Toyota Urban Cruiser Hyryder: టొయోటా హైరైడర్ వచ్చేసింది - టాప్ క్లాస్ ఫీచర్లతో - కారు మామూలుగా లేదుగా!

టొయోటా కొత్త కారు అర్బన్ క్రూజర్ హైరైడర్ మనదేశంలో లాంచ్ అయింది.

FOLLOW US: 

టొయోటా మనదేశంలో కొత్త అర్బన్ క్రూజర్‌ను లాంచ్ చేసింది. అదే టొయోటా హైరైడర్. ఇది ఒక సెల్ఫ్ చార్జింగ్ ఎలక్ట్రిక్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టం ఉన్న కారు. ఈ విభాగంలో లాంచ్ అయిన మొదటి పూర్తిస్థాయి హైబ్రిడ్ కారు ఇదే. ఇందులో 1.5 లీటర్ కే-సిరీస్ ఇంజిన్‌ను అందించారు. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ కూడా ఇందులో ఉంది. ఈ ఇంజిన్ పవర్ అవుట్‌పుట్ 100 హెచ్‌పీ కాగా, పీక్ టార్క్ 135 ఎన్ఎంగా ఉంది. ఇంజిన్, హైబ్రిడ్ మోటార్ పవర్‌ను కలిపినపుడు దీని పవర్ అవుట్‌పుట్ 113 హెచ్‌పీగా ఉండనుంది.

ఈ విభాగంలో ఆల్ వీల్ డ్రైవ్ ఫీచర్ ఉన్న మొదటి కారు అర్బన్ క్రూజర్ హైరైడరే. ఇందులో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు ఉన్నాయి. ఇదే హైబ్రిడ్ టెక్నాలజీ టొయోటా హైఎండ్ ఉత్పత్తులు కామీ, వెల్‌ఫైర్‌ల్లో కూడా ఉంది.

ఇక మైలేజ్ విషయానికి వస్తే... ఈ అర్బన్ క్రూజర్ హైరైడర్ 40 నుంచి 50 శాతం ఇంప్రూవ్ అయింది. అయితే దీని మైలేజ్ నంబర్లను కంపెనీ ఇంకా విడుదల చేయలేదు. 27 శాతం తక్కువగా కర్బన ఉద్గారాలను ఈ కారు విడుదల చేయనుంది. 

యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ చార్జర్, తొమ్మిది అంగుళాల ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం, వెంటిలేటెడ్ డ్యూయల్ టోన్ సీట్ల వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, డీసెంట్, ఆల్ వీల్ డిస్కులు వంటి సేఫ్టీ ఫీచర్లను టొయోటా ఇందులో అందించింది.

ఏడు మోనోటోన్ కలర్ ఆప్షన్లు, నాలుగు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో ఈ కారును కొనుగోలు చేయవచ్చు. టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ దీని బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. రూ.25 వేలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. దీని ధర రూ.10 లక్షల రేంజ్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Published at : 01 Jul 2022 03:18 PM (IST) Tags: Toyota Urban Cruiser Hyryder Price Toyota Urban Cruiser Hyryder Toyota Urban Cruiser Hyryder SUV Toyota Urban Cruiser Hyryder SUV Features Toyota Hyryder Toyota Hyryder SUV

సంబంధిత కథనాలు

ఎలక్ట్రిక్ కార్లకు వర్షంలో చార్జింగ్ పెట్టవచ్చా?

ఎలక్ట్రిక్ కార్లకు వర్షంలో చార్జింగ్ పెట్టవచ్చా?

Royal Enfield Hunter 350: రూ.లక్షన్నర లోపే కొత్త ఎన్‌ఫీల్డ్ బైక్ - 350 సీసీ ఇంజిన్ కూడా!

Royal Enfield Hunter 350: రూ.లక్షన్నర లోపే కొత్త ఎన్‌ఫీల్డ్ బైక్ - 350 సీసీ ఇంజిన్ కూడా!

Electric Vehicles: వర్షాల్లోనూ ఈవీలు నడపొచ్చు, బ్యాటరీతో ఏ సమస్యా ఉండదంటున్న నిపుణులు

Electric Vehicles: వర్షాల్లోనూ ఈవీలు నడపొచ్చు, బ్యాటరీతో ఏ సమస్యా ఉండదంటున్న నిపుణులు

Mahindra Eletric SUVs: ఒకేసారి ఐదు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు - మహీంద్రా ప్లాన్ మామూలుగా లేదుగా!

Mahindra Eletric SUVs: ఒకేసారి ఐదు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు - మహీంద్రా ప్లాన్ మామూలుగా లేదుగా!

Maruti Suzuki Grand Vitara: మారుతి సుజుకి గ్రాండ్ విటారా మాన్యువల్ ఎలా ఉందంటే?

Maruti Suzuki Grand Vitara: మారుతి సుజుకి గ్రాండ్ విటారా మాన్యువల్ ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్