Hero Splendor Price: ఈ పండుగ సీజన్‌లో హీరో స్ప్లెండర్ కొనడం వల్ల ఎంత లాభం? కొనే ముందు ఈ వివరాలు తెలుసుకోండి
Hero Splendor Price: హీరో స్ప్లెండర్ ప్లస్ 97.2cc BS6 ఇంజిన్, 8.02 PS పవర్, 8.05 Nm టార్క్, 4-స్పీడ్ గేర్బాక్స్ కలిగి ఉంది.

Hero Splendor Price: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హీరో స్ప్లెండర్ ప్లస్ ఇప్పుడు మరింత చౌకగా లభిస్తుంది. GST 2.0 అమలులోకి వచ్చిన తర్వాత, ఈ బైక్ ధర తగ్గి వినియోగదారులకు మరింత అందుబాటులోకి వచ్చింది. మీరు పండుగ సీజన్‌లో కొత్త బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది మీకు సరైన సమయం.
హీరో స్ప్లెండర్ ప్లస్ గతంలో 28% GSTతో రూ. 80,166లకు లభించేది. ఇప్పుడు పన్ను 18%కి తగ్గింది. ఫలితంగా, కస్టమర్‌లు ఇప్పుడు ఈ బైక్‌ను కేవలం రూ. 73,764 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) ప్రారంభ ధరకే కొనుగోలు చేయవచ్చు. అంటే, ఈ ప్రజాదరణ పొందిన బైక్‌పై రూ. 6,402 నేరుగా ప్రయోజనం లభిస్తుంది.
బైక్ డిజైన్ ఎలా ఉంది?
హీరో స్ప్లెండర్ ప్లస్ డిజైన్ ఎల్లప్పుడూ సరళంగా, క్లాసిక్‌గా ఉంటుంది, ఇది అన్ని వయసుల వారిని ఆకర్షిస్తుంది. కొత్త మోడల్‌లో మెరుగైన గ్రాఫిక్స, డ్యూయల్-టోన్ కలర్ ఎంపికలు ఉన్నాయి, అవి - హెవీ గ్రే విత్ గ్రీన్, బ్లాక్ విత్ పర్పుల్, మాట్ షీల్డ్ గోల్డ్. కాంపాక్ట్ బాడీ, తక్కువ బరువు కారణంగా, ఈ బైక్ పట్టణం, గ్రామం రెండింటిలోనూ నడపడానికి సులభం అవుతుంది.
బైక్ ఇంజిన్, మైలేజ్
హీరో స్ప్లెండర్ ప్లస్ 97.2cc BS6 ఫేజ్-2 OBD2B కంప్లైంట్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 8.02 PS పవర్, 8.05 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని గరిష్ట వేగం దాదాపు 87 kmph. దీని గొప్ప లక్షణం దాని మైలేజ్. ఈ బైక్ 70–80 kmpl మైలేజ్ ఇస్తుంది, ఇది ఇప్పటికీ భారతదేశంలో అత్యంత ఇంధన-సమర్థవంతమైన కమ్యూటర్ బైక్‌గా నిలిచింది.
ఈ ఇతర ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి
బడ్జెట్ రైడర్‌ల కోసం హీరో HF డీలక్స్ కూడా మంచి ఆఫ్షన్ కావచ్చు. దీని ప్రారంభ ధర GST తగ్గింపు తర్వాత రూ. 60,738, దీనిపై రూ. 5,805 వరకు తగ్గింపు లభిస్తుంది. అదే సమయంలో, 125cc విభాగంలో నమ్మదగిన ఇంజిన్, సౌకర్యవంతమైన పనితీరుతో హోండా షైన్ 125 రూ. 85,590 నుంచి ప్రారంభమవుతుంది. కస్టమర్‌లు రూ. 7,443 వరకు ఆదా చేయవచ్చు. హోండా SP 125పై అత్యధిక ప్రయోజనం లభిస్తుంది, దీని ప్రారంభ ధర రూ. 93,247, దీనిపై రూ. 8,447 వరకు తగ్గింపు లభిస్తుంది.





















