By: ABP Desam | Updated at : 15 May 2022 11:45 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
టాటా ఏస్ ఈవీ మనదేశంలో లాంచ్ అయింది. (Image Credits: Tata)
భారతదేశపు అతిపెద్ద కమర్షియల్ వాహన తయారీదారు టాటా మోటార్స్ కొత్త వాహనాన్ని లాంచ్ చేసింది. ఎంతో సక్సెస్‌ఫుల్ అయిన చిన్న కమర్షియల్ వాహనం టాటా ఏస్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీన్ని ఎంతో అడ్వాన్స్‌డ్‌గా రూపొందించామని కంపెనీ తెలిపింది.
టాటా ఏస్ లాంచ్ అయిన సరిగ్గా 17 సంవత్సరాలకు దీన్ని కంపెనీ లాంచ్ చేసింది. చిన్న కమర్షియల్ వాహనాల విభాగంలో ఇది ఎంతో సక్సెస్ ఫుల్ వాహనం. ఈ టాటా ఏస్ ఈవీ స్మార్ట్ రవాణా సౌకర్యాలను అందించనుంది. అయితే దీని ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
ఈ కారు సర్టిఫైడ్ రేంజ్ 154 కిలోమీటర్లుగా ఉంది. అంటే ఒకసారి చార్జ్ పెడితే 154 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేయవచ్చన్న మాట. 21.3 కిలోవాట్ బ్యాటరీని ఈ కొత్త టాటా ఏస్‌లో అందించారు. ఈ బ్యాటరీ అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ మెరుగ్గా పనిచేయనుంది. ఇందులో అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టం, రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా అందించనున్నారు.
ఫాస్ట్ చార్జింగ్, రెగ్యులర్ చార్జింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. రెగ్యులర్ చార్జింగ్ మోడ్‌లో 20 శాతం నుంచి 80 శాతం చార్జ్ కావడానికి ఆరు నుంచి ఏడు గంటల సమయం పట్టనుంది. ఫాస్ట్ చార్జింగ్ మోడ్‌లో అయితే కేవలం 105 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం చార్జింగ్ ఎక్కనుంది. దీని ఎలక్ట్రిక్ మోటర్ 36 బీహెచ్‌పీ, 130 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది.
తేలికైన పదార్థాలతో ఈ ఏస్ ఈవీని రూపొందించారు. దీని కార్గో వాల్యూమ్ 208 క్యూబిక్ మీటర్లుగా ఉంది. పేలోడ్ కెపాసిటీ 600 కేజీలుగా ఉంది. ఈ టాటా ఏస్ ఈవీ సక్సెస్ కావడం కోసం అమెజాన్, బిగ్ బాస్కెట్, సిటీ లింక్, మోఈవింగ్, ఏలో ఈవీ, ఫ్లిప్‌కార్ట్, లెట్స్ ట్రాన్స్‌పోర్ట్, డాట్ కంపెనీలతో టాటా ఒప్పందం కుదుర్చుకుంది. ఎంవోయూ ప్రకారం ఈ కంపెనీ 39 వేల ఏస్ ఈవీలను డెలివరీ చేయనుంది.
TATA Car July Discounts : టాటా కారు కొంటున్నారా? ఈ నెల డిస్కౌంట్స్ వివరాలు ఇవిగో
Maruti Brezza vs Hyundai Venue: కొత్త మారుతి బ్రెజా, హ్యుండాయ్ వెన్యూ ఫేస్లిఫ్ట్ల్లో ఏది బెస్ట్?
Royal Enfield Hunter 350: అత్యంత చవకైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వచ్చేస్తుంది - ధర ఎంతంటే?
New Brezza Vs Old Vitara Brezza: కొత్త బ్రెజా, పాత బ్రెజాల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారా? వీటిలో ఏది బెస్ట్ కారో చూసేయండి మరి!
Free Range Rover: రేంజ్ రోవర్ బంపర్ ఆఫర్ - ఉచితంగా స్పోర్ట్ కారు - క్లిక్ చేశారంటే?
Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !
జియో యూజర్స్‌కు గుడ్ న్యూస్, ఈ ప్లాన్స్ తీసుకుంటే Netflix, Amazon Prime సబ్స్క్రిప్షన్ ఉచితం
YS Sharmila : ఏపూరి సోమన్నపై దాడి - వర్షంలోనే షర్మిల దీక్ష !
Shruti Haasan Health: క్రిటికల్ కండిషన్ లో శృతిహాసన్ - రూమర్స్ పై మండిపడ్డ నటి!