అన్వేషించండి

Best Car Under 15 Lakh: ₹15 లక్షల్లో బెస్ట్‌ మైలేజ్‌ & బాడీ స్ట్రెంగ్త్‌ రెండూ కావాలా? - ఈ మారుతి కారు మీకో సూపర్‌ ఆప్షన్‌!

Best Mileage Car Under 15 Lakh: ₹15 లక్షల బడ్జెట్‌లో మైలేజ్‌ బాగుండి, బలమైన బాడీ కూడా ఉన్న కారు కావాలా? ఇటీవల కొత్తగా లాంచ్‌ అయిన మారుతి కారు మీ అవసరాలకి సరిపోయే కొత్త ఆప్షన్‌.

Maruti Victoris Price Mileage Specifications: మంచి కారు కొనాలనుకునే వాళ్లందరిదీ ఒకటే ఆలోచన - “మైలేజ్‌ బాగుండి డబ్బు ఆదా కావాలి, బాడీ స్ట్రాంగ్‌గా ఉండి ఫ్యామిలీకి భద్రత ఉండాలి.” ₹15 లక్షల బడ్జెట్‌లో ఈ రెండు లక్షణాలు కలిపి దొరకడం కాస్త కష్టం. కానీ ఇప్పుడు మారుతి సుజుకి తీసుకొచ్చిన మారుతి విక్టోరిస్‌ ఆ గ్యాప్‌ను ఈజీగా ఫిల్‌ చేస్తోంది.

Maruti Victoris - స్టైలిష్‌గా, బలంగా
మారుతి విక్టోరిస్‌ డిజైన్‌ కాస్త SUV తరహాలో ఉంటుంది. బాడీ స్ట్రక్చర్‌ దృఢంగా ఉండటంతో రోడ్డు మీద స్టేబిలిటీ బాగుంటుంది. హైవే మీద కూడా హ్యాండ్లింగ్‌ సెక్యూర్డ్‌గా అనిపిస్తుంది. మారుతి తమ కొత్త మోడళ్లలో ఉపయోగిస్తున్న హై-టెన్సైల్‌ స్టీల్‌, ఈ కారు బాడీ స్ట్రెంగ్త్‌కి అదనపు బలం ఇస్తుంది.

మారుతి అంటే మైలేజ్‌
మారుతి విక్టోరిస్‌ కారు 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో పని చేస్తుంది. మాన్యువల్‌ గేర్‌ బాక్స్‌ కాంబినేషన్‌లో లీటరుకు దాదాపు 22 కి.మీ. వరకు మైలేజ్‌ ఇస్తుంది. అంటే సిటీ డ్రైవింగ్‌తో పాటు హైవే ట్రిప్స్‌కి కూడా ఇది పర్ఫెక్ట్‌ పార్ట్‌నర్‌. ఫ్యూయల్‌ ఖర్చు తగ్గి, మెంటెనెన్స్‌ కూడా తక్కువగా ఉంటుంది - అంటే పొదుపు ఎక్కువగా ఉంటుంది!.

కంఫర్ట్‌ కూడా మామూలుగా లేదు
విక్టోరిస్‌ ఇంటీరియర్‌లో మారుతి కొత్త డిజైన్‌ ఫిలాసఫీని ఫాలో అయింది. కేబిన్‌ స్పేస్‌ బాగుంది, వెనుక సీట్లో లెగ్‌రూమ్‌ సరిపడా ఉంటుంది. సీనియర్‌ సిటిజన్లు లేదా ఫ్యామిలీ ట్రిప్స్‌ చేసే వాళ్లకు ఇది చక్కగా సరిపోతుంది. సస్పెన్షన్‌ సెటప్‌ బలమైన రోడ్లను కూడా ఈజీగా హ్యాండిల్‌ చేస్తుంది.

ధర & వేరియంట్లు
తెలుగు రాష్ట్రాల్లో మారుతి విక్టోరిస్‌ ధర ₹10,49,900 ఎక్స్‌-షోరూమ్‌ నుంచి ప్రారంభమవుతుంది. ఆన్‌-రోడ్‌ ధరతో కలుపుకుని ₹15 లక్షల లోపే మంచి ఫీచర్స్‌, మైలేజ్‌, బాడీ స్ట్రెంగ్త్‌ అన్నీ దొరుకుతున్నాయి. ఇది మాన్యువల్‌ వెర్షన్‌లో అందుబాటులో ఉండి, ఫీచర్ల పరంగానూ బాగానే బ్యాలెన్స్‌ అయ్యింది.

హైదరాబాద్‌, విజయవాడ వంటి మార్కెట్లలో మారుతి విక్టోరిస్‌ డిమాండ్‌ పెంచుకుంటోంది. ఈ కారును దీర్ఘకాలం వాడాలనుకునే వాళ్లకు మారుతి సర్వీస్‌ నెట్‌వర్క్‌ కూడా ఒక ప్లస్‌ పాయింట్‌.

₹15 లక్షల లోపే “మైలేజ్‌ కూడా బాగుండాలి, బాడీ కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి” అనుకునే వాళ్లకు మారుతి విక్టోరిస్‌ పెట్రోల్‌ మాన్యువల్‌ ఓ స్మార్ట్‌ ఆప్షన్‌. ఇది యువతకీ, ఫ్యామిలీ యూజ్‌కీ సరిపోయే పర్ఫెక్ట్‌ కాంబినేషన్‌. సింపుల్‌గా చెప్పాలంటే, ఈ బడ్జెట్‌లో ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ, బాడీ బలం, బ్రాండ్‌ నమ్మకం - ఈ మూడు ఒకే కారులో కావాలంటే, విక్టోరిస్‌ గురించి కచ్చితంగా ఆలోచించవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌పై అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌తో పాటు BaaS ఆఫర్ - నిజంగా మంచి ఆఫర్‌!
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ కొనేవాళ్లకు బంపర్‌ ఆఫర్‌.. అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌తో రీసేల్‌ చాలా ఈజీ!
2026 మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌ - పానోరమిక్ సన్‌రూఫ్‌, భారీ టచ్‌స్క్రీన్‌, 540 డిగ్రీ కెమెరా, కొత్త ఫీచర్లతో లాంచ్‌
రూ.13.69 లక్షలకే కొత్త మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌.. పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎక్స్‌పీరియన్స్‌
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
డ్రైవర్‌ సహా వాహనంలో ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా - సుప్రీంకోర్టు సంచలన తీర్పు, కొత్త నిబంధనలు!
కొత్త కార్లకు 4 ఏళ్లు, బైక్‌లకు 6 ఏళ్లు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి? సుప్రీంకోర్టు సూచన

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget