అన్వేషించండి

Electric Vehicles Charging Tips: మీది ఎలక్ట్రిక్‌ వెహికలా? చార్జింగ్‌ చేస్తున్నప్పుడు జాగ్రత్త, సైబర్‌ నేరగాళ్లు మీ డేటాను దోచుకోవచ్చు!

Electric Vehicles Charging Tips: ఎలక్ట్రిక్‌ వాహనాలు కేవలం ప్రయాణ సాధనాలు కాదు. చార్జింగ్‌ స్టేషన్లు, గ్రిడ్‌, సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమై ఉండటంతో సైబర్‌ దాడులకు గురయ్యే ప్రమాదం పెరుగుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎలక్ట్రిక్ వాహనాలు చార్జింగ్ స్టేషన్లు, గ్రిడ్, యాప్‌లతో డేటా మార్పిడి చేసుకుంటాయి.
  • చార్జింగ్ స్టేషన్లు, వాహనాల సాఫ్ట్‌వేర్ సైబర్ నేరగాళ్లకు లక్ష్యంగా మారుతున్నాయి.
  • వాహనం నుంచి గ్రిడ్ కు విద్యుత్ సరఫరాలో లోపాలు వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.
  • వ్యక్తిగత డేటా చోరీ, వాహన భద్రతకు సైబర్ ముప్పులు పొంచి ఉన్నాయి.

Electric Vehicle Cyber Security: ఇప్పుడు మన రోడ్లపై ఎలక్ట్రిక్‌ వాహనాలు సాధారణ దృశ్యంగా మారిపోయాయి. పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చులు తగ్గుతాయన్న ఆశతో, పర్యావరణానికి మేలు చేస్తాయన్న నమ్మకంతో చాలామంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఈ వాహనాల్లో ఒక విషయం ఎక్కువగా చర్చకు రావడం లేదు. అదే సైబర్‌ భద్రత.

ఎలక్ట్రిక్‌ వాహనం అంటే కేవలం బ్యాటరీ, మోటార్‌ మాత్రమే కాదు. ఇవి చార్జింగ్‌ స్టేషన్లు, విద్యుత్‌ గ్రిడ్‌, మొబైల్‌ యాప్‌లు, క్లౌడ్‌ సర్వర్లతో ఎప్పటికప్పుడు డేటా మార్పిడి చేసుకుంటుంటాయి. ఈ అనుసంధానం మీకు సౌకర్యంగా అనిపించినా, అదే సైబర్‌ నేరగాళ్లకు దారి చూపిస్తోంది.

చార్జింగ్‌ స్టేషన్లే ప్రధాన టార్గెట్‌

పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లు EV వ్యవస్థలో కీలక భాగం. ఇవి విద్యుత్‌ సరఫరా, యూజర్‌ గుర్తింపు, బిల్లింగ్‌, గ్రిడ్‌తో కమ్యూనికేషన్‌ వంటి పనులు చేస్తాయి. అందుకే హ్యాకర్లు మొదటగా కన్నేయేది వీటిపైనే. ఒకవేళ చార్జింగ్‌ నెట్‌వర్క్‌లో లోపాలు ఉంటే, చార్జింగ్‌ ఆగిపోవడం, తప్పుడు బిల్లింగ్‌, ఒకే సమయంలో ఎక్కువ వాహనాలకు సమస్యలు రావడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి.

వాహనం నుంచి గ్రిడ్‌కు కూడా విద్యుత్‌

కొత్త తరం ఈవీల్లో ‘వాహనం నుంచి గ్రిడ్‌కు’ విద్యుత్‌ పంపే టెక్నాలజీ వస్తోంది. అంటే వాహనం కేవలం విద్యుత్‌ వినియోగదారుగానే కాదు, అవసరమైతే సరఫరాదారుగా కూడా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వాహనంలో సైబర్‌ లోపం ఉంటే, అది మొత్తం స్థానిక విద్యుత్‌ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. నిపుణులు దీనిని ‘మొబైల్‌ ఎనర్జీ హబ్‌’గా అభివర్ణిస్తున్నారు.

డేటా లీక్‌ అయితే ఏమవుతుంది?

ఎలక్ట్రిక్‌ వాహనాలు యూజర్‌ లొకేషన్‌, చార్జింగ్‌ అలవాట్లు, చెల్లింపుల వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ డేటా తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వ్యక్తిగత గోప్యతకే కాదు, ఆర్థిక భద్రతకూ ముప్పే. అందుకే డేటా ఎన్‌క్రిప్షన్‌, గోప్యతను కాపాడే సిస్టమ్‌లపై పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ అన్ని కంపెనీలు ఒకే స్థాయిలో భద్రత పాటిస్తున్నాయా అన్నదే ప్రశ్న.

వాహన భద్రతకు కూడా ప్రమాదం

ఈవీల్లో ఇంజిన్‌ పనితీరు, వేగం, స్టెబిలిటీ అన్నీ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగానే నియంత్రణలో ఉంటాయి. ఒకవేళ హ్యాకర్లు ఈ సిస్టమ్‌ల్లోకి చొరబడితే, అది ప్రయాణికుల భద్రతకే ముప్పుగా మారుతుంది. కొన్ని పరిశోధనల్లో అసాధారణ ప్రవర్తనను గుర్తించే టెక్నాలజీలను పరీక్షించారు. అవి ఉపయోగకరంగానే ఉన్నా, వ్యవస్థ ఎంత క్లిష్టంగా మారిందన్నది ఇవి నిరూపిస్తున్నాయి.

ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాని భద్రత

ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు ఎక్కువగా ఒక్కో భాగంపైనే దృష్టి పెట్టాయి. కానీ మొత్తం ఈవీ వ్యవస్థను ఒకే ఫ్రేమ్‌లో చూసే అధ్యయనాలు చాలా తక్కువ. చార్జింగ్‌ కంపెనీలు, వాహన తయారీదారులు, విద్యుత్‌ సంస్థలు, నియంత్రణ సంస్థలు కలిసి పనిచేయకపోతే భద్రత బలపడదు.

నిపుణుల మాటల్లో చెప్పాలంటే... ఎలక్ట్రిక్‌ వాహనాలు అసురక్షితమైనవని కాదు. కానీ టెక్నాలజీ వేగంగా ముందుకు వెళ్తుండగా, దానిని కాపాడే రక్షణ వ్యవస్థలు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో, ఈవీ అంటే కేవలం రేంజ్‌, ధర మాత్రమే కాదు... సైబర్‌ భద్రత కూడా కీలక అంశంగా మారబోతోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

ఎలక్ట్రిక్ వాహనాలలో సైబర్ భద్రత ఎందుకు ముఖ్యం?

ఎలక్ట్రిక్ వాహనాలు చార్జింగ్ స్టేషన్లు, గ్రిడ్, యాప్‌లు, సర్వర్‌లతో డేటాను మార్పిడి చేసుకుంటాయి. ఈ అనుసంధానం సైబర్ నేరగాళ్లకు దారి చూపవచ్చు.

సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారు?

సైబర్ నేరగాళ్లు మొదటగా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లపై కన్నేస్తారు. ఈ నెట్‌వర్క్‌లలో లోపాలు ఉంటే చార్జింగ్ ఆగిపోవడం, తప్పుడు బిల్లింగ్ వంటి సమస్యలు వస్తాయి.

వాహనం నుంచి గ్రిడ్‌కు విద్యుత్ పంపే టెక్నాలజీ వల్ల కలిగే సైబర్ ముప్పు ఏమిటి?

ఒక వాహనంలో సైబర్ లోపం ఉంటే, అది మొత్తం స్థానిక విద్యుత్ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిని 'మొబైల్ ఎనర్జీ హబ్' గా పరిగణిస్తారు.

ఎలక్ట్రిక్ వాహనాలు సేకరించే డేటా లీక్ అయితే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి?

యూజర్ లొకేషన్, చార్జింగ్ అలవాట్లు, చెల్లింపుల వివరాలు వంటి సున్నితమైన సమాచారం తప్పుడు చేతుల్లో పడితే వ్యక్తిగత గోప్యతకు, ఆర్థిక భద్రతకు ముప్పు వాటిల్లుతుంది.

ఎలక్ట్రిక్ వాహనాల్లో సైబర్ భద్రత ప్రస్తుత స్థితి ఏమిటి?

ప్రస్తుతం పరిశోధనలు ఎక్కువగా ఒక్కో భాగంపైనే దృష్టి సారించాయి. సమగ్ర భద్రతా అధ్యయనాలు తక్కువ. చార్జింగ్ కంపెనీలు, వాహన తయారీదారులు, విద్యుత్ సంస్థలు కలిసి పనిచేస్తేనే భద్రత పెరుగుతుంది.

టాప్ హెడ్ లైన్స్

తక్కువ ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు.. BaaSతో దిగొచ్చిన ధరలు, పూర్తి లెక్క ఇదిగో
టాటా EVలపై భారీ తగ్గింపు.. కొత్త స్కీమ్‌తో రూ.7.30 లక్షల వరకు ఆదా!
ట్రాఫిక్‌ చలానాలు చెల్లించకపోతే వాహన సేవలకు బ్రేక్, లైసెన్స్‌పై వేటు, కరెంటు కట్‌!
ట్రాఫిక్ చలానా కట్టలేదా? ఇక కరెంట్ బిల్లు మోతే!.. ఈ రెండిటికీ ఏంటి సంబంధం?
కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
కేవలం 1500 మంది కొనగలిగే రెనాల్ట్ Renault Rafale Hypnotic, ఈ SUV ఎందుకంత స్పెషల్
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు
ఫెస్టివ్ సీజన్‌కు ముందే షాకివ్వనున్న Mahindra, ఈ ఏడాది 4వ సారి పెరగనున్న SUV ధరలు

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
ఉజ్జయినిలో షాహీ మసీదు కూల్చివేత వివాదం: షాహీ మసీదును ఎవరు నిర్మించారు, దాని చరిత్ర ఏంటి?
ఉజ్జయినిలో షాహీ మసీదు కూల్చివేత వివాదం: షాహీ మసీదును ఎవరు నిర్మించారు, దాని చరిత్ర ఏంటి?
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Embed widget