అన్వేషించండి

Most Expensive Car: తరతరాల సంపాదనా సరిపోదు! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఏది, దాని ధర ఎంత

Most Expensive Car Rolls Royce | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు రోల్స్ రాయిస్ అని తెలిసిందే. ఇందులో La Rose Noire Droptail మోడల్ ప్రపంచంలో ఖరీదైన కారుగా నిలిచింది. ఇందులో ఇద్దరు కూర్చోవచ్చు.

Most Expensive Car Price | ఇతర దేశాలకు పోటీగా భారతదేశంలోనూ పలు ప్రముఖ కంపెనీల కొత్త కార్లు విడుదలవుతున్నాయి. కానీ కొన్ని కార్లపై అందరి దృష్టి పడుతుంది. ఈ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఏది అని తెలుసుకునేందుకు ప్రజలు సాధారణంగా ఆసక్తి చూపుతారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఏది, ఆ కారు ధర ఎంత, ఏం ఫీచర్లు ఉన్నాయో ఇక్కడ మీకు అందిస్తున్నాం. 

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో ఖరీదైన, లగ్జరీ కార్లు విడుదలయ్యాయి. అయితే ఈ కార్లన్నింటిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు రోల్స్-రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్‌టైల్ (Rolls Royce La Rose Noire Droptail). రోల్స్ రాయిస్ ఈ కారును ఆగస్టు 2023లో గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కారు దాదాపు 30 మిలియన్ డాలర్ల ధరతో విడుదలైంది. ఆ సమయంలో భారత కరెన్సీలో ఈ కారు ధర 211 కోట్ల రూపాయలు.

రోల్స్ రాయిస్ కారు కెపాసిటీ

రోల్స్-రాయిస్ కారులో ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చునేలా డిజైన్ చేశారు. ఈ సూపర్ కారు హార్డ్‌టాప్‌ను మీరు కావాలనుకుంటే తొలగించవచ్చు. రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్‌టైల్‌లో ట్విన్-టర్బో 6.75 లీటర్, V 12 ఇంజిన్ ఉంది. ఈ లగ్జరీ కారు ఇంజిన్ 563 bhp పవర్, 820 Nm టార్క్‌ జనరేట్ చేస్తుంది. ఈ కారు బాడీ కార్బన్, స్టీల్‌తో పాటు అల్యూమినియంతో తయారు చేశారు. 

ఈ ఖరీదైన కారు ప్రత్యేకత

రోల్స్ రాయిస్ కారు La Rose Noire Droptail ప్రత్యేకత ఏమిటంటే.. మీరు పలు వైపులు, డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చూసినప్పుడు కారు బాడీ రంగులు మారుతున్నట్లు కనిపిస్తుంది. ఈ కారు బాడీ పెయింట్‌ను దాదాపు 150 పరీక్షల తర్వాత ఫిక్స్ చేశారు. ఈ రోల్స్ రాయిస్ లగ్జరీ కారును బ్లాక్ బకార రోజ్ రేకులని చూసి డిజైన్ చేశారు. ఈ రకమైన పువ్వులు ఫ్రాన్స్‌లో కనిపిస్తాయి.

Also Read: Expensive Car In India: రూ.100 కోట్ల కారు కొన్న నీతా అంబానీ, భారత్‌లో అత్యంత ఖరీదైన కారు ఫీచర్లు ఇవే

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
Gen-Z Budgeting Hacks : జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
Rashmika : విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
Telangana Police website hacked :  తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
Advertisement

వీడియోలు

సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
రికార్డులు బద్దలు కొట్టీన సఫారీలు ఆసీస్, భారత్‌తో టాప్‌ ప్లేస్‌లోకి..
ఆ ఒక్క క్యాచ్ వదలకుండా ఉంటే భారత్ మ్యాచ్ గెలిచేది
సఫారీలతో రెండో వన్డేలో భారత్ ఘోర ఓటమి
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
Gen-Z Budgeting Hacks : జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
Rashmika : విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
విజయ్ దేవరకొండతో పెళ్లి - నేషనల్ క్రష్ రష్మిక రియాక్షన్
Telangana Police website hacked :  తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
తెలంగాణ పోలీస్‌ వెబ్‌సైట్ హ్యాక్ చేసి బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్! బరితెగించిన సైబర్‌ క్రిమినల్స్‌!
Pushpa 2 Japan Release : 'జపాన్'లో 'పుష్ప' గాడి క్రేజ్ - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
'జపాన్'లో 'పుష్ప' గాడి క్రేజ్ - రిలీజ్ ఎప్పుడో తెలుసా?
IndiGo Flights canceled: ఇండిగోలో సాఫ్ట్‌వేర్ సమస్యలు-  వందల సంఖ్యలో విమానాలు రద్దు - విమానాశ్రయాల్లో క్యూలు
ఇండిగోలో సాఫ్ట్‌వేర్ సమస్యలు- వందల సంఖ్యలో విమానాలు రద్దు - విమానాశ్రయాల్లో క్యూలు
Singer Chinmayi : 'ద్రౌపది' సాంగ్ వివాదం - సింగర్ చిన్మయి సారీ... ట్వీట్ డిలీట్ చేయాలన్న డైరెక్టర్
'ద్రౌపది' సాంగ్ వివాదం - సింగర్ చిన్మయి సారీ... ట్వీట్ డిలీట్ చేయాలన్న డైరెక్టర్
Naga chaitanya Sobhita Marriage : నాగచైతన్య శోభిత మొదటి పెళ్లి రోజు - బ్యూటిఫుల్ మూమెంట్ షేర్ చేసిన శోభిత
నాగచైతన్య శోభిత మొదటి పెళ్లి రోజు - బ్యూటిఫుల్ మూమెంట్ షేర్ చేసిన శోభిత
Embed widget