అన్వేషించండి

Tata Punch EV: టాటా పంచ్ ఈవీని లాంచ్ చేసిన కంపెనీ - ధర ఎంతగా నిర్ణయించారు?

Tata Punch EV Price: ప్రముఖ కార్ల కంపెనీ టాటా తన కొత్త పంచ్ ఈవీని మార్కెట్లో లాంచ్ చేసింది.

Tata Punch EV SUV: టాటా పంచ్ ఈవీ భారతదేశ మార్కెట్లో నేడు లాంచ్ అయింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 10.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. దాని టాప్ స్పెక్ వేరియంట్ ధరను రూ. 14.49 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించారు. దీంతో పాటు కంపెనీ తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డెలివరీని జనవరి 22వ తేదీ నుంచి ప్రారంభించనుంది. కస్టమర్లు స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+ అనే ఐదు వేరియంట్‌లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. రూ.21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి కారును బుక్ చేయవచ్చు.

టాటా పంచ్ ఈవీ డిజైన్
పంచ్ ఎలక్ట్రిక్ కొత్త లుక్ గురించి చెప్పాలంటే అప్‌డేట్ చేసిన ఫ్రంట్ ఫేషియా ఆకర్షణకు పెద్ద కారణం. ఇది కాకుండా నెక్సాన్ ఆధారంగా రూపొందించిన బోనెట్ వెడల్పుతో పాటు రన్నింగ్ ఎల్ఈడీ లైట్ బార్‌తో రిఫ్రెష్ చేసిన బంపర్, గ్రిల్ డిజైన్ కూడా ఉంది. దీని ప్రత్యేక ఫీచర్లు స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్. ఇది కాకుండా ఛార్జర్‌ను బ్రాండ్ లోగో కింద అందించిన మొదటి టాటా ఎలక్ట్రిక్ కారు పంచ్ ఈవీనే.

దీని వెనుక వైపు గురించి చెప్పాలంటే ఇది వై ఆకారంలో బ్రేక్ లైట్లను కలిగి ఉన్న ఐసీఈ వేరియంట్ వంటి టెయిల్ లైట్లను కలిగి ఉంది. దాని పైకప్పు మీద స్పాయిలర్ ఉంది. ఇందులో రీడిజైన్ చేసిన బంపర్ కూడా ఉంది. సైడ్ ప్రొఫైల్ గురించి చెప్పాలంటే ఇది కొత్త 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తో పాటు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను పొందుతుంది.

టాటా పంచ్ ఈవీ ఇంటీరియర్, ఫీచర్లు
క్యాబిన్ గురించి చెప్పాలంటే పంచ్ స్టైలిష్ డ్యూయల్ టోన్ థీమ్‌తో అప్‌గ్రేడ్ చేసిన ప్రీమియం అప్హోల్స్టరీని పొందుతుంది. ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో 2 స్పోక్ స్టీరింగ్ వీల్ (ఇది సఫారీ, హారియర్ వంటి కార్లలో ఉంది), 10.23 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్లు ఉన్నాయి. ఇతర ఫీచర్లలో వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, సన్‌రూఫ్ ఉన్నాయి. అంటే ఇంటీరియర్ ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్‌ను పోలి ఉంటుందన్న మాట.

టాటా పంచ్ ఈవీ బ్యాటరీ, రేంజ్
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ఆప్షన్లతో లాంచ్ అయింది. ఇందులో మొదటిది 25 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు. రెండోది 35 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్. ఇది ఏకంగా 421 కిలోమీటర్ల అద్భుతమైన  రేంజ్‌ను అందించనుందని కంపెనీ తెలిపింది.

టాటా పంచ్ ఈవీ రెండు ఈ-డ్రైవ్ ఆప్షన్లతో వస్తుంది. ఒక వేరియంట్ 120 బీహెచ్‌పీ పవర్, 190 ఎన్ఎం టార్క్‌ను, మరో వేరియంట్ 80 బీహెచ్‌పీ, 114 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. ఇది పర్మినెంట్ మాగ్నెట్ నాన్ సింక్రోనస్ మోటార్.

టాటా పంచ్ ఈవీ సేఫ్టీ ఫీచర్లు
సెక్యూరిటీ పరంగా చూస్తే అన్ని వేరియంట్‌ల్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్, రోల్ ఓవర్ మిటిగేషన్, బ్రేక్ డిస్క్ వైపింగ్, హైడ్రాలిక్ ఫేడింగ్ కాంపన్సేషన్ వంటివి కూడా ఉన్నాయి. ఇది కాకుండా 360 డిగ్రీ కెమెరా కూడా ఈ కారులో ఉంది. ఇది టాప్ స్పెక్ ట్రిమ్‌కు మాత్రమే ప్రత్యేకమైనది.

Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండ ఒకే దాంట్లోే -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లోే - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget