అన్వేషించండి

గుర్రం స్పూర్తితో వెస్పా స్కూటర్‌ - Vespa 946 Horse ఎడిషన్‌ విడుదల, కేవలం కొన్ని యూనిట్లే తయారీ!

2026 ‘ఇయర్‌ ఆఫ్‌ ది హార్స్‌’ సందర్భంగా, Vespa 946 Horse ఎడిషన్‌ స్కూటర్‌ను విడుదల చేసింది. ప్రత్యేక డిజైన్‌, లెదర్‌ ఫినిష్‌, లిమిటెడ్‌ యూనిట్లతో ఈ స్కూటర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Vespa 946 Horse Edition Price And Specifications: ఇటాలియన్‌ స్కూటర్‌ బ్రాండ్‌ Vespa మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. 2026ను ‘ఇయర్‌ ఆఫ్‌ ది హార్స్‌’గా గుర్తిస్తూ, Vespa తాజాగా Vespa 946 Horse Edition స్కూటర్‌ను అధికారికంగా రివీల్‌ చేసింది. ఈ స్కూటర్‌ కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు... గుర్రం శక్తి, గౌరవం, ధృడత్వాన్ని ప్రతిబింబించేలా డిజైన్‌ చేసిన ఓ కళాఖండంలా కనిపిస్తోంది.

వెస్పా గతంలో కూడా తన Lunar Collectionలో భాగంగా డ్రాగన్‌, స్నేక్‌ వంటి జోడియాక్‌ సింబల్స్‌ ఆధారంగా ప్రత్యేక ఎడిషన్‌ మోడళ్లను విడుదల చేసింది. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, 2026కు ప్రతీకగా గుర్రాన్ని ఎంచుకుంది. వెస్పా చెప్పినట్టుగా, గుర్రం అంటే రాజసం, చురుకుదనం, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే శక్తికి చిహ్నం. అదే భావాన్ని ఈ 946 Horse ఎడిషన్‌లో చూపించారు.

గుర్రం రంగులో డిజైన్‌

Vespa 946 Horse ఎడిషన్‌ ప్రత్యేకత దాని బే కలర్‌ బాడీ. ఇది గాఢమైన గోధుమ రంగులో ఉంటుంది. గుర్రాల్లో కనిపించే మెరిసే నలుపు-గోధుమ మిశ్రమాన్ని గుర్తు చేసేలా ఈ రంగును ఎంపిక చేశామని వెస్పా తెలిపింది. ఈ స్కూటర్‌లో స్టీల్‌ బాడీ వెస్పాకు ట్రేడ్‌మార్క్‌ కాగా, గ్లాస్‌ & మ్యాట్‌ ఫినిష్‌ల కలయిక కూడా కనిపిస్తుంది. ఈ స్కూటర్‌లోని చిన్న విషయాలు కూడా హార్స్‌ థీమ్‌ను బలంగా ప్రతిబింబిస్తాయి.

సీటు నుంచి మిర్రర్‌ వరకూ లెదర్‌ టచ్‌

Vespa 946 Horse ఎడిషన్‌లోని హ్యాండ్‌క్రాఫ్టెడ్‌ లెదర్‌ సీటు గుర్రాల సాడిల్‌ నుంచి ప్రేరణతో డిజైన్‌ చేశారు. సీటు కింద భాగంలో గుర్రపు నాడా ఆకారంలో ఉన్న డిజైన్‌పై ‘V’ మోనోగ్రామ్‌ ముద్రించారు. అంతేకాదు, హ్యాండిల్‌బార్‌, రియర్‌వ్యూ మిర్రర్స్‌పై కూడా ప్రీమియం లెదర్‌ ట్రిమ్‌ ఇవ్వడం విశేషం. ఇవన్నీ కలిపి చూస్తే, స్కూటర్‌ మొత్తం ఒక ఎలిగెంట్‌ హార్స్‌ థీమ్‌లో కనిపిస్తుంది.

ప్రత్యేక యాక్సెసరీలు

Vespa 946 Horse ఎడిషన్‌తో పాటు కొన్ని స్పెషల్‌ యాక్సెసరీలు కూడా అందుబాటులో ఉన్నాయి. సీటులో వాడిన అదే లెదర్‌తో తయారు చేసిన చిన్న రియర్‌ బ్యాగ్‌, లైట్‌ స్మోక్‌డ్‌ చిన్న విండ్‌షీల్డ్‌, అలాగే కలర్‌ మ్యాచ్‌ అయ్యే త్రీ క్వార్టర్‌ హెల్మెట్‌ ఇవ్వనున్నారు. ఈ హెల్మెట్‌పై 3D గోల్డ్‌ ‘V’ లోగో ఉండటం మరో ఆకర్షణ.

లిమిటెడ్‌ ఎడిషన్‌ స్పెషల్‌

వెస్పా ఈ 946 Horse ఎడిషన్‌ను చాలా కొన్ని యూనిట్లలోనే తయారు చేయనుంది. అయితే ఎన్ని స్కూటర్లు తయారు చేస్తారో కంపెనీ వెల్లడించలేదు. గతంలో Vespa 946 Dragon ఎడిషన్‌ను కేవలం 1,888 యూనిట్లకే పరిమితం చేసింది. ఈసారి కూడా అలాగే చాలా తక్కువ సంఖ్యలోనే తయారు చేసే అవకాశం ఉంది.

బుకింగ్స్‌ వివరాలు

Vespa 946 Horse ఎడిషన్‌ స్కూటర్‌ బుకింగ్స్‌ ఇప్పటికే వెస్పా అధికారిక వెబ్‌సైట్‌లో ఓపెన్‌ అయ్యాయి. ఈ ప్రత్యేక స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు తమకు దగ్గరలో ఉన్న అధీకృత వెస్పా డీలర్‌ను సంప్రదించాలని కంపెనీ సూచించింది.

Vespa 946 Horse ఎడిషన్‌ స్కూటర్‌ సాధారణ వినియోగదారుల కోసం కాదు. ఇది స్టైల్‌, లగ్జరీ, ప్రత్యేకత కోరుకునే వారి కోసం రూపొందించిన కలెక్టబుల్‌ మోడల్‌. 2026 ‘ఇయర్‌ ఆఫ్‌ ది హార్స్‌’ను గుర్తుండిపోయేలా చేసేందుకు వెస్పా తీసుకొచ్చిన ఈ స్కూటర్‌ ఖచ్చితంగా అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget