అన్వేషించండి

Tata Nexon CNG: మైలేజ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్ - టాటా నెక్సాన్ సీఎన్‌జీ లాంచ్ త్వరలో!

Tata Nexon CNG Launch Date: టాటా నెక్సాన్ సీఎన్‌జీ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. సెప్టెంబర్‌లోనే ఈ కారు మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. దీంతో టాటా నెక్సాన్ మోస్ట్ వెర్సటైల్ కారుగా మారిది.

Tata Motors CNG Cars: 2024 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో టాటా నెక్సాన్ చేరింది. ఇప్పుడు టాటా మోటార్స్ ఈ బ్లాక్‌బస్టర్ కారు సీఎన్‌జీ వేరియంట్‌ను విడుదల చేయడం ద్వారా ఈ కారు అమ్మకాలను మరింత పెంచాలనుకుంటోంది. సెప్టెంబర్‌లో టాటా నెక్సాన్ సీఎన్‌జీ మార్కెట్లో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ కొత్త వేరియంట్ లాంచ్‌తో కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో మోస్ట్ వెర్సటైల్ కారుగా టాటా నెక్సాన్ అవతరిస్తుంది.

ఏ విభాగంలో చూసినా కనిపించనున్న నెక్సాన్...
సీఎన్‌జీ వేరియంట్‌లో టాటా నెక్సాన్ లాంచ్ అయిన తర్వాత ఈ కారు అన్ని వేరియంట్‌ల్లో లభ్యమవుతుంది. టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లు ఇప్పటికే మార్కెట్‌లో ఉన్నాయి. దీని తరువాత ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇప్పుడు మార్కెట్లో సీఎన్‌జీ ఆప్షన్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో టాటా నెక్సాన్ సీఎన్‌జీ లాంచ్ అయింది.

Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్

నెక్సాన్ సీఎన్‌జీ ప్రత్యేకత ఏమిటి?
టాటా నెక్సాన్ భారతదేశపు మొట్టమొదటి టర్బో పెట్రోల్ సీఎన్‌జీ వేరియంట్. ఈ కారులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ రెవోట్రాన్ ఇంజన్‌ను అమర్చవచ్చు. ఇది ఈ విభాగంలో అత్యంత శక్తివంతమైన సీఎన్‌జీ వాహనంగా మారింది. ఈ కారు ఇంజన్‌తో 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఇవ్వవచ్చు. అదే సమయంలో టియాగో, టిగోర్ మాదిరిగానే, ఈ కారులో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఫీచర్ కూడా అందించనున్నారు.

ఒకే ఈసీయూ సహాయంతో ఈ కారు ఇంజిన్‌ను సీఎన్‌జీ నుంచి పెట్రోల్‌గా, పెట్రోల్‌ నుంచి సీఎన్‌జీగా సులభంగా మార్చవచ్చు. టాటా మోటార్స్ తన కారులో ట్విన్ సిలిండర్ సీఎన్‌జీ ట్యాంక్‌ను అమర్చిన మొదటి కంపెనీగా నిలిచింది. ఇప్పుడు ఈ ఫీచర్ హ్యుందాయ్ కార్లలో కూడా అందుబాటులో ఉంది. ఇదే ఫీచర్‌ను టాటా నెక్సాన్‌లో కూడా చేర్చే అవకాశం ఉంది. టాటా మోటార్స్ తీసుకువచ్చిన ఈ కారు 230 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. భారతీయ మార్కెట్లో టాటా నెక్సాన్ సీఎన్‌జీ వెర్షన్ మారుతి సుజుకి బ్రెజ్జాకు గట్టి పోటీని ఇవ్వనుంది.

Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి

టాప్ హెడ్ లైన్స్

Spare Tyre Vs Puncture Kit: కారు ప్రయాణంలో టైర్ పంక్చర్ అయితే ఏది ఆదుకుంటుంది? స్పేస్ సేవర్ వీల్, రిపేర్ కిట్ మధ్య అసలు తేడాలివే!
కారులో స్పేర్ వీల్ ఉండటం మంచిదా? పంక్చర్ రిపేర్ కిట్ సరిపోతుందా? ఏది బెస్ట్?
Tata Sierra EV: సేఫ్టీలో సత్తా చాటిన టాటా సియెర్రా ఈవీ: పెద్దలు, పిల్లల రక్షణ పరీక్షల్లో బెస్ట్ స్కోర్లు సొంతం
సేఫ్టీలో సత్తా చాటిన టాటా సియెర్రా ఈవీ: పెద్దలు, పిల్లల రక్షణ పరీక్షల్లో బెస్ట్ స్కోర్లు సొంతం
3-Cylinder Vs 4-Cylinder: 3-సిలిండర్‌ లేదా 4-సిలిండర్‌.. మీ ఫ్యామిలీ కారుకు ఏ ఇంజిన్ సరిపోతుందో తెలుసుకోండి
3 సిలిండర్ ఇంజిన్‌ vs 4 సిలిండర్ ఇంజిన్.. ఏ కారు బెస్ట్? మైలేజ్, పెర్ఫార్మెన్స్‌, వైబ్రేషన్స్‌ పూర్తి వివరాలు
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Embed widget