌ ఆఫ్‌  మెడికల్‌ రీసెర్చ్‌(ICMR), నేనల్‌ ఇనిస్టిట్యూషన్ ఆఫ్‌ న్యూట్రిషన్(NIN) నేతృత్వంలోని "లెట్స్‌ ఫిక్స్ అవర్ ఫుడ్‌" కన్సార్షియం ఒక పాలసీ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ప్రయారిటీ పాలసీ యాక్షన్ టు ప్రమోట్‌ హెల్తియర్‌ డైట్స్‌ అండ్ ఫుడ్‌ ఎన్విరాన్‌మెంట్స్‌ ఫర్ చిల్డ్రన్‌ అండ్ అడోలెసెంట్స్ ఇన్ ఇండియా పేరిట నివేదికను బహిర్గతం చేసింది. 

ఈ పాలసీ కేవలం సాధారణ సలహాల డాక్యుమెంట్ మాత్రమే కాదు. పాఠశాల పరిసరాల్లో జంక్‌ ఫుడ్ బ్యాన్, ప్రాసెస్‌ ఫుడ్స్‌పై హెల్త్‌ ట్యాక్స్‌, ప్యాకెట్లపై స్పష్టమైన ఫ్రంట్‌ ఆఫ్‌ ప్యాక్ న్యూట్రిషన్‌ లేబులింగ్‌, పిల్లలను లక్ష్యంగా చేసుకుని చేసే మోసపూరిత ప్రకటనలపై కఠిన చట్టపరమైన నిషేధాలు విధించాలని ఈ నివేదిక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలను నిర్దేశించింది. భారత్‌లో నానాటికీ పెరిగిపోతున్న చిన్నారుల ఊబకాయం, నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ అరికట్టడమే ఈ మాస్టర్ ప్లాన్ ఉద్దేశం. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇతరులు తెలుసుకోవాల్సిన ఈ ఐసీఎంఆర్‌- ఎన్‌ఐఎన్‌ మార్గద్శకాల్లో లోతైన విశ్లేషణను, సంచలనాత్మక నిజాలపై ప్రత్యేక కథనం. 

6.1 కోట్ల మంది భారతీయ పిల్లల ఓవర్‌వెయిట్‌

ఐసీఎంఆర్ సేకరించిన లెక్కల ప్రకారం దేశంలో ఆరోగ్య సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. భారత్‌లో ఐదు నుంచి 19 ఏళ్ల వయసు ఉన్న వారిలో 6.1 కోట్ల మంది తీవ్రమైన ఓవర్‌ వెయిట్‌, ఊబకాయంతో బాధపడుతున్నారు. మొత్తం జనాభాలో 28.5 శాతం ముప్పు ముంగిట ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి ఇలానే కొనసాగితే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా బాల్య ఊబకాయం భారంలో ఇండియా వాటా ఏకంగా 11శాతం కంటే ఎక్కువ ఉంటుందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ  హెచ్చరిస్తోంది. మన దేశంలో ఇప్పటికే 101 మిలియన్ల మంది డయోబెటిస్‌, 315 మిలియన్ల మంది హైపర్‌టెన్షన్, 254 మిలియన్ల మంది ఒబెసిటీ బాధిత పెద్దలు ఉన్నారు. ఇప్పుడు ఈ జీవనశైలి వ్యాధులు చిన్న వయసులోనే పిల్లలకు వ్యాప్తిస్తుండటం అత్యంత ఆందోళనకరం. 

3ఏళ్ల పరిశోధనలతో లెట్స్ ఫిక్స్ అవర్ ఫుడ్ కాన్సెప్ట్

ICMR-NIN డైరెక్టర్ డాక్టర్‌ భారతి కులకర్ణి పర్యవేక్షణలో, గ్లోబల్‌, జాతీయ భాగస్వాములైన యునిసెఫ్ ఇండియా, ప్రపంచ ఆరోగ్యం సంస్థ, FSSI, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, రిజాల్వ్‌ టు సేవ లైవ్స్‌ సంస్థలు కలిసి ఈ లెట్స్‌ ఫిక్స్ అవర్ ఫుడ్‌(LFOF) కన్సార్షియంను ఏర్పాటు చేశారు. 

సుదీర్ఘంగా మూడేళ్ల పాటు వివిధ రాష్ట్రాల్లో జరిపిన క్షేత్రస్థాయి పరిశోధనలు, పాఠశాలల ఆహార వాతావరణంపై సర్వేలు, విద్యార్థులు- తల్లిదండ్రులు నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా పది ప్రాధాన్యత విధాన ప్రతిపాదనలను రూపొందించారు. భవిష్యత్‌ తరాలను కాపాడుకోవడానికి తక్షణమే చట్టబద్ధమైన చర్యలు అవసరమని PHFI ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్ కే శ్రీనాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. 

జంక్‌ ఫుడ్‌ అడ్వర్టైజ్‌మెంట్లై సర్జికల్ స్ట్రైక్‌

టీవీలు, సోషల్ మీడియా యూట్యూబ్‌, గేమింగ్ యాప్‌లలో పిల్లలను ఆకర్షించేలా వస్తున్న డిజిటల్‌ ప్రకటనలపై కఠిన ఆంక్షలు విధించాలని పాలసీ డాక్యుమెంట్‌ ప్రతిపాదించింది. హై ఫ్యాట్, సాల్ట్‌ అండ్ షుగర్‌ అధికంగా ఉండే ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌, చక్కెర పానీయాల ప్రకటనలను పిల్లలు చూసే సమయాల్లో ప్రసారం చేయకూడదు. ఈ డ్రింక్ తాగితే ఎత్తు పెరుగుతారు, బిస్కెట్‌ తింటే తెలివితేటలు పెరుగుతాయి వంటి మిస్‌లీడింగ్ హెల్త్ క్లెయిమ్స్‌ నిలిపివేయాలి. కంపెనీల స్వీయ నియంత్ర విఫలమైనందున, FSSI, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ద్వార కఠినమైన చట్టపరమైన నిబంధనలు అమలు చేయాలని నివేదిక చెప్పింది. 

ప్యాకేట్‌లపై పెద్ద పెద్దగా వార్నింగ్ తప్పనిసరి 

ప్రస్తుతం ప్యాకెట్ల వెనుక వైపు అతి చిన్న అక్షరాలతో రాసే న్యూట్రిషన్ విలువలను చదవడం సామాన్య వినియోగదారులకు కష్టం. అందుకే ప్యాకెట్‌ ముందు భాగంలోనే స్పష్టంగా కంటికి కనిపించేలా విజువల్ లేబుల్స్‌ ముద్రించాలని ICMR సిఫార్స్ చేసింది. ఆహారంలో సాటర్డ్‌ ఫాట్స్‌, సోడియం, లేదా పరిమితికి మించిన చక్కెర ఉంటే ప్యాకెట్‌పై వార్నింగ్ బ్యాడ్జ్‌ ఉంచాలి. తల్లిదండ్రులు లేదా పిల్లలు సూపర్‌ మార్కెట్‌లో లేదా షాపుల్లో వస్తువును చేతిలోకి తీసుకోగానే, అది ఆరోగ్యానికి మంచిందా లేదా అనేది 2 సెకన్లలో గుర్తుపట్టేలా డిజైన్ చేయాలి. ఈ లేబుల్స్‌ను ఎలా అర్థం చేసుకోవాలో వివరించేందుకు ICMR-NIN ప్రత్యేకంగా ఇ-లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు, కామిక్‌ బుక్స్‌ రూపంలో అవగాహన సామగ్రిని ఆవిష్కరించింది. 

హెల్తీ స్కూల్ వాతావరణం

స్కూల్ క్యాంటీన్లు, ప్రాంగణ పరిసరాల్లో పిల్లల ప్రాసెస్డ్‌ ఫుడ్‌ అలవాట్లకు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. దీనిని అరికట్టేందుకు ఒక వినూత్న కార్యక్రమానికి ICMR ఆవిష్కరించింది. నీట్‌-ఎస్‌(న్యూట్రిషన్ ఎన్విరాన్‌మెంట్‌ అసెస్మెంట్‌ టూల్‌కిట్‌ ఫర్‌ స్కూల్స్‌) పాఠశాలల్లో , స్కూల్ కాపౌండ్‌ చుట్టుపక్కల 50-100 మీటర్ల పరిధిలో లభించే ఆహార నాణ్యతను మూల్యాంకనం చేయడానికి నీట్-ఎస్‌ టూల్‌ కిట్‌ రూపొందించారు. దీని ప్రకారం స్కూల్‌ కాంటీన్లలో పిజ్జాలు, బర్గర్లు, కార్బోనేటెడ్‌ కూల్ డ్రింక్స్‌, ప్యాకేజ్డ్‌ చిప్స్ విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలి. తాజా పండ్లు, మజ్జిగ, మొలకలు, రాగి జావ, కొబ్బరి బొండాలు వంటి పోషకాహారాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆయుష్మాన్ భారత్-స్కూల్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రామ్‌ ద్వారా న్యూట్రిషన్ లిటరసీ పెంచాలి. 

జంక్‌ఫుడ్‌పై హెల్క్‌ ట్యాక్స్‌

ఆరోగ్యకరమైన ఆహారాన్ని చౌకగా, ప్రాసెస్డ్‌ జంక్ ఫుడ్‌ను ప్రియంగా మార్చడానికి పన్నుల విధానం మార్చాలని కన్సార్షియం ప్రతిపాదించింది. HFSS ఫుడ్స్‌, చక్కెర కలిపిన పానీయాలపై ప్రత్యేక సిన్ ట్యాక్స్ విధించాలి. ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని పండ్లు, తృణధాన్యాల రవాణాపై రాయితీ ఇవ్వాలి. గుండె జబ్బులు , అధిక రక్తపోటును అరికట్టడానికి ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించడంతోపాటు లో సోడియం సాల్ట్‌ సబ్‌స్టిట్యూట్స్‌ వినియోగాన్ని ప్రోత్సహించాలి. వంటనూనెల నాణ్యతను పెంచడం, రీ హీటెడ్‌ నూనెల వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం అత్యంత ఆవశ్యకమని  పేర్కొన్నారు. 

Frequently Asked Questions

ICMR-NIN ఏ కొత్త పాలసీ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది?

ICMR, NIN ఆధ్వర్యంలోని

ఈ కొత్త విధానం ఏ సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది?

చిప్స్, ప్యాకేజీ స్నాక్స్, కూల్ డ్రింక్స్ వల్ల పిల్లలు చిన్న వయసులోనే బరువు పెరిగి, బీపీ, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. దేశంలో 6.1 కోట్ల మంది పిల్లలు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు.

పాఠశాలల కోసం ICMR-NIN నివేదిక ప్రధాన సిఫార్సులు ఏమిటి?

పాఠశాలల పరిసరాల్లో జంక్ ఫుడ్‌ను బ్యాన్ చేయాలి. స్కూల్ క్యాంటీన్లలో పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్ నిషేధించి, తాజా పండ్లు, మజ్జిగ వంటి పోషకాహారాలు అందించాలని సిఫార్సు చేసింది.

ఆహార ప్యాకేజింగ్, ప్రకటనలపై ఈ నివేదిక ఏమి సూచిస్తుంది?

ప్యాకెట్ల ముందు భాగంలో స్పష్టమైన న్యూట్రిషన్ లేబుల్స్, వార్నింగ్ బ్యాడ్జ్‌లు ఉండాలి. పిల్లలను ఆకర్షించే జంక్ ఫుడ్ ప్రకటనలపై కఠిన ఆంక్షలు విధించాలని ఈ నివేదిక సూచించింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Wearing Slippers at Home : ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
ఇంట్లో చెప్పులు వేసుకుని నడవాలా? లేక చెప్పులు లేకుండా నడవాలా? ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Embed widget