అన్వేషించండి

తక్కువ ధరలో SUV ఈవీని లాంచ్ చేయనున్న VinFast, ఈ కార్లకు గట్టి పోటీ తప్పదా ?

Most Affordable EV: వియత్నాంకు చెందిన ఆటో మేకర్ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లో స్థానం కోసం పోటీ పడుతోంది. ఇందులో భాగంగా తక్కువ ధరలో వీఎఫ్3 ఎస్‌యూవీని తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విన్‌ఫాస్ట్ VF 3: భారతదేశంలో రూ. 10 లక్షల లోపు చౌకైన ఈవీ.
  • నగరాలకు అనుకూలం: కాంపాక్ట్ డిజైన్, సులభమైన పార్కింగ్, రోజువారీ ప్రయాణానికి ఆదర్శం.
  • 215 కి.మీ. రేంజ్: ఒకే ఛార్జ్‌పై రోజువారీ అవసరాలకు సరిపోతుంది.
  • పోటీ: టాటా టియాగో, ఎంజీ కామెట్, పంచ్ ఈవీలకు గట్టి పోటీ ఇవ్వగలదు.

భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరిగింది. ప్రభుత్వాలు సైతం ఈ దిశగా రాయితీలు అందించడంతో పాటు పర్యావరణానికి మేలు చేస్తాయని ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారు. పెట్రోల్, డీజిల్  ధరల పెరుగుదలతో తక్కువ ఖర్చుతో, నెలవారీ బడ్జెట్ దెబ్బతినకుండా ఈవీల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇంటి వద్దే ఛార్జింగ్ చేసుకుంటూ, రోజువారీ వినియోగానికి సైతం మెరుగ్గా ఉండే ఎలక్ట్రిక్ కార్ల కోసం చూస్తున్నారు. 

వియత్నాంకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) తన సరికొత్త, చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ VF 3ని భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి రెడీగా ఉంది. ఇది దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఒకటిగా నిలవనుంది. ఎందుకంటే దీని ధర రూ. 10 లక్షల కంటే తక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. 

విన్‌ఫాస్ట్ VF 3ని ప్రత్యేకంగా సిటీ రోడ్లపై నడపడానికి వీలుగా డిజైన్ చేశారు. దీని పరిమాణం కాంపాక్ట్‌గా ఉండటం వల్ల రద్దీగా ఉండే రోడ్లపై, ఇరుకైన పార్కింగ్ స్థలాలలో సైతం ఈ కారును సులభంగా నడపవచ్చు. యువత, మొదటిసారి ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని విన్‌ఫాస్ట్ కంపెనీ దీనిని రూపొందించింది.

Also Read: Bajaj Upcoming Dual Sport Motorcycle: బజాజ్ నుంచి సరికొత్త డ్యుయల్ స్పోర్ట్ మోటార్ సైకిల్: లీకైన టెస్ట్ మ్యూల్ పిక్చర్స్.. అదిరిపోయే ఫీచర్లు

ఈ ఎలక్ట్రిక్ కారు రేంజ్ ఎంత
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ VinFast VF3 సింగిల్ ఛార్జ్‌పై సుమారు 215 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. పెద్ద బ్యాటరీ ఆప్షన్ ఉంటే కనుక మరింత రేంజ్ వచ్చే అవకాశం ఉంది. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు లేదా సిటీలో డైలీ బిజినెస్ పనుల మీద తిరగడానికి ఈ రేంజ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ కారులో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా అందిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనివల్ల బ్యాటరీ తక్కువ సమయంలోనే ఛార్జ్ అయి, మీరు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ తమ కారును ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

వీఎఫ్3 ఎస్‌యూవీ డిజైన్ 
VF 3 డిజైన్ విషయానికి వస్తే లుక్ బాక్సీగా, పక్కా ఎస్‌యూవీలా ఉంటుంది. సైజ్ కాస్త చిన్నదైనప్పటికీ, ఇది ఎంతో దృఢంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని ఫ్రంట్, రియర్ భాగాల్లో మోడ్రన్ స్టైలింగ్ ఇవ్వడం వల్ల ఇది యంగ్ జనరేషన్‌ను బాగా ఆకట్టుకోగలదు.

Read Also: Most Selling Electric Cars: మే నెలలో ఎలక్ట్రిక్ కార్లు రికార్డ్ సేల్స్ చేసిన టాప్ 5 కంపెనీలు ఇవే

భారత మార్కెట్లో ఈ కారు బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లతో పోటీ పడనుంది. కంపెనీ దీని ధరను రూ. 10 లక్షల కంటే తక్కువలో ఉంచితే, ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఇది బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం ఈ ధర పరిధిలో మార్కెట్లో చాలా తక్కువ ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. కనుక VF 3కి మార్కెట్లో మంచి రెస్పాన్స్ లభిస్తుందని, ఒకవేళ విన్‌ఫాస్ట్ తన ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తక్కువ ధరకే లాంచ్ చేస్తే, గేమ్ ఛేంజర్‌గా మార్కెట్లో ఒక పెద్ద మార్పును తీసుకురాగలదు.

టాటా టియాగో ఈవీ (Tata Tiago EV)
భారత్‌లో ప్రస్తుతానికి అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లలో టాటా టియాగో ఈవీ మొదట ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 8 లక్షలు ఉంటుంది. విన్‌ఫాస్ట్ VF 3 నేరుగా టాటా టియాగో ఈవీ మార్కెట్‌ను దెబ్బతీసే ఛాన్స్ ఉంది. 

ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV)
సిటీ రోడ్లపై సులభంగా తిరగడానికి వీలుగా ఉండే టూ-డోర్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్. దీని ధర దాదాపు రూ. 7 లక్షలకు ప్రారంభమవుతుంది. విన్‌ఫాస్ట్ VF 3 కాంపాక్ట్ సైజులో బాక్సీ లుక్‌తో వస్తుండటంతో దీనికి గట్టి పోటీ ఇస్తుంది. 

టాటా పంచ్ ఈవీ (Tata Punch EV)
లుక్ పరంగా చూస్తే విన్‌ఫాస్ట్ VF 3 చిన్న ఎస్‌యూవీ లాగా ఉంటుంది. దాంతో మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో దూసుకుపోతున్న టాటా పంచ్ ఈవీ ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు బేస్ మోడల్ కొనుగోలుదారులను ఆకర్షించగలదు.

Frequently Asked Questions

భారత మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ (VinFast) ఏ కొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తోంది?

విన్‌ఫాస్ట్ తన సరికొత్త, చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ VF 3ని భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఒకటిగా నిలవనుంది.

విన్‌ఫాస్ట్ VF 3 ధర ఎంత ఉండవచ్చు?

విన్‌ఫాస్ట్ VF 3 ధర రూ. 10 లక్షల కంటే తక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. దీనివల్ల ఇది బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు కొనుగోలుదారులకు మంచి ఆప్షన్ అవుతుంది.

విన్‌ఫాస్ట్ VF 3 ఒకే ఛార్జింగ్‌తో ఎంత దూరం ప్రయాణిస్తుంది?

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ VinFast VF 3 సింగిల్ ఛార్జ్‌పై సుమారు 215 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. పెద్ద బ్యాటరీ ఆప్షన్‌తో మరింత రేంజ్‌ను ఆశించవచ్చు.

విన్‌ఫాస్ట్ VF 3 ఏ రకమైన వినియోగదారులకు ఉపయోగపడుతుంది?

విన్‌ఫాస్ట్ VF 3ని ప్రత్యేకంగా సిటీ రోడ్లపై నడపడానికి వీలుగా డిజైన్ చేశారు. యువత, మొదటిసారి ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి, రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget