అన్వేషించండి

Tata Curvv EV కొంటే రూ. 3.80 లక్షల వరకు డిస్కౌంట్‌ - Punch, Tiago పైనా ప్రయోజనాలు

ఫిబ్రవరి 2026లో టాటా ఎలక్ట్రిక్‌ కార్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. Curvv EVపై రూ. 3.80 లక్షల వరకు తగ్గింపు, Punch EV, Nexon EV, Tiago EVలపై కూడా ప్రత్యేకమైన బెనిఫిట్స్‌ ఉన్నాయి.

Tata EV February 2026 Offers: ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి టాటా మోటార్స్‌ భారీ శుభవార్త చెప్పింది. ఈ నెలలో టాటా తన ఎలక్ట్రిక్‌ కార్ల లైన్‌అప్‌పై ప్రత్యేక కొనుగోలు ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఫిబ్రవరి ఆఫర్లు 2025 మోడల్‌ ఇయర్‌ & అలాగే 2026 మోడల్‌ ఇయర్‌ వాహనాలకు కూడా వర్తిస్తాయి. అయితే, ఈ ఆఫర్లు Tigor EVకు మాత్రం వర్తించవని కంపెనీ స్పష్టం చేసింది.

సాధారణంగా చూస్తే, 2026 మోడళ్లతో పోలిస్తే 2025 మోడల్‌ ఇయర్‌ కార్లపై ఎక్కువ లాభాలు లభిస్తున్నాయి. స్టాక్‌ క్లియరెన్స్‌ నేపథ్యంలో టాటా ఈ విధంగా భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నగరం, డీలర్‌, స్టాక్‌ లభ్యత ఆధారంగా ఆఫర్లు మారవచ్చు.

Tata Curvv EV - గరిష్ట ఆఫర్లు

టాటా ఎలక్ట్రిక్‌ కార్లలో ఈ నెలలో అత్యధిక లాభాలు Curvv EVపై ఉన్నాయి. ఫిబ్రవరి 2026లో... 2025 మోడల్‌ ఇయర్‌ Curvv EVను కొనుగోలు చేస్తే రూ. 3.80 లక్షల వరకు లాభాలు పొందవచ్చు. అదే 2026 మోడల్‌ ఇయర్‌ Curvv EVపై రూ. 3.30 లక్షల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది.

టాటా Curvv EV ఎంట్రీ లెవల్‌ Creative 45 వేరియంట్‌ ధర రూ. 17.49 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) నుంచి ప్రారంభమవుతుంది. టాప్‌ వేరియంట్‌ Empowered+ A Dark ధర రూ. 22.24 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర)గా ఉంది.

Tata Punch EV - కారు చిన్నదే కానీ ఆఫర్‌ పెద్దది

టాటా Punch EV ఈ కంపెనీలో అత్యంత అఫోర్డబుల్‌ ఎలక్ట్రిక్‌ SUV. దీని ధరలు రూ. 9.99 లక్షలు నుంచి రూ. 14.44 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌ ధర) వరకు ఉన్నాయి. 2025 మోడల్‌ ఇయర్‌ Punch EVపై రూ. 1.60 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. అయితే, 2026 మోడల్‌ ఇయర్‌ Punch EVపై ఈ ఆఫర్లు రూ. 90,000 వరకు మాత్రమే పరిమితమయ్యాయి.

Tata Harrier EV - ప్రీమియం కొనుగోలుదారులకు లాభం

టాటా ఫ్లాగ్‌షిప్‌ ఎలక్ట్రిక్‌ SUV అయిన Harrier EVపై ఫిబ్రవరి 2026లో రూ. 1.50 లక్షల వరకు లాభాలు ఉన్నాయి. ప్రత్యేకత ఏమిటంటే... 2025 & 2026 మోడల్‌ ఇయర్‌ Harrier EVలపై ఒకే రకమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇప్పటికే టాటా EV వినియోగదారులకు లాయల్టీ బోనస్‌ రూ. 1 లక్ష వరకు, ఎక్స్చేంజ్‌ బోనస్‌ రూ. 50,000 వరకు ఉన్నాయి. Harrier EV ప్రారంభ ధర రూ. 21.49 లక్షలు, టాప్‌ వేరియంట్‌ ధర రూ. 30.23 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర).

Tata Tiago EV - బడ్జెట్‌లో బెస్ట్‌ ఛాయిస్‌

టాటా Tiago EVపై కూడా ఫిబ్రవరి ఆఫర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. 2025 మోడల్‌ ఇయర్‌ Tiago EVపై రూ. 1.50 లక్షల వరకు బెనిఫిట్స్‌ లభిస్తున్నాయి. 2026 మోడల్‌ ఇయర్‌ వేరియంట్‌పై ఈ ఆఫర్లు రూ. 60,000 వరకు మాత్రమే ఉన్నాయి. Tiago EV ధరలు రూ. 7.99 లక్షలు నుంచి రూ. 11.14 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌ ధర) మధ్య ఉన్నాయి.

Tata Nexon EV - మోస్తరు తగ్గింపులు

టాటా Nexon EVపై ఈ నెలలో మోస్తరు ఆఫర్లు మాత్రమే ఉన్నాయి. 2026 మోడల్‌ ఇయర్‌ Nexon EVపై రూ. 30,000 వరకు తగ్గింపు లభిస్తుండగా, 2025 మోడల్‌ ఇయర్‌ కార్లపై రూ. 1.20 లక్షల వరకు ఆఫర్స్‌ ఉన్నాయి. Nexon EV ధరలు వేరియంట్‌ను బట్టి రూ. 12.49 లక్షలు నుంచి రూ. 17.49 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌ ధర) వరకు ఉన్నాయి.

ఈ నెలలో టాటా ఎలక్ట్రిక్‌ కారు కొనాలని భావిస్తున్నవాళ్లకు ఇది మంచి సమయం. ముఖ్యంగా Curvv EVపై ఉన్న భారీ ఆఫర్లు, Punch EV, Tiago EVలపై తగ్గింపులు తెలుగు ప్రజలకు పెద్ద ఆకర్షణగా నిలవనున్నాయి. ఖచ్చితమైన ఆఫర్ల వివరాల కోసం దగ్గరలోని టాటా మోటార్స్‌ డీలర్‌ను సంప్రదించడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
రూ.10-15 లక్షల్లో ఐదుగురికి హాయిగా సరిపోయే ఆటోమేటిక్‌ కారు, మంచి మైలేజ్ కూడా.. ఈ కారు బెస్ట్ ఛాయిస్!
వెనుక సీట్‌లో ముగ్గురు కూర్చోగల బెస్ట్ ఆటోమేటిక్ కారు ఏది? మారుతి బ్రెజ్జా లేదా హోండా అమేజ్?
అన్ని కార్లకూ పవర్ పెట్రోల్ అవసరమా? పూర్తి నిజం ఏంటో ఇప్పుడే తెలుసుకోండి!
పవర్ పెట్రోల్ vs నార్మల్ పెట్రోల్ - మీ కారుకు ఏది బెస్ట్? డబ్బు వృథా చేసుకోవద్దు
5.75 లక్షల బైక్ Royal Enfield Shotgun 650.. 3 నిమిషాల్లో SOLD OUT, ఫీచర్లు చూశారా
5.75 లక్షల బైక్ Royal Enfield Shotgun 650.. 3 నిమిషాల్లో SOLD OUT, ఫీచర్లు చూశారా

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget