Tata Nexon CNG Review: టాటా నెక్సాన్ సీఎన్‌జీ ఎలా ఉంది? - మైలేజీ ఎంత ఇస్తుంది?
Tata Nexon CNG: ఆటోమొబైల్ దిగ్గజ బ్రాండ్ ఇటీవలే మనదేశంలో టాటా నెక్సాన్ సీఎన్‌జీని లాంచ్ చేసింది. ఈ కారు ఎలా ఉంది?
Tata Nexon CNG First Review: గత కొన్నేళ్లుగా పెట్రోల్, డీజిల్ కంటే సీఎన్‌జీ కార్లకు డిమాండ్ పెరిగింది. ఎందుకంటే డీజిల్ కార్లు ఎకో ఫ్రెండ్లీగా ఉండటంతో పాటు ధర కూడా తక్కువ. టాటా ఇటీవల లాంచ్ చేసిన సీఎన్‌జీ కారు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు టాటా నెక్సాన్ సీఎన్‌జీ గురించి చెప్పుకుందాం. టాటా నెక్సాన్ అనేది టాటా మోటార్స్ లాంచ్ చేసిన మొట్టమొదటి టర్బో ఛార్జ్డ్ సీఎన్‌జీ కారు. ఇది డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ కారు 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది.
టాటా నెక్సాన్ సీఎన్‌జీ ఎక్స్ షోరూం ధర రూ. 8.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది 8 ట్రిమ్ లెవల్స్‌ను కలిగి ఉంది. ఇందులో స్మార్ట్ (వో), స్మార్ట్ ప్లస్, స్మార్ట్ ప్లస్ ఎస్, ప్యూర్, ప్యూర్ ఎస్, క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్, ఫియర్‌లెస్ ప్లస్ ఎస్ వేరియంట్లు ఉన్నాయి. దీని టాప్ స్పెక్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 14.59 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాటా మోటార్స్ మొట్టమొదటి టర్బో ఛార్జ్డ్ సీఎన్‌జీ కారు డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చింది.
టాటా నెక్సాన్ సీఎన్‌జీ ఇంజిన్ ఎలా ఉంది? (Tata Nexon CNG Engine)
టర్బో పెట్రోల్ ఇంజన్‌తో ఆధారితమైనప్పుడు ఇది 118 బీహెచ్‌పీ పవర్‌ని, 170 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీతో ఇది 99 బీహెచ్‌పీ పవర్‌ని, 170 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ట్విన్ సిలిండర్ ఐ-సీఎన్‌జీ రెండు 30 లీటర్ సిలిండర్లను బూట్ ఫ్లోర్ కింద చూడవచ్చు. ఇది పూర్తి బూట్ స్పేస్‌ను అందిస్తుంది. టాటా నెక్సాన్ సీఎన్‌జీ ఇంధన సామర్థ్యం గురించి మాట్లాడితే ఇది 24 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
టాటా నెక్సాన్ డిజైన్, సెక్యూరిటీ ఫీచర్లు... (Tata Nexon Design)
కారు డిజైన్ గురించి చెప్పాలంటే నెక్సాన్ సీఎన్‌జీ దాని ఇతర మోడల్స్ అంటే డీజిల్, పెట్రోల్ మాదిరిగానే ఉంటుంది. టాటా నెక్సాన్ సీఎన్‌జీలో మీరు 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టూ స్పోక్ స్టీరింగ్ వీల్, ఇతర ఫీచర్లను పొందుతారు. ఈ సీఎన్‌జీ కారులో మీకు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, ఏబీఎస్-ఈబీడీ, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎంలు, వెనుక డి ఫాగర్ వంటి ఆప్షన్లు కూడా అందించారు. దీంతో పాటు గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్‌లో టాటా నెక్సాన్ సీఎన్‌జీ 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది.
మార్కెట్‌లో టాటా సీఎన్‌జీ కారు మారుతి సుజుకి బ్రెజ్జా సీఎన్‌జీతో పోటీపడుతుంది. ధర పరంగా ఇది మారుతి సుజుకి ఫ్రాంక్స్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సీఎన్‌జీ వేరియంట్‌లతో పోటీ పడుతుంది.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే