అన్వేషించండి

Tata Sierra Modified: ల్యాండ్ రోవర్ డిఫెండర్‌లా స్టైల్లో టాటా సియెర్రా కారు... లుక్ అదిరిపోయింది కానీ.. మోడిఫికేష‌న్ తో ఈ తిప్పలు తప్పవు!

టాటా సియెర్రా ఎస్‌యూవీని ల్యాండ్ రోవర్ డిఫెండర్‌లా కనిపించేలా ఒక ఓనర్ చేసిన మోడిఫికేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tata Sierra Tailgate Spare Wheel Modification Viral:  ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా సియెర్రా ఎస్‌యూవీ తన ఐకానిక్ స్టైలింగ్‌తో ఎంతో పాపులర్ అయింది. అయితే ఈ కారు బాక్సీ డిజైన్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ లగ్జరీ ఎస్‌యూవీని పోలి ఉండటంతో చాలా మంది వాహనదారులు దీనిని డిఫెండర్‌లా మార్చడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో షేర్ అయిన ఒక వీడియోలో టాటా సియెర్రా ఓనర్ తన కారును ల్యాండ్ రోవర్ డిఫెండర్ లుక్ వచ్చేలా మోడిఫై చేశాడు. కారు వెనుక వైపు టెయిల్‌గేట్‌పై స్పేర్ వీల్‌ను మౌంట్ చేయడం ఈ మోడిఫికేషన్ స్పెషాలిటీ. ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారుకు వెనుక వైపు ఇలాగే టైర్ ఉండటం వల్ల ఈ చిన్న మార్పుతో సియెర్రా కారుకు లగ్జరీ, రగ్గడ్ ఆఫ్-రోడ్ లుక్ వచ్చింది. సాధారణంగా కంపెనీ ఇచ్చే స్టాక్ మోడల్లో స్పేర్ వీల్ కారు బాడీ కింద అమర్చి ఉంటుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gaurav Dagar (@gaurav___dagar)

Read Also: National Highways News: నేషనల్ హైవేలపై రాత్రి పూట లైట్లు ఎందుకు ఉండవు.. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ  క్లారిటీ ఇదే !

మోడిఫికేషన్ లోపాలు..
ఈ వీడియోను నిశితంగా గమనిస్తే ఓనర్ వెనుక గేటు మధ్యలో స్పేర్ వీల్‌ను అమర్చాడు. దీనివల్ల కారు వెనుక ఉండే విండ్‌స్క్రీన్, సియెర్రా బ్యాడ్జ్, కనెక్టెడ్ లైట్ బార్ సగం వరకు కవర్ అయిపోయాయి. ఈ మోడిఫికేషన్ కోసం ఓనర్ ఆఫ్టర్ మార్కెట్ వీల్స్ వాడకుండా కంపెనీ ఇచ్చిన స్టాక్ అలాయ్ వీల్‌నే ఉపయోగించాడు. చూడటానికి ఈ లుక్ చాలా బాగున్నప్పటికీ, దీనివల్ల కారుకు కొన్ని స్ట్రక్చరల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. టాటా సియెర్రా హయ్యర్ వేరియంట్లలో వెనుక డోర్ ఎలక్ట్రికల్‌గా ఓపెన్, క్లోజ్ అవుతుంది. ఈ స్పేర్ వీల్ బరువు వల్ల ఆ ఆటోమేటిక్ ఫంక్షన్ దెబ్బతినవచ్చు. పదే పదే వాడటం వల్ల హైడ్రాలిక్ స్ట్రట్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే టెయిల్‌గేట్ ప్యానెల్ అంత బరువును మోసేలా డిజైన్ చేయకపోవడం వల్ల ఆ గేట్ షేప్ అవుట్ అవ్వచ్చు. 

Read Also: Best 7 Seater Cars: మారుతి ఎర్టిగా నుండి అల్కాజార్ వరకు.. అధిక మైలేజీ ఇచ్చే బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే

ఇంజిన్ ఆప్షన్స్, ధర వివరాలు..
ఇండియన్ మార్కెట్లో టాటా సియెర్రా కారు ప్రారంభ ధర రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ ఎస్‌యూవీ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తోంది. ఇందులో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5 లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే మాన్యువల్ గేర్‌బాక్స్ (MT), 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, డిసిఎ (DCA) ఆప్షన్లను కస్టమర్ల కోసం టాటా మోటార్స్ అందుబాటులో ఉంచింది.

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Embed widget