Second Hand Cars: సెకండ్ హ్యాండ్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ - ధరలు కూడా పైపైకి!
Used Cars Demand in India: భారతదేశంలో సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.
Used Cars Demand: ఈ మధ్య కాలంలో కొత్త కార్లతో పాటు సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు కూడా పెరిగాయి. గత రెండేళ్లలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌లో సగటు ధరలు రూ.3-3.5 లక్షల నుంచి రూ.6-6.5 లక్షలకు పెరిగాయి. కార్ ట్రేడ్ గ్రూప్ సీఈవో వినయ్ సంఘీ ప్రకారం కొత్త కారు స్టిక్కర్ ధర కూడా దాదాపు 30 శాతం పెరిగింది. దీని ప్రభావం సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌పై కూడా కనిపించింది. ఇందులో అన్ని రకాల కార్లు ఉంటాయి. సెకండ్ హ్యాండ్ కార్లు కొనేటప్పుడు చాలా మంది కస్టమర్లు టాప్ ఎండ్ వేరియంట్ ఆప్షన్‌ను ఎంచుకుంటారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌లో డిమాండ్ పెరగడం వల్ల కాస్త పాత ఎస్‌యూవీలు హ్యాచ్ బ్యాక్ ధరకే అందుబాటులోకి రానున్నాయి. కార్స్24 సర్వీసెస్ సహ వ్యవస్థాపకుడు, సీఎంవో గజేంద్ర జంగిద్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉపయోగించిన ఎస్‌యూవీ ధర సుమారు రూ. 3.5 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అయితే హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 2 లక్షల నుంచే ప్రారంభం అవుతుంది.
స్పిన్నీ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన నీరజ్ సింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. అయితే లగ్జరీ సెగ్మెంట్లో మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, ఆడీ క్యూ3, బీఎండబ్ల్యూ ఎక్స్1 సిరీస్ వంటి ప్రత్యేక మోడల్‌లు మరింత ప్రజాదరణ పొందాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లో లభించే టాప్ మోడల్‌ల ధర రూ. 2 లక్షల నుంచి రూ. 7.5 లక్షల వరకు ఉంటుంది. ఈ జాబితాలో గ్రాండ్ ఐ10 ధర రూ. 1.5 లక్షల నుండి ప్రారంభమవుతుంది. బలెనో కోసం మీరు 4.7 లక్షల నుంచి 7.1 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రెనో క్విడ్‌ను సెకండ్ హ్యాండ్‌లో కొనాలనుకుంటే రూ. 2.49 లక్షల నుంచి రూ. 4.9 లక్షల ధర మధ్యలో కొనుగోలు చేయవచ్చు.
జాటో డైనమిక్స్ ప్రెసిడెంట్ రవి భాటియా మాట్లాడుతూ, ‘ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ ఎస్‌యూవీలకు అనుకూలంగా వేగంగా మారుతోంది. ఇవి ధర పరంగా ఖరీదైనవి. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌లో కూడా వీటి ప్రవేశం ప్రారంభమైంది. దీని కారణంగా చాలా మంది కొత్త ఎంట్రీ లెవల్ కార్ కొనుగోలుదారులు మంచి, పెద్ద బి-సెగ్మెంట్ కార్లను మరిన్ని ఫీచర్లతో కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ధర దాదాపు ఒకే విధంగా ఉంటుంది. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. అంతే కాకుండా ఇందులో కొత్త ఆఫర్లేమీ కనిపించలేదు.’ అన్నారు.
సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ ప్రస్తుతం 5.5 మిలియన్ యూనిట్లుగా ఉంది. 4 మిలియన్ యూనిట్ల కొత్త ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌తో పోలిస్తే వార్షిక రేటు 10 నుంచి 12 శాతం పెరుగుతోంది.
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!