Upcoming MPV Launch in India: ఫ్యామిలీల కోసం పెద్ద ఎలక్ట్రిక్ కార్లు కావాలనుకుంటున్నారా? - త్వరలో మూడు ఈవీ ఎంపీవీలు లాంచ్!
MG Electric MPV: మనదేశంలో రానున్న కాలం మూడు మంచి ఎలక్ట్రిక్ ఎంపీవీ కార్లు లాంచ్ కానున్నాయి.
MPV Launch in India: ఎలక్ట్రిక్ కార్లను ఇష్టపడే వారు వాహనంలో సౌకర్యాన్ని కోరుకుంటారు. ఫ్యామిలీకి సౌకర్యంగా ఉండాలంటే కారు పెద్దగా ఉండాల్సిందే. ఫ్యామిలీలో ఎక్కువ మంది సభ్యులు ఉన్న వ్యక్తులు కారు కొనుగోలు చేసేటప్పుడు ఎంపీవీ కోసం చూస్తారు. మీరు కూడా పెద్ద ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే భారతదేశంలో త్వరలో విడుదల కానున్న మూడు ఎంపీవీల (మల్టీ పర్పస్ వెహికల్స్) గురించి తెలుసుకుందాం.
ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్
దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ దృష్ట్యా అనేక కంపెనీలు ఈ విభాగంలో కార్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో దేశంలో టాటా ఎక్కువ పట్టును కలిగి ఉంది. ఇప్పుడు ఇతర కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో భారతీయ మార్కెట్లో తమ పరిధిని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎంజీ మోటార్, మారుతీ సుజుకీ, టయోటా వంటి పెద్ద కంపెనీల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు రానున్న కాలంలో భారతీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ఎంపీవీలను విడుదల చేయబోతున్నాయి.
ఎంజీ ఎలక్ట్రిక్ ఎంపీవీ (MG Electric MPV)
ఇటీవల జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో ఎంజీ మోటార్ టై అప్ వార్తలు వెలుగులోకి వచ్చాయి. చాలా మీడియా నివేదికల ప్రకారం ఈ రెండు కంపెనీలు కలిసి 2026 సంవత్సరం నుంచి భారతీయ మార్కెట్లో అనేక మోడళ్లను విడుదల చేయాలని ఆలోచిస్తున్నాయి. ఈ మోడళ్లలో రెండు ఎలక్ట్రిక్ కార్లను కూడా చేర్చవచ్చు.
మారుతి సుజుకి వైఎంసీ (Maruti Suzuki YMC)
మారుతి సుజుకీ భారత మార్కెట్లో ఇంకా ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలోకి అడుగుపెట్టలేదు. కంపెనీ తన మొదటి ఈవీ మారుతి సుజుకి ఈవీఎక్స్‌ని 2025 ప్రారంభంలో లాంచ్ చేసే అవకాశం ఉంది. 2026 సంవత్సరంలో మారుతి తన మొదటి ఎంపీవీని కూడా మార్కెట్లోకి తీసుకురాగలదని వార్తలు వస్తున్నాయి.
టయోటా ఎలక్ట్రిక్ ఎంపీవీ (Toyota EV MPV)
ఏప్రిల్ నెల ప్రారంభంలో టయోటా... మారుతి ఫ్రాంక్స్ ఆధారంగా ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. ఈ జపనీస్ కార్ల కంపెనీ 2025లో మిడ్ సైజ్ ఈవీని భారత మార్కెట్లోకి తీసుకురావచ్చని వార్తలు వస్తున్నాయి. అలాగే మారుతి సుజుకి వైఎంసీ ఎలక్ట్రిక్ కారు కూడా 2026 సంవత్సరంలో మార్కెట్లోకి రావచ్చు.
మరోవైపు భారత దేశ వాహన తయారీ కంపెనీలు టాటా మోటార్స్, మహీంద్రా రాబోయే కొద్ది సంవత్సరాలలో అనేక కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను రూపొందించి మార్కెట్లోకి తీసుకురానుంది. టాటా ప్రస్తుత ప్లానింగ్ గురించి చెప్పాలంటే త్వరలో టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కూపే ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. 2024 జూన్ నాటికి మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఈవీ కూడా మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. పంచ్.ఈవీని రూపొందించిన యాక్టీ.ఈవీ ప్లాట్‌ఫారమ్‌పైనే టాటా కర్వ్ ఈవీని కూడా కంపెనీ తయారు చేయనుంది. టాటా తీసుకొస్తున్న ఈ కొత్త ఆర్కిటెక్చర్ అన్ని రకాల వాహనాల సైజులు, డ్రైవ్‌ట్రెయిన్ సెటప్‌లను (ఎఫ్‌డబ్ల్యూడీ, ఆర్‌డబ్ల్యూడీ, ఏడబ్ల్యూడీ) సపోర్ట్ చేస్తుంది.