News
News
X

Skoda Kushaq: సరికొత్తగా స్కోడా కుషాక్ - యానివర్సరీ ఎడిషన్ లాంచ్, ధర, ఫీచర్లు మీ కోసం!

స్కోడా.. కుషాన్ తొలి వార్షికోత్సవ ఎడిషన్ ను ఆవిష్కరించింది. ఈ లేటెస్ట్ కారుకు సంబంధించిన ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

FOLLOW US: 
 
టో మోబైల్ దిగ్గజం స్కోడా దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు సరికొత్త వాహనాలను వినియోగదారుల ముందుకు తీసుకొస్తోంది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా వాహనాలను రూపొందించడంలో స్కోడా ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా స్కోడా కంపెనీ నుంచి సరికొత్త కారు లాంచ్ అయ్యింది. స్కోడా కుషాన్ తొలి వార్షికోత్సవ ఎడిషన్ ను విడుదల చేసింది. మధ్య తరహా SUV అయిన కుషాన్.. వార్షికోత్సవ ఎడిషన్ గా సరికొత్తగా విడుదల అయ్యింది. ఈ కారు 4 వేరియంట్లలో విడుదల చేయబడింది. ఇందులో లైన్ ఫ్లాగ్ షిప్ టాప్ వేరియంట్ ధరను రూ.19.09 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా  కంపెనీ ఫిక్స్ చేసింది.   

కుషాక్ యానివర్సరీ ఎడిషన్  ఫీచర్లు

ఇక ఈ లేటెస్ట్ కారుకు సంబంధించిన ఫీచర్లను పరిశీలిస్తే.. సెల్టోస్, సోనెట్ మాదిరిగానే, స్కోడా కుషాక్ దాని సి-పిల్లర్‌లపై వార్షికోత్సవ ఎడిషన్ బ్యాడ్జ్‌ ను పొందుతుంది. ఇతర ఎక్ట్సీరియర్ ఫీచర్ల గురించి చెప్పాలంటే, కారు పాత రూపంలోనే ఉంది. అవే రంగులతో అందుబాటులో ఉంది. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ కూడా ఉన్నాయి. అదనంగా, కారులో కాంట్రాస్ట్ స్టిచింగ్, డోర్-ఎడ్జ్ ప్రొటెక్టర్లు, బాడీ అంతటా కొంత క్రోమ్ కూడా ఉంది. ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంది. ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉంది. రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో వస్తుంది. మొత్తం 6 ఎయిర్‌ బ్యాగ్‌ లతో మంచి రక్షణ అందిస్తుంది.  ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉన్నాయి. గ్లోబల్ NCAP రేటింగ్‌లలో 5-స్టార్ రేటింగ్ పొందింది.

కుషాక్ యానివర్సరీ ఎడిషన్ ఇంజిన్ ప్రత్యేకత

ఇంజిన్ విషయానికి వస్తే.. హుడ్ కింద, రెండు విభిన్న ఇంజన్‌లు అందుబాటులో ఉన్నాయి. 1.0-లీటర్, టర్బో పెట్రోల్ ఇంజన్ 115bhp శక్తిని, 175 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేసి ఉంటుంది. రెండవది 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో లభిస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ తో  150bhp పవర్, 250 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

News Reels

Also Read: ప్రాణాలు కాపాడిన కారునే మళ్లీ కొన్నాడు, ఇది కదా నమ్మకం అంటే!

కుషాక్ యానివర్సరీ ఎడిషన్  ధరలు

కుషాక్ యానివర్సరీ ఎడిషన్ ధర:

స్టైల్ 1.0 TSI MT- రూ. 15.59 లక్షలు

స్టైల్ 1.0 TSI AT- రూ. 17.29 లక్షలు

స్టైల్ 1.5 TSI MT- రూ. 17.49 లక్షలు

స్టైల్ 1.5 TSI DCT- రూ. 19.09 లక్షలు

Published at : 25 Oct 2022 12:25 PM (IST) Tags: Skoda Skoda Kushaq Anniversary Edition

సంబంధిత కథనాలు

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

Geared Electric Motorbike: దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ రెడీ, స్పెసిఫికేషన్లు, లాంచింగ్ వివరాలు మీకోసం!

Geared Electric Motorbike: దేశంలోనే తొలి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ రెడీ, స్పెసిఫికేషన్లు, లాంచింగ్ వివరాలు మీకోసం!

Brakes Fail: కారు బ్రేకులు ఫెయిల్ అయితే, ఎలా సేఫ్‌గా బయటపడాలో తెలుసా?

Brakes Fail: కారు బ్రేకులు ఫెయిల్ అయితే, ఎలా సేఫ్‌గా బయటపడాలో తెలుసా?

మొట్టమొదటి సీఎన్‌జీ ఎస్‌యూవీ వచ్చేసింది - హైరైడర్‌ను లాంచ్ చేసిన టొయోటా!

మొట్టమొదటి సీఎన్‌జీ ఎస్‌యూవీ వచ్చేసింది - హైరైడర్‌ను లాంచ్ చేసిన టొయోటా!

Car Insurance Premium: కారు ఇన్సురెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ టిప్స్ పాటించండి!

Car Insurance Premium: కారు ఇన్సురెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? జస్ట్ ఈ టిప్స్ పాటించండి!

టాప్ స్టోరీస్

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Vizag Traffic Restrictions: ఈ 4న విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు - వాహనాల మళ్లింపులు & పార్కింగ్ వివరాలు ఇలా

Vizag Traffic Restrictions: ఈ 4న విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు - వాహనాల మళ్లింపులు & పార్కింగ్ వివరాలు ఇలా