అన్వేషించండి

టయోటా ఈబెల్లా రివ్యూ: ఈ కారు పేరుకు అర్ధమేంటి? MG, టాటా, హ్యుందాయ్‌కి గట్టి పోటీ ఇవ్వగలదా?

టయోటా ఈబెల్లా ఎలక్ట్రిక్ SUV భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. డిజైన్, రేంజ్, ఫీచర్లు, పనితీరు ఎలా ఉన్నాయి? MG, టాటా, హ్యుందాయ్ మోడళ్లతో పోలిస్తే ఎలా నిలుస్తుంది?.

Toyota Ebella Review In Telugu: ఎట్టకేలకు, టయోటా కంపెనీ కూడా భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి అడుగుపెట్టింది, ఈ సెగ్మెంట్‌ లోటును పూడ్చుకుంది. అర్బన్ క్రూజర్ ఈబెల్లా పేరుతో వచ్చిన ఈ మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ SUVని సుజుకితో కలిసి అభివృద్ధి చేసింది. రెండు బ్యాటరీ ఆప్షన్లతో - 49kWh & 61kWh - ఈ ఎలక్ట్రిక్‌ కారు అందుబాటులో ఉంటుంది. ముందుభాగంలో సింగిల్ మోటర్ సెటప్ ఇచ్చారు.

డిజైన్ ఎలా ఉంది?

ఈబెల్లా పేరులోని ఇ అంటే ఎలక్ట్రిక్‌ & బెల్లా అంటే అందం అని అర్థం. ముందు భాగంలో స్మైలింగ్ హెడ్‌ల్యాంప్స్‌, డాటెడ్ DRLs కొంతమందికి నచ్చవచ్చు, మరికొంతమందికి నచ్చకపోవచ్చు. మొత్తం లుక్ మాత్రం బలంగా, SUV తరహాలో ఉండేలా కనిపిస్తుంది. 18 అంగుళాల అలాయ్ వీల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి.

4,285mm పొడవు, 1,800mm వెడల్పు, 1,640mm ఎత్తుతో ఇది ఈ సెగ్మెంట్‌లో సరైన కొలతలతో వస్తుంది. 2,700mm వీల్‌బేస్ వల్ల లోపల మంచి స్థలం ఉంటుందని అనిపించినా, గ్రౌండ్ క్లియరెన్స్ 184mm మాత్రమే ఉండటం గమనించాల్సిన విషయం.

లోపల కంఫర్ట్ ఎలా ఉంది?

కేబిన్ లోపలికి వెళ్లగానే ప్రీమియం ఫీలింగ్ వస్తుంది. బ్రౌన్ & బ్లాక్ డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ ఆకట్టుకుంటుంది. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ & డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఒకే ప్యానెల్‌లో కనిపిస్తాయి.

క్లైమేట్ కంట్రోల్‌కు ఫిజికల్ బటన్లు ఉండటం మంచి విషయం. అయితే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రిస్పాన్స్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది. వెంటిలేటెడ్ సీట్లు ఆన్ చేయాలంటే నాలుగు స్టెప్స్ పూర్తి చేయాలి.

ముందు సీట్లు 10-వే పవర్డ్ అడ్జస్ట్‌మెంట్‌తో వస్తాయి. కానీ బ్యాటరీ కారణంగా ఫ్లోర్ ఎత్తుగా ఉండటంతో మోకాళ్లు పైకి మడిచినట్లు కూర్చోవాల్సి వస్తుంది. వెనుక సీట్లలో కూడా అదే పరిస్థితి. మధ్యలో హంప్ ఉండటం మూడో ప్రయాణికుడికి అసౌకర్యం కలిగిస్తుంది.

బూట్ స్పేస్ 306 లీటర్లు మాత్రమే. ఈ సెగ్మెంట్‌లో ఇది కొంచెం తక్కువే. అయితే మూడు కేబిన్ బ్యాగులు సర్దుకునే స్థలం ఉంది.

ఫీచర్లు & సేఫ్టీ

టాప్ వేరియంట్‌లో 18 అంగుళాల వీల్స్‌, గ్లాస్ రూఫ్‌, వెంటిలేటెడ్ సీట్లు, JBL ఆడియో సిస్టమ్‌, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, ఏడు ఎయిర్‌బ్యాగ్స్‌, లెవల్ 2 ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి.

కానీ ప్యానోరమిక్ సన్‌రూఫ్‌, రియర్ సన్‌షేడ్స్‌, పవర్డ్ టెయిల్‌గేట్‌, సింగిల్ పెడల్ డ్రైవింగ్ వంటి ఫీచర్లు లేవు.

పనితీరు & రేంజ్

49kWh బ్యాటరీలో 144hp, 61kWh బ్యాటరీలో 174hp శక్తి లభిస్తుంది. టార్క్ 193Nm. 0 నుంచి 100 kmph వేగం 9.25 సెకన్లలో చేరుతుంది. గరిష్ట వేగం 160 kmph.

రేంజ్ విషయానికి వస్తే, చిన్న బ్యాటరీతో 440km, పెద్ద బ్యాటరీతో 543km క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ వరల్డ్‌లో సుమారు 370km వరకు అందొచ్చని అంచనా.

రైడ్ క్వాలిటీ ఎలా ఉంది?

తక్కువ స్పీడ్‌లో గుంతలు, స్పీడ్ బ్రేకర్లపై కొంచెం కఠినంగా అనిపిస్తుంది. హైవే వేగంలో వెనుక భాగం గాల్లో తేలుతున్నట్లు అనిపిస్తుంది. స్టీరింగ్ లైట్‌గా ఉండటం నగర ట్రాఫిక్‌లో ఉపయోగకరం. 5.2 మీటర్ల టర్నింగ్ రేడియస్ వల్ల హైదరాబాద్, విజయవాడ వంటి తెలుగు నగరాల్లో డ్రైవింగ్ సులభంగా ఉంటుంది.

ధర 

టయోటా ఇంకా అధికారిక ఎక్స్‌-షోరూమ్‌ ధరను ప్రకటించలేదు. పోటీ ధరను నిర్ణయిస్తే మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ, మూడు సంవత్సరాల తర్వాత 60 శాతం బైబ్యాక్ హామీ వంటి ఆఫర్లు ఆకర్షణీయంగా ఉన్నాయి.

మొత్తానికి, ఈబెల్లాలో కొన్ని లోపాలు ఉన్నా, టయోటా బ్రాండ్ విశ్వసనీయత, స్మూత్ పవర్ డెలివరీ, ప్రీమియం ఇంటీరియర్ దీని బలాలు. సరైన ధరతో వస్తే, ఈ ఎలక్ట్రిక్ SUV మార్కెట్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించగలదు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget