Maruti Brezza Vs Tata Nexon: ఆఫీసుకు వెళ్లేవారికి మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్‌లో ఏ SUV మంచిది? నిమిషాల్లో తేడా తెలుసుకోండి
Maruti Brezza Vs Tata Nexon: మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్ రెండూ ప్రజల్లో మంచి ఆదరణ కలిగిన కాంపాక్ట్ SUVలు. ఆఫీసుకు వెళ్లడానికి ఉత్తమమైనది ఏదో ఫీచర్లు, భద్రత విషయంలో ఏది బెస్టో ఇక్కడ తెలుసుకోండి.

Maruti Brezza Vs Tata Nexon: మీరు ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లడానికి కాంపాక్ట్ SUV కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వార్త బాగా ఉపయోగపడుతుంది. చాలామంది Maruti Brezza, Tata Nexon చాలా మంచివి అని చెబుతారు. వాటిలో ఏది బెటరో తెలుసుకునేందుకు ఈ వార్త మీకు యూజ్ అవుతుంది. రెండు SUVలు భారతీయ మార్కెట్లో నమ్మకం, పనితీరు, మైలేజీకి ప్రసిద్ధి చెందాయి. ఆఫీసుకు వెళ్లేవారికి ఏ SUV మంచిదో చూద్దాం.
బడ్జెట్ ప్రకారం ఏది మంచి ఎంపిక?
ధర గురించి మాట్లాడితే, Tata Nexon, Maruti Brezzaతో పోలిస్తే కొంచెం చౌకగా ఉంటుంది. Nexon ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.32 లక్షలు, అయితే Brezza ధర రూ.8.26 లక్షలతో ప్రారంభమవుతుంది. Nexon టాప్ వేరియంట్ రూ. 13.79 లక్షల వరకు ఉంటుంది, అయితే Brezza టాప్ వేరియంట్ రూ.12.86 లక్షలకు అందుబాటులో ఉంది. మీ బడ్జెట్ పరిమితంగా ఉంటే, Nexon మరింత ఆర్థిక ఎంపికగా మారుతుంది. అయితే, Brezza తక్కువ నిర్వహణ ఖర్చు, దాని బలమైన రీసేల్ విలువ ఆఫీసు వినియోగదారులకు దీర్ఘకాలంలో మంచిది.
ఇంజిన్, పనితీరు
Tata Nexon రెండు ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్, AMT, DCT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉన్నాయి. Nexon టర్బో ఇంజిన్ ఓవర్టేకింగ్, హైవే డ్రైవింగ్‌లో మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. Maruti Brezza 1.5 లీటర్ K15C పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో వస్తుంది. Brezza డ్రైవింగ్ ముఖ్యంగా నగరాల్లో స్మూత్, క్లీన్డ్, వైబ్రేషన్-ఫ్రీగా ఉంటుంది, ఇది ప్రతిరోజూ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేసేవారికి మంచిది.
మైలేజ్‌లో ఎవరు ముందుంటారు?
Maruti Brezza పెట్రోల్ వెర్షన్ 19.8 kmpl వరకు మైలేజీని ఇస్తుంది, అయితే దాని CNG వెర్షన్ 25.51 km/kg వరకు ఇస్తుందని పేర్కొంది, అయితే, Tata Nexon పెట్రోల్ వెర్షన్ 17–18 kmpl వరకు మైలేజీని ఇస్తుంది. దాని డీజిల్ వెర్షన్ 24.08 kmpl వరకు మైలేజీని ఇస్తుంది.
ఫీచర్లు - సాంకేతికత
రెండు SUVలు ఫీచర్లపరంగా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి, అయితే Tata Nexon మరింత ఆధునిక, సాంకేతిక-ఆధారిత ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ, JBL సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు, Maruti Brezza 9-అంగుళాల టచ్‌స్క్రీన్, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), ఆటో AC, సన్‌రూఫ, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఆచరణాత్మక ఫీచర్లను కలిగి ఉంది.
భద్రతలో Nexon ముందుంది
భద్రత విషయానికి వస్తే, Tata Nexon భారతదేశంలో అత్యంత సురక్షితమైన SUVలలో ఒకటి. ఇది గ్లోబల్ NCAP, భారత్ NCAP రెండింటి నుండి 5స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీట్ యాంకర్, ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి. Maruti Brezza 4-స్టార్ రేటింగ్‌ను పొందింది. ఇప్పుడు అన్ని వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఉన్నాయి. ఇది ABS, EBD, రియర్ పార్కింగ్ సెన్సర్‌ల వంటి ప్రాథమిక భద్రతా లక్షణాలను కూడా కలిగి ఉంది. అయితే, మొత్తంమీద, భద్రత విషయంలో Nexon కొంచెం ముందుంది.





















