అన్వేషించండి

National Highways News: నేషనల్ హైవేలపై రాత్రి పూట లైట్లు ఎందుకు ఉండవు.. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ  క్లారిటీ ఇదే !

జాతీయ రహదారుల పొడవునా లైట్లు ఉండాలనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని, నిర్దేశిత నిబంధనల ప్రకారమే లైటింగ్ ఇస్తామని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది.

NHAI Explains Rules For Highway Illumination: జాతీయ రహదారులపై (National Highways) ప్రయాణించే వాహనదారులు చాలా కాలంగా ఒకే ప్రశ్న అడుగుతున్నారు. హైవేల పొడవునా స్ట్రీట్ లైట్లు ఎందుకు పెట్టరని ప్రశ్నిస్తున్నారు. దీనిపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సోషల్ మీడియా వేదికగా ఒక అఫీషియల్ క్లారిటీ ఇచ్చింది. రోడ్ల పొడవునా నిరంతరాయంగా లైట్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన కేవలం ఒక అపోహ మాత్రమేనని, ఇది మన దేశ రోడ్డు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) నిర్దేశించిన సేఫ్టీ గైడ్‌లైన్స్ ప్రకారమే అవసరమైన చోట మాత్రమే లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.

Read Also: Best 7 Seater Cars: మారుతి ఎర్టిగా నుండి అల్కాజార్ వరకు.. అధిక మైలేజీ ఇచ్చే బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే

లైట్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు..
ఎన్‌హెచ్‌ఏఐ గైడ్‌లైన్స్ ప్రకారం, కేవలం యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉన్న ప్రాంతాలు, వెహికల్స్ మూవ్‌మెంట్ ఎక్కువగా ఉండే జోన్లలో మాత్రమే హై-క్వాలిటీ లైట్లను ఇన్‌స్టాల్ చేస్తారు. టోల్ ప్లాజాలు, ఇంటర్‌చేంజ్‌లు, రోడ్ జంక్షన్లు,  ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, జనాభా ఉండే పట్టణ ప్రాంతాలు లేదా సెమీ-అర్బన్ ఏరియాలు ,బస్ బేలు, ట్రక్ లే-బైలు , ఎక్కువ ట్రాఫిక్ ఉండే ప్రమాదకరమైన మలుపులు.. ఈ లొకేషన్లలో పెడెస్ట్రియన్ మూవ్‌మెంట్, క్లిష్టమైన రోడ్డు డిజైన్ ఉండటం వల్ల డ్రైవర్లకు స్పష్టమైన విజన్ ఇవ్వడం కోసం లైట్లు పెట్టడం తప్పనిసరి.

Read Also: Upcoming Electric Cars India 2026: టాటా సియెరా నుంచి మహీంద్రా థార్ వరకు రాబోయే టాప్ ఈవీలు ఇవే!   పూర్తి రోడ్ మ్యాప్‌ ఇదే!

హైవేల పొడవునా లైట్లు ఎందుకు పెట్టరు..?
వేల కిలోమీటర్ల పొడవు ఉండే నేషనల్ హైవేల నెట్‌వర్క్ అంతటా లైట్లు అమర్చడం అనేది ఎకనామికల్‌గా చాలా నష్టాన్ని కలిగిస్తుంది. దీనివల్ల పవర్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ప్రభుత్వానికి పెద్ద భారం అవుతుంది. పర్యావరణ పరంగా చూసినా ఇది కరెక్ట్ కాదు. ఈ ఎనర్జీ వేస్ట్‌ను అరికట్టడానికే ఎన్‌హెచ్‌ఏఐ ఈ డెసిషన్ తీసుకుంది. పైగా ఆధునిక హైవేలను డిజైన్ చేసేటప్పుడు లైట్లు లేని చోట్ల కూడా నైట్ డ్రైవింగ్ ఈజీగా సాగేలా స్పెషల్ ఫీచర్స్ యాడ్ చేస్తున్నారు. 

నైట్ డ్రైవింగ్ కోసం అడ్వాన్స్‌డ్ ఫీచర్స్
రోడ్లపై వెలుతురు లేకపోయినా డ్రైవర్లు దారి తప్పకుండా ఉండటానికి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వాడుతున్నారు. రోడ్ల మధ్యలో, పక్కన రేడియం రిఫ్లెక్టివ్ సైన్‌బోర్డులు, రోడ్డు మార్కింగ్స్, బ్లింకర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవి వాహనాల హెడ్‌లైట్ల వెలుతురు పడగానే స్పష్టంగా మెరుస్తాయి. దీనివల్ల చీకటిలో కూడా సేఫ్‌గా డ్రైవ్ చేయవచ్చు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, హైవే ప్లానింగ్ సిస్టమ్‌పై అవగాహన పెంచడానికే ఈ వివరణ ఇచ్చినట్లు అధికారులు చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Chairman Reservations: ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు అగ్రతాంబూలం
ఏపీలో 106 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకు అగ్రతాంబూలం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget