Volvo XC90 EMI: కోటి రూపాయల వోల్వో ఎక్స్‌సీ90 - ఈఎంఐలో కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్ కట్టాలి?
Volvo XC90 Downpayment: ప్రముఖ కార్ల బ్రాండ్ వోల్వో మనదేశంలో ఎక్స్‌సీ90 అనే లగ్జరీ కారును విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారుపై మంచి ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Volvo XC90 EMI Calculator: వోల్వో కార్లు దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ బ్రాండ్ కార్లు మెరుగైన సెక్యూరిటీని అందించడంలో మంచి పేరు పొందాయి. వోల్వో ఎక్స్‌సీ90 కూడా గొప్ప లగ్జరీ కారు. ఈ కారులో 1969 సీసీ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 300 బీహెచ్‌పీ పవర్, 420 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ కారులో అనేక సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. కారులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి.
వోల్వోను ఈఎంఐలో కొనుగోలు చేయాలి?
వోల్వో ఎక్స్‌సి90 ధర రూ.1.17 కోట్లు. మీరు కొనుగోలు చేసే రాష్ట్రాన్ని కారు ధరలో తేడా ఉండవచ్చు. అయితే కోటి రూపాయలకు పైగా ధర ఉన్న కారు కొనడం సామాన్యుడికి కాస్త కష్టమే. కానీ ఈ కారును కార్ లోన్ ద్వారా కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ లగ్జరీ కారును కొనుగోలు చేయడానికి కొంత డబ్బును డౌన్ పేమెంట్‌గా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు రుణం తీసుకున్న కాల వ్యవధిని బట్టి ప్రతి నెలా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఇవే - నెక్సాన్ నుంచి సోనెట్ వరకు!
ప్రతి నెలా ఎంత ఈఎంఐ చెల్లించాలి?
వోల్వో ఎక్స్‌సీ90ని కొనుగోలు చేయడానికి మీరు బ్యాంకు నుంచి దాదాపు రూ. కోటి రుణం తీసుకోవాలి. కారు కొనాలంటే ముందుగా రూ.12 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లించాలి. దీని తర్వాత మీరు బ్యాంకు నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం ప్రతి నెలా ఈఎంఐ చెల్లించాలి.
కారు లోన్‌పై బ్యాంకు ఎనిమిది శాతం వడ్డీ వసూలు చేస్తే నాలుగేళ్ల పాటు ప్రతి నెలా రూ.2.60 లక్షలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
ఐదేళ్ల టైమ్‌తో అదే రుణం తీసుకుంటే ప్రతి నెలా రూ.2.15 లక్షల ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది.
ఆరేళ్ల కారు రుణంపై ప్రతి నెలా రూ.1.86 లక్షలు ఈఎంఐగా కట్టాల్సి ఉంటుంది.
వోల్వో కారు కొనేందుకు ఏడేళ్ల పాటు రుణం తీసుకుంటే.. నెలకు రూ.1.66 లక్షలు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది.
Also Read: హీరో స్ప్లెండర్ వర్సెస్ హోండా షైన్ - రెండు మైలేజీ బైక్‌ల్లో ఏది బెస్ట్?
With Google built-in navigate the roads better and listen to your favourite music or catch up on your shows while you’re at it. Learn more about the All-New Volvo XC90 Petrol Mild Hybrid by visiting the Volvo Car India website or book a test drive today. #VolvoIndia #XC90 pic.twitter.com/A4eEL9RGT3
— Volvo Car India (@volvocarsin) November 6, 2022
The head-up display in the Volvo XC90 Petrol Mild Hybrid lets you watch your speed, follow turn-by-
— Volvo Car India (@volvocarsin) October 18, 2022
turn navigation, and more. The brightness of the head-up display adapts automatically to the light
conditions. Know more: https://t.co/1TSK4VHYmB. #VolvoIndia #XC90 pic.twitter.com/FVTGL02kTL