Tata Upcoming Concept Cars: ఈ టాటా కాన్సెప్ట్ కార్లు వచ్చేది ఎప్పుడో - యూజర్లు పిచ్చ వెయిటింగ్!
Tata Concept Cars: టాటా గతంలో ప్రదర్శించిన కొన్ని కాన్సెప్ట్ కార్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. వీటి కోసం ప్రజలు ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
![Tata Upcoming Concept Cars: ఈ టాటా కాన్సెప్ట్ కార్లు వచ్చేది ఎప్పుడో - యూజర్లు పిచ్చ వెయిటింగ్! Tata Upcoming Concept Cars In India eVision Nano Pixel Sierra Avinya Tata Upcoming Concept Cars: ఈ టాటా కాన్సెప్ట్ కార్లు వచ్చేది ఎప్పుడో - యూజర్లు పిచ్చ వెయిటింగ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/04/e7224c23241c5dea0dcfdd14582c1053_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tata Concept Cars In India: టాటా మోటార్స్ భారతదేశంలో మూడో అతిపెద్ద ఆటో కంపెనీ. ఈ భారతీయ వాహన తయారీ సంస్థ గొప్ప ఫీచర్లతో వచ్చే సేఫెస్ట్ కార్లు ఎక్కువగా లాంచ్ చేస్తుంది. అయితే టాటా అనేక కాన్సెప్ట్ కార్లను కూడా తయారు చేసిందని మీకు తెలుసా? ఈ రోజు మనం నాలుగు టాటా కాన్సెప్ట్ కార్ల గురించి మాట్లాడుతాము.
టాటా ఈవిజన్ (Tata eVision)
టాటా ఈవిజన్ అనేది 2018 జెనీవా మోటార్ షోలో ప్రదర్శించిన కాన్సెప్ట్ సెడాన్. ఈ కారును ఇంపాక్ట్ డిజైన్ లాంగ్వేజ్‌తో నిర్మించారు. ఈ కారు మంచి లైన్‌లతో కొత్త రూపాన్ని పొందింది. ఈవిజన్ స్పోర్టీ 22 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, బ్రష్డ్ అల్యూమినియం యాక్సెంట్‌లు, మరిన్ని ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు లగ్జరీ క్యాబిన్‌లో నేచురల్ వుడ్, లెదర్ వంటి ప్రీమియం వస్తువులను ఉపయోగించారు. ఇందులో పాప్ అవుట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మినిమల్ బటన్‌లు, ఫ్లాట్ ఫ్లోర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు ఉన్నాయి.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
టాటా నానో పిక్సెల్ (Tata Nano Pixel)
టాటా నానో పిక్సెల్ కాన్సెప్ట్ కారును 2011 జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో ఆవిష్కరించారు. ఈ రెండు డోర్ల హ్యాచ్‌బ్యాక్ కారు చిన్న డైమెన్షన్‌లలో వచ్చింది. చాలా వేగవంతమైన టర్నింగ్ సైకిల్‌ను ఇది కలిగి ఉంది. ఇది సిటీ డ్రైవింగ్‌కు మంచి ఆప్షన్. ఇందులో స్వివెల్ డోర్లు, రేర్ మౌంటెడ్ ఇంజిన్‌తో నలుగురు వ్యక్తుల కోసం సీటింగ్ ఏర్పాటును కలిగి ఉంది. కానీ కొత్త భద్రతా ప్రమాణాలు, నేవిగేషన్ కారణంగా, నానో పిక్సెల్ మార్కెట్లోకి రాలేదు.
టాటా సియర్రా (Tata Sierra)
టాటా సియర్రాను ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించారు. టాటా మోటార్స్ పాత సియెర్రాను కొత్త అవతార్‌లో తిరిగి ప్రారంభించాలని యోచిస్తోంది. కొత్త సియెర్రా పొడవు 4.3 మీటర్లుగా ఉంది. ఈ కారు 4, 5, 6 సీటర్ కాన్ఫిగరేషన్‌లలో చూడవచ్చు. ఇది మిగిలిన టాటా ఎస్‌యూవీల తరహాలోనే కొత్త, మెరుగైన డిజైన్‌ను పొందవచ్చు.
టాటా సియర్రా పెట్రోల్ వేరియంట్ త్వరలో విడుదల కానుందని భావిస్తున్నారు. దీని తరువాత ఈ కారు ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా లాంచ్ కానుంది. సియర్రా పెట్రోల్ వేరియంట్ టెస్ట్ మోడల్ త్వరలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
టాటా అవిన్య (Tata Avinya)
2022లో టాటా మోటార్స్ టాటా అవిన్య కాన్సెప్ట్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇది టాటా ఫ్యూచర్ ఈవీల గురించి కంప్లీట్ పిక్చర్ ఇచ్చింది. అవిన్యలో ఎలాంటి ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉండదు. కానీ అన్ని పనులు చూసుకునే గొప్ప వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. కారును నియంత్రించడానికి కారు డాష్‌బోర్డ్‌పై సన్నని డిస్‌ప్లే అందించారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు సంబంధించిన ఈఎంఏ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా అవిన్య మొదటి మోడల్ 2026లో లాంచ్ కానుందని భావిస్తున్నారు.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)