అన్వేషించండి

Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Tata Curvv EV Launched: మనదేశంలో మోస్ట్ అవైటెడ్ కార్లలో టాటా కర్వ్ ఒకటి. ఇందులో ఈవీ వెర్షన్‌ను టాటా భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కారు ఎక్స్-షోరూం ధర రూ.17.49 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

Tata Curvv EV Launched in India: ఎంతో కాలం ఎదురుచూపుల తర్వాత దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు టాటా మోటార్స్ ఎట్టకేలకు టాటా కర్వ్ ఈవీని లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ఇంజిన్‌తో లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 17.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఎంత దూరం వెళ్లవచ్చు?
కంపెనీ రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్‌లతో టాటా కర్వ్ ఈవీని లాంచ్ చేసింది. ఇది 55 కేడబ్ల్యూహెచ్, 45 కేడబ్ల్యూహెచ్ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను కలిగి ఉంది. దీనితో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. 1.2సీ ఛార్జింగ్ టెక్నాలజీ సహాయంతో ఈ కారు కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 150 కిలోమీటర్లు ప్రయాణిస్తుందట. దీని బ్యాటరీని 70 కేడబ్ల్యూ ఛార్జర్‌తో కేవలం 40 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ కారు 585 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.

Also Read: మహీంద్రా థార్ 5 డోర్స్‌ వెర్షన్‌ ROXXలో అదిరిపోయే ఫీచర్ - సేల్స్ దుమ్ములేపాలని టార్గెట్

మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో...
టాటా కర్వ్ ఈవీ అనేక అధునాతన ఫీచర్లతో మార్కెట్లోకి రానుందని టాటా మోటార్స్ తెలిపింది. ఇందులో కంపెనీ 123 కేడబ్ల్యూ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ పర్మనెంట్ మాగ్నెట్ శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించింది. ఈ ఎస్‌యూవీ కేవలం 8.6 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది.

మరో ఎలక్ట్రిక్ కారుతో కూడా ఛార్జ్ చేయవచ్చు
కంపెనీ నెక్సాన్ తరహాలో కొన్ని ఉపయోగకరమైన ఫీచర్లను టాటా కర్వ్‌లో అందించింది. ఇది వెహికల్ టు వెహికల్ (V2V), వెహికల్ టు లోడ్ (V2L) ఫంక్షన్‌లను కూడా కలిగి ఉంది. వీ2వీ సిస్టమ్ సహాయంతో మీరు ఒక ఎలక్ట్రిక్ కారును మరొక ఎలక్ట్రిక్ కారుతో ఛార్జ్ చేయవచ్చు. వీ2ఎల్ సాయంతో మీరు మీ కారు నుంచి ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు పవర్ ఇవ్వవచ్చు. ఈ కారులో Arcade.ev టెక్నాలజీని అమర్చారు. ఇది కాకుండా కంపెనీ టాటా ఈవీ ఒరిజినల్స్‌ను కూడా ప్రారంభించింది. దీని ద్వారా కస్టమర్లు కంపెనీ అధికారిక యాక్సెసరీస్‌ను కొనుగోలు చేయవచ్చు.

Also Read: 4 లక్షల స్కూటర్లు వెనక్కి తీసుకుంటున్న సుజుకి- మీ దగ్గర ఉంటే వెంటనే షోరూమ్‌కి తీసుకెళ్లండి

టాప్ హెడ్ లైన్స్

కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!

వీడియోలు

Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget